
'కాంతార' ఫేమ్ హీరో రిషబ్ శెట్టి ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు. దాదాపు 24 ఏళ్ల తర్వాత తన కల నిజమైందని చెబుతూ తెగ ఎగ్జైట్ అయిపోయాడు. తమిళ హీరో విక్రమ్‌ని కలుసుకున్న సందర్భంగా ఇదంతా చెప్పుకొచ్చాడు. ఇంతకీ అసలు వీళ్లు ఎక్కడ కలుసుకున్నారు? రిషబ్ ఇంకేమన్నాడు?
(ఇదీ చదవండి: వయనాడ్ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే?)
'నటుడిగా నేను కెరీర్ ప్రారంభించడానికి విక్రమ్ స్ఫూర్తి. ఆయన్న కలవడం నా 24 ఏళ్ల కల. ఈ రోజు నా దేవుడిని కలిశాను. ప్రస్తుతం ఈ భూమ్మీద అదృష్టవంతుడిని నేనే అనిపిస్తోంది. నాలాంటి ఎంతోమంది ఆర్టిస్టుల్లో ఆయన స్ఫూర్తి నింపుతున్నారు. ఈ విషయంలో ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. లవ్ యూ విక్రమ్ సర్' అని రిషబ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి భావోద్వేగానికి లోనయ్యాడు.
విక్రమ్ నటించిన 'తంగలాన్' ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ జరగ్గా.. తాజాగా బెంగళూరు వెళ్లారు. ఈ క్రమంలోనే రిషబ్.. విక్రమ్‌ని కలిశాడు. తన సంతోషాన్ని ఫొటోలు, పోస్ట్ రూపంలో షేర్ చేసుకున్నాడు.
(ఇదీ చదవండి: బంగ్లాదేశ్ అల్లర్లలో విషాదం.. యంగ్ హీరోని కొట్టి చంపారు!)
Comments
Please login to add a commentAdd a comment