కర్ణాటక దేవాలయాల్లో ఎన్టీఆర్ ప్రత్యేక పూజలు | Jr Ntr And His Family With Rishab Shetty Visits Kolluru Sri Mookambika Temple, Photos Goes Viral | Sakshi
Sakshi News home page

NTR At Mookambika Temple: దైవ చింతనలో తారక్.. మొత్తం దేవాలయాలన్నీ తిరిగేస్తూ

Sep 1 2024 4:31 PM | Updated on Sep 1 2024 5:50 PM

Ntr And his family At Kolluru Sri Mookambika Temple

జూ.ఎన్టీఆర్ ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క ప‌ర్య‌ట‌న‌లో ఉన్నాడు. కుటుంబంతో క‌లిసి మంగ‌ళూరు వెళ్లిన తారక్.. అక్క‌డ ఉన్న ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నాడు. తార‌క్‌తో పాటు అత‌డి వెంట 'కాంతార' ఫేమ్ న‌టుడు రిష‌బ్ శెట్టి, 'సలార్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నాడు.

(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8 ఫైనల్ లిస్ట్ ఇదే.. వీళ్లు పక్కా!)

శ‌నివారం సాయంత్రం త‌న అమ్మ కోరిక మేర‌కు ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంను ద‌ర్శించుకున్న తార‌క్.. ఆదివారం కొల్లురులోని మూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లాడు. ఉద‌యం పంచెక‌ట్టులో ఆల‌యానికి వెళ్లిన తార‌క్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అనంత‌రం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తార‌క్‌తో పాటు రిష‌బ్ శెట్టి, ప్ర‌శాంత్ నీల్ కూడా మూకాంబిక అమ్మవారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

'దేవర' సినిమా చేసిన తారక్.. సెప్టెంబరు 27న థియేటర్లలో ఈ సినిమాతో పలకరించనున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్‌తో కలిసి పనిచేస్తాడు. కొన్నిరోజుల క్రితం పూజా కార్యక్రమంతో ప్రాజెక్ట్ లాంచ్ అయింది. ఇక నవంబరులో షూటింగ్ ప్రారంభించనున్నారు. డిసెంబర్ నుంచి తారక్ షూట్‌లో పాల్గొంటాడు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టితో కలిసి కర్ణాటకలోని దేవాలయాల్ని ఎన్టీఆర్ సందర్శించడం వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: అభిమానులను ఉద్దేశిస్తూ చిరంజీవి ట్వీట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement