పెళ్లై రెండేళ్లు.. పిల్లలు పుట్టాలంటే ముందు ఆ కండీషన్‌! | Serial Actor Lavanya, Shashi Put Two Conditions to Become a Parent | Sakshi
Sakshi News home page

'బ్రో'ని పెళ్లి చేసుకున్న నటి.. రెండేళ్లయినా పిల్లలు ఎందుకు లేరంటే?

Published Mon, Apr 15 2024 2:31 PM | Last Updated on Mon, Apr 15 2024 3:33 PM

Serial Actor Lavanya, Shashi Put Two Conditions to Become a Parent - Sakshi

పెళ్లైన ప్రతి జంటకు ఎదురయ్యే ప్రశ్న.. ఏమైనా విశేషం ఉందా? అని! ఒకప్పుడు డజను కొద్దీ పిల్లల్నీ కనేవారు.. కానీ ఇప్పుడు సంతానం కోసం ఎన్నో పాట్లు పడుతున్నారు. మొన్నటివరకు ఇద్దరు ముద్దు అనుకునేవారు కూడా ఒక్కరు చాలని భావిస్తున్నారు. మరికొందరైతే లైఫ్‌లో సెటిలయ్యాకే పిల్లల గురించి ఆలోచిస్తామంటున్నారు. కానీ ఇక్కడ చెప్పుకునే జంట మాత్రం ఓ కండీషన్‌ పెట్టుకుని మరీ ఇప్పట్లో పిల్లలు వద్దనుకుంటున్నారట!

కండీషన్‌
కన్నడ బుల్లితెర జంట లావణ్య- శశి హెగ్డే కన్నడ సీరియల్స్‌ ద్వారానే ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమకు దారి తీయగా ఇద్దరూ రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు. అయితే అందరి జంటలకూ మాదిరే ఈ జంటకు కూడా పిల్లల్ని ఎప్పుడు కంటారు? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి లావణ్య బదులిస్తూ.. 'నేను, నా భర్త ఇప్పటివరకు హనీమూన్‌కు వెళ్లనేలేదు. రెండుసార్లు ప్లాన్‌ చేసుకుని వెళ్లడమే ఆలస్యం అనుకున్న సమయంలో బంధువులు చనిపోవడంతో ఆగిపోవాల్సి వచ్చింది.

బ్రో అని పిలిచి..
హనీమూన్‌కు వెళ్లాకే పిల్లల గురించి ఆలోచిద్దామని నా భర్త కండీషన్‌ పెట్టాడు. అలాగే నేనూ ఓ కండీషన్‌ పెట్టాను. నన్ను హనీమూన్‌కు మనాలీయో లేదంటే విదేశాలకో తీసుకెళ్లిన తర్వాతే పిల్లల్ని ప్లాన్‌ చేద్దామన్నాను. జూన్‌లో హనీమూన్‌కు వెళ్లబోతున్నాం' అని నటి చెప్పుకొచ్చింది. కాగా రాజారాణి సీరియల్‌ సెట్స్‌లో వీరి పరిచయం బలపడింది. ఈ సీరియల్‌లో లావణ్య.. శశిని బ్రో అని పిలిచేది. తర్వాత అతడే భర్త అవడం విశేషం!

చదవండి: చెల్లితో హీరోయిన్‌ రీల్‌.. నెట్టింట ట్రోలింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement