మాజీ సీఎం భార్య హీరోయిన్‌గా అజాగ్రత, ఫస్ట్‌ లుక్‌ చూశారా? | Radhika Kumaraswamy First Look Poster From Ajagratha Movie Out Now - Sakshi
Sakshi News home page

Radhika Kumaraswamy: హీరోయిన్‌గా మాజీ సీఎం భార్య.. లుక్‌ అదిరిపోయిందిగా!

Published Mon, Nov 13 2023 11:27 AM | Last Updated on Mon, Nov 13 2023 11:44 AM

Ajagratha Movie: Radhika Kumaraswamy First Look Poster Out Now - Sakshi

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య, కన్నడ నటి రాధిక ‘అజాగ్రత’ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీతో పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకులను పలకరించనున్నారు. కర్ణాటకలో సూపర్ హిట్ బ్యానర్ అయిన శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ ఈ మూవీ నిర్మిస్తోంది. దర్శకుడు శశిధర్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం అద్భుతమైన సెట్లను వేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి రవి రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

రాధిక కుమారస్వామి బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఏడు భాషల్లో ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఎరుపు రంగు చీర, భారీ నగలతో రాధిక అందంగా నిండుగా కనిపిస్తున్నారు. పోస్టర్‌లో దీపాల వెలుగులు కూడా కనిపిస్తున్నాయి. ది షాడోస్ బిహైండ్ ది కర్మ అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైతం నటించబోతోన్నారు. ఈ యాక్షన్ చిత్రంలో శ్రేయాస్ తల్పడే, సునీల్, రావు రమేష్, ఆదిత్య మీనన్, దేవ్ రాజ్, వినయ ప్రసాద్, శ్రావణ్ ఇలా ఎంతో మంది సౌత్ స్టార్లు నటిస్తున్నారు.

చదవండి: అత్తారింట్లో దీపావళి జరుపుకున్న లావణ్య త్రిపాఠి, ఫోటో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement