అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో ఉన్నాడు. ప్రియురాలు, నటి పవిత్ర గౌడ కోసం తన గ్యాంగ్‌తో కలిసి రేణుకాస్వామిని చంపేశాడన్న ఆరోపణలతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో అందరూ దర్శన్‌ను తప్పుపడుతుండగా ఆయన అభిమానులు మాత్రం హీరోను వెనకేసుకొస్తున్నారు.
డిప్రెషన్
దర్శన్ చేసిన తప్పు వల్ల ఏ పాపం ఎరుగని అతడి సతీమణి విజయలక్ష్మి ఇబ్బందులు పడుతోందంటోంది సింగర్ షమిత మల్నాడ్. ఆమె మాట్లాడుతూ... జరిగిన సంఘటన వల్ల విజయలక్ష్మి డిప్రెషన్‌కు లోనవుతోంది. బయటకు మాత్రం ధైర్యంగా ఉంటోంది. ఏం మాట్లాడాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న మమ్మల్ని సముదాయిస్తోంది. ఏం జరగదు.. కంగారు పడకూడదని అటు మాకు, ఇటు అభిమానులకు ధైర్యం చెప్తోంది.
అయినా తను ఈ ఒత్తిడి నుంచి త్వరగానే బయటపడుతుంది. తను చాలా స్ట్రాంగ్ మహిళ.. ఈ పరిస్థితిలో తన కుమారుడిని ఎలా చూసుకోవాలి? అటు దర్శన్‌కు ఎలా ధైర్యం చెప్పాలో ఆమెకు బాగా తెలుసు. ఆమెలా ధైర్యంగా నిలబడేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. మాది 20 ఏళ్ల స్నేహం. ఇన్నేళ్లలో తను ఎప్పుడూ కుమారుడికి, భర్తకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. తన కుటుంబాన్ని ఎన్నటికీ విచ్ఛిన్నం కానివ్వదు అని షమిత చెప్పుకొచ్చింది.
చదవండి: మామూలు ఖైదీగానే దర్శన్
Comments
Please login to add a commentAdd a comment