ముంబై: భారీ వర్షాలతో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రమంలో తాత్కాలికంగా సేవలను నిలిపివేశారు. విమానాల రాకపోకలకు వాతావరణం అనుకులంగా లేకపోవడంతో సేవలను కాసేపు ఆపేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. వర్షం కారణంగా వాతావరణంలో ఊహించని మార్పులు వస్తుండటంతో విమాన సేవలకు అంతరాయం కలిగింది. ఈ ఉదయం 9:15 గంటల నుంచి వాతావరణం మాట మాటికి మారుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో సేవలను కొనసాగించడం సాధ్యం కాదని ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు విమాన సర్వీసులేవీ రద్దు చేయలేదని, మూడు విమానాలను మాత్రమే దారి మళ్లించినట్టు తెలిపారు. విమాన సంస్థలు ప్రయాణికులకు ఎప్పటికప్పడు సమచారం అందించాలని, అలాగే ప్రయాణికులు వారికి సంబంధించిన విమానాల వివరాలు అడిగి తెలుసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేసినట్లు స్పైస్ జెట్ ట్విటర్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment