నేను రామభక్తుడిని.. అయోధ్యలోనే నా పెళ్లి..: నటుడు | Arun Ram Gowda: We Plan to Get Married By This Year End In Ayodhya | Sakshi
Sakshi News home page

Arun Ram Gowda: పదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం.. అయోధ్యలోనే మా పెళ్లి!

Published Sun, Jan 28 2024 11:07 AM | Last Updated on Sun, Jan 28 2024 11:42 AM

Actor Arun Ram Gowda: We Plan to Get Married by This Year End in Ayodhya - Sakshi

పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరిపేందుకు జనాలు ఏమాత్రం వెనుకాడటం లేదు. కొందరైతే తమ స్థోమతకు మించి అప్పు చేసి మరీ పెళ్లిళ్లు చేస్తున్నారు. సామాన్య జనాలే ఇలా ఉంటే సెలబ్రిటీల సంగతి చెప్పనక్కర్లేదు. హల్దీ దగ్గరి నుంచి రిసెప్షన్‌ వరకు అంతా ఘనంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతేకాదు తమ స్వస్థలాలలో కాకుండా ఏదైనా ప్యాలెస్‌లోనో లేదంటే వేరే దేశంలోనో వివాహం చేసుకుంటున్నారు. ఇందుకోసం కోట్లు గుమ్మరించడానికి కూడా వెనుకాడటంలేదు. 

రామభక్తుడిని.. అందుకే..
అయితే కన్నడ నటుడు రామ గౌడ మాత్రం అక్కడో, ఇక్కడో ఎందుకు అయోధ్యలోనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. నటుడు రామ గౌడకు ఐశ్వర్య అనే అమ్మాయితో సోమవారం (జనవరి 22న) నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాలు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇకపోతే ఈ మధ్యే అయోధలో రామమందిరం ప్రారంభం కావడంతో ఆ ప్రదేశంలోనే వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు అరుణ్‌. దీని గురించి అతడు మాట్లాడుతూ.. 'నేను రామభక్తుడిని. అందుకే అయోధ్యలో ఆ రాములవారి సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.

యాక్టింగ్‌తో పాటు బిజినెస్‌
మేమిద్దరం పదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. కెరీర్‌లో స్థిరపడ్డాకే జీవితంలో ముందడుగు వేయాలనుకున్నాం. ఇప్పుడా సమయం వచ్చిందని భావిస్తున్నాం. ఇన్నాళ్లకు పెళ్లికి సిద్ధపడటంతో మా కుటుంబసభ్యులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఐశ్వర్య చాలా నిజాయితీగా ఉంటుంది. ఎంతో అర్థం చేసుకుంటుంది. నాకంటూ ఓ రెస్టారెంట్‌ బిజినెస్‌ కూడా ఉంది. అటు సినిమాలు, ఇటు బిజినెస్‌ బ్యాలెన్స్‌ చేసుకుంటున్నాను. ఆరు నెలల్లో దర్శకుడిగా ఓ సినిమా తీయబోతున్నాను. దాని తర్వాత అంటే ఈ ఏడాది చివర్లో మేము అయోధ్యలో పెళ్లి చేసుకుంటాం' అని చెప్పాడు.

చదవండి: బామ్మ మరణంతో బాధలో కూరుకుపోయా.. అర్థం చేసుకుని..
మిల్కీబ్యూటీ ఇలా మారిపోయిందేంటి? ఇదంతా దాని కోసమేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement