సాక్షి,విశాఖ : రాష్ట్రానికి వానగండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ (బుధవారం) తమిళనాడు - శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని భాతర వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
ఈ అల్పపీడనం దక్షిణ కోస్తా, రాయలసీమపై ఈరోజు, రేపు ప్రభావం చుపనుంది. ఫలితంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. అల్పపీడనం నేపథ్యంలో రేపు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 24 గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. బుధవారం నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వరకు... కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment