
రితేశ్ దేశ్‌ముఖ్
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి బుధవారం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శివాజీ జీవితం ఆధారంగా మూడు భాగాల సినిమాను ప్రకటించారు బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్. మరాఠీ చిత్రం ‘సైరాట్’ ఫేమ్ నాగ్‌రాజ్ మంజులే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అజయ్–అతుల్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. మొదటి భాగానికి ‘శివాజీ’, రెండో భాగానికి ‘రాజా శివాజీ’, మూడో భాగానికి ‘ఛత్రపతి శివాజీ’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. మొదటి భాగం 2021లో విడుదల కానుంది. ‘‘శివాజీ జయంతికి ఈ సినిమాను ప్రకటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు చిత్రబృందం. సుమారు నాలుగైదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment