
సాక్షి, అమరావతి : భారీ వర్షంతో ఆంధ్రపద్రశ్‌కు భారీ ముంపు పొంచి ఉంది. రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 48గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారే అవకాశం ఉంది.
ఈ తుఫాను ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాయిగుండం సృష్టించిన విలయం మరువకముందే మరో తుఫాను గండం ముంచుకొస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment