సాక్షి,విశాఖ : బలపడటం.. బలహీనపడటం.. మళ్లీ బలపడటం.. ఇలా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రోజుకో రకంగా రూపాంతరం చెంది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచాన వేశారు.
బంగాళాఖాతంలో ఉత్తర ఈశాన్య దిశగా తీరం వెంబడి పయనిస్తూ తీవ్ర ఆలప్పీడనం బలపనుంది. ఈ అల్పపీడనం తొలుత పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించిన తర్వాత వాయుగుండంగా మయన్మార్ వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ గుర్తించింది. వాయుగుండం ఏర్పడిన తర్వాత ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి.
వాయిగుండం తీవ్రతతో తీరం వెంబడి గంటకు 60కి.మీ. వేగంతో గాలులు వీయనున్నాయి. ఈ తరుణంలో ఏపీ తీరంలో మత్స్య కారులు వేట నిషేధం విధించింది. కళింగపట్నం , విశాఖ, కాకినాడ, గంగవరం, మచిలీపట్నం పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment