జైలు నుంచి నిర్మాతలకు దర్శన్‌ ఫోన్‌? | No special treatment for Darshan: Karnataka Home Minister | Sakshi
Sakshi News home page

జైల్లో దర్శన్‌కు బిర్యానీ వంటి సదుపాయాలు? మంత్రి ఏమన్నారంటే?

Published Wed, Jul 3 2024 11:44 AM | Last Updated on Wed, Jul 3 2024 12:03 PM

No special treatment for Darshan: Karnataka Home Minister

శివాజీనగర: హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్‌కు జైలులో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించటం లేదని, మామూలు ఖైదీలతో సమానంగా ఉన్నారని హోం మంత్రి జీ.పరమేశ్వర్‌ చెప్పారు. మంగళవారం సదాశివనగరలో తన ఇంటి వద్ద మాట్లాడిన ఆయన, దర్శన్‌కు జైలులో ప్రత్యేక సదుపాయాలు ఇస్తున్నారనే ఆరోపణలను తిరస్కరించారు. జైలులో బిర్యానీ వంటివి ఏవీ ఇవ్వడం లేదు. చూడాలనుకుంటే రండి, నాతో పాటు తీసుకెళ్లి చూపిస్తానన్నారు.  

నూతన చట్టం కింద 66 కేసులు  
కొత్త నేర చట్టాల కింద రాష్ట్రంలో 66 కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 20 కేసులు ఉన్నాయి. నూతన చట్టాల్లో కొన్ని అంశాలు బాగుంటే, మరికొన్ని బాగాలేవు.  వాటి గురించి చర్చించి కేంద్రం దృష్టికి తీసుకొస్తామని హోంమంత్రి తెలిపారు. ఈ కొత్త చట్టాలు దేశమంతటికి సంబంధించినవి. లక్షలాది కేసులు నూతన చట్టం కింద నమోదవుతాయి. ఈ చట్టాల గురించి చర్చలు జరగాల్సి ఉంది. కొన్ని అంశాలపై కేసు నమోదుకు ఆస్కారం లేదు అని తెలిపారు.    

చిన్నారికి ఖైదీ డ్రెస్‌.. అభిమాని అతి  
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి అనే యువకుని హత్య కేసులో అరెస్టయి పరప్పన అగ్రహార జైల్లో హీరో దర్శన్‌ కాలం గడుపుతున్నారు. బయట ఆయన అభిమానులు మాత్రం తలోరకంగా అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఓ అభిమాని తన చిన్నారి కొడుక్కి ఖైదీ డ్రెస్‌ వేసి, జైలులో దర్శన్‌కు ఇచ్చిన ఖైదీ నంబర్‌ 6106ని రాయించాడు. ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై అనేకమంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శన్‌ అభిమానులు మాత్రం అభినందించారు.   

దర్శన్‌ ఆందోళనగా ఉన్నారు: ధనీ్వర్‌  
దొడ్డబళ్లాపురం: నటుడు ధనీ్వర్‌ పరప్పన అగ్రహార జైలులో ఉన్న దర్శన్‌ను మంగళవారం కలిశారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన ఆయన దర్శన్‌ చాలా ఆందోళనగా కనిపించారని, ఆ స్థితిలో ఆయనను చూడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసారు. అంతా మంచే జరగాలని ఆశిస్తున్నానన్నారు.  

జైలు నుంచి నిర్మాతలకు దర్శన్‌ ఫోన్‌?
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టై పరప్పన అగ్రహార జైలులో ఖైదీగా ఉన్న హీరో దర్శన్‌ జైలు నుండే నిర్మాతలకు ఫోన్‌ చేసి బెయిల్‌ ఇప్పించాలని ఒత్తిడి తెస్తున్నాడని సమాచారం. జైలులో ఉన్న ఫోన్‌బూత్‌ నుండి నిత్యం నిర్మాతలకు కాల్‌ చేస్తున్న దర్శన్‌ పలువురు నిర్మాతలతో మాట్లాడుతూ త్వరగా బెయిల్‌ ఇప్పించాలని కోరుతున్నాడట. తోటి ఖైదీల ఫోన్‌ కాల్స్‌ లిమిట్‌ కూడా తానే వినియోగించుకుంటున్నాడట. అంతేకాకుండా అర్ధాంతరంగా నిలిచిపోయిన తన సినిమాల గురించి నిర్మాతలు, డైరెక్టర్లతో చర్చిస్తున్నాడని తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో మాట్లాడని దర్శన్‌ రాత్రయితే ఇలా నిర్మాతలు, డైరెక్టర్లకు కాల్‌ చేస్తున్నాడని సమాచారం.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement