Hrithik Roshan Praises Rishab Shetty And His Film Kantara, Deets Inside - Sakshi
Sakshi News home page

Hrithik Roshan: క్లైమాక్స్ గూస్‌ బంప్స్‌ తెప్పించింది.. కాంతారపై హృతిక్ ప్రశంసల వర్షం

Published Mon, Dec 12 2022 5:25 PM | Last Updated on Mon, Dec 12 2022 5:40 PM

Hrithik Roshan is all praise for Rishab Shetty and his film Kantara - Sakshi

కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’. ఓ ప్రాంతీయ సినిమాగా వచ్చి పాన్‌ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. కంటెంట్‌ ఉంటే అది చిన్న సినిమా అయిన ప్రేక్షకులు ఆదరిస్తారని కాంతార మరోసారి రుజువు చేసింది. తాజాగా ఈ చిత్రంపై బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం నుంచి చాలా నేర్చుకున్నానని వెల్లడించారు. రిషబ్ నటన అసాధారణమైందని వర్ణించారు. 

(ఇది చదవండి: ‘కాంతార’ మూవీపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు)

ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు కాంతార చిత్రాన్ని ప్రశంసించారు. ఇటీవల సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హృతిక్ రోషన్ మాట్లాడారు. రిషబ్ నమ్మకం అసాధారణమైందని కొనియాడారు. హృతిక్ రోషన్ తన ట్వీట్‌లో రాస్తూ..'కాంతార చూడటం ద్వారా చాలా నేర్చుకున్నా. రిషబ్ నమ్మకం ఈ చిత్రాన్ని అసాధారణంగా మార్చింది. ఈ సినిమా క్లైమాక్స్ నాకు గూస్‌బంప్స్ తెప్పించింది.' అంటూ పోస్ట్ చేశారు. హృతిక్ రోషన్‌ ట్వీట్‌కు కాంతార హీరో రిషబ్‌ శెట్టి రిప్లై ఇచ్చారు. ధన్యవాదులు సార్ అంటూ పోస్ట్ చేశారు. ఈ చిత్రం కర్ణాటకలోని గ్రామీణ నేపథ్యంలో భూత కోలా అనే ప్రాంతీయ ఆచారం కథాంశంగా తెరకెక్కించారు.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement