
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేని అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ముఖ్యంగా ఏపీలోని కోస్తా జిల్లాలు వణికిపోయాయి. అదేరీతిలో హైదరాబాద్ వంటి మహానగరం కూడా వర్షపు నీటితో జలమయం అయింది. భారీ వర్షాల వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చిరంజీవి తాజాగా ట్వీట్ చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని ఆయన కోరారు.
'తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే.. అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను' అని చిరు పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల భారీగా వర్షాలు పడుతున్నాయి. అయితే, ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు కళింగపట్నం వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే... అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం…— Chiranjeevi Konidela (@KChiruTweets) September 1, 2024