
సాక్షి, ముంబై: నిసర్గ తుఫాను నేపథ్యంలో కురిసిన వర్షం కారణంగా ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో రన్ వై మీద వరద నీరు చేరుకుంది. గురువారం బెంగుళురు నుంచి వచ్చిన ఫెడెక్స్ కార్గో విమానం రన్ వే నుంచి దూరంగా ల్యాండ్ అయింది. ఈ విమానానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, విమాన కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగలేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో ముంబై ఎయిర్ పోర్టుకు వచ్చే పలు విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.
తుపాన్ కారణంగా ముంబైకి ఎయిర్ పోర్టుకు వచ్చే మొత్తం 19 విమానాల రాక పోకలను నిలిపి వేస్తున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు ప్రకటించారు. నిసర్గ తుపాన్ ముందు జాగ్రత్త చర్యగా ఎయిర్‌పోర్టును రాత్రి 7గంటల వరకు మూసివేశారు. తుపాను తీవ్రత నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకునేందుకు నగరంలో 144 సెక్షన్ విధించినట్లు గ్రేటర్ ముంబై పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment