కడపలో భారీ వర‍్షం
Published Thu, Aug 24 2017 11:12 AM | Last Updated on Tue, Sep 12 2017 12:56 AM
కడప: కడప నగరంలో బుధవారం రాత్రి నుంచి భారీ వర‍్షం పడుతోంది. రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి రహదారులు, వీధులు, కాలనీలు నీట మునిగాయి. ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం, కోర్డు రోడ్డు, అంబేడ్కర్ కూడలి, ఓంశాంతినగర్, రోడ్డపై మోకాలి లోతులో వర్షపు నీరు ప్రవహిస్తోంది.
మురుగు కాలువలన్నీ పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోర్డు ఎదుట ఉన్న రోడ్డుపైకి నడుము లోతు వరకు నీరు రావడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
Advertisement
Advertisement