hevy rain
-
Rain Alert: రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి,అమరావతి: రానున్న 3-4 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నట్లు విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. 17 వరకు కోస్తా, రాయలసీమలో భారీవర్షాలు పడతాయని చెప్పారు. ఆదివారం కోస్తాలో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, తీరం వెంబడి 40 నుండి 55 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో రానున్న మూడు గంటల వ్యవధిలో ఒకటి, రెండు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.భారీ వర్షాల కారణంగా 24 గంటలు విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తంగా ఉందని ఆర్పీ సిసోడియా తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్,హెల్ప్లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లకు ముందస్తు చర్యలకు ఆదేశాలు జారీ చేశామని, మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని ఆర్పీ సిసోడియా విజ్ఞప్తి చేశారు. -
ఆంధ్రప్రదేశ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు
సాక్షి, అమరావతి : భారీ వర్షంతో ఆంధ్రపద్రశ్కు భారీ ముంపు పొంచి ఉంది. రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 48గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారే అవకాశం ఉంది.ఈ తుఫాను ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాయిగుండం సృష్టించిన విలయం మరువకముందే మరో తుఫాను గండం ముంచుకొస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
విమాన సేవలకు అంతరాయం
ముంబై: భారీ వర్షాలతో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రమంలో తాత్కాలికంగా సేవలను నిలిపివేశారు. విమానాల రాకపోకలకు వాతావరణం అనుకులంగా లేకపోవడంతో సేవలను కాసేపు ఆపేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. వర్షం కారణంగా వాతావరణంలో ఊహించని మార్పులు వస్తుండటంతో విమాన సేవలకు అంతరాయం కలిగింది. ఈ ఉదయం 9:15 గంటల నుంచి వాతావరణం మాట మాటికి మారుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో సేవలను కొనసాగించడం సాధ్యం కాదని ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు విమాన సర్వీసులేవీ రద్దు చేయలేదని, మూడు విమానాలను మాత్రమే దారి మళ్లించినట్టు తెలిపారు. విమాన సంస్థలు ప్రయాణికులకు ఎప్పటికప్పడు సమచారం అందించాలని, అలాగే ప్రయాణికులు వారికి సంబంధించిన విమానాల వివరాలు అడిగి తెలుసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేసినట్లు స్పైస్ జెట్ ట్విటర్లో పేర్కొంది. -
జోరువానలోనూ వైఎస్ జగన్ వెంటే జనం
-
కడపలో భారీ వర్షం
కడప: కడప నగరంలో బుధవారం రాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి రహదారులు, వీధులు, కాలనీలు నీట మునిగాయి. ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం, కోర్డు రోడ్డు, అంబేడ్కర్ కూడలి, ఓంశాంతినగర్, రోడ్డపై మోకాలి లోతులో వర్షపు నీరు ప్రవహిస్తోంది. మురుగు కాలువలన్నీ పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోర్డు ఎదుట ఉన్న రోడ్డుపైకి నడుము లోతు వరకు నీరు రావడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
తెలుగు రాష్ట్రాల్లో తొలకరి