Radhika Kumaraswamy
-
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
-
సీన్ మారింది
పెళ్లయిన కథానాయికలు సినిమాల్లో కొనసాగాలంటే ‘కీ’ రోల్స్‌తో సరిపెట్టుకోవాల్సిందే అనే సీన్ మారిపోయింది. పెళ్లయినా, తల్లయినా ‘లీడ్’ రోల్స్ చేయొచ్చనే సీన్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఫార్టీకి దగ్గర్లో, ఫార్టీ ప్లస్ తారలు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ లీడ్ లేడీస్‌గా, రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూ దూసుకెళుతున్నారు. హాలీవుడ్లో ఫార్టీ, ఫిఫ్టీ ప్లస్ తారలు కూడా లీడ్ రోల్స్ చేస్తున్నట్లు ఇండియన్ హీరోయిన్లు చేయడం ఓ శుభ పరిణామం. ఇక ఆ కథానాయికలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. ►లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న నయనతార చేతిలో ఎప్పుడూ మూడు నాలుగు సినిమాలు ఉంటాయి. వాటిలో లేడీ ఓరి యంటెడ్ మూవీస్ మినిమమ్ మూడు అయినా ఉంటాయి. ప్రస్తుతం ఆమె కథానాయికప్రాధాన్యంగా చేస్తున్న చిత్రాల్లో ‘అన్నపూరణి’ (అన్నపూర్ణ), ‘టెస్ట్’ ఉన్నాయి. ‘అన్నపూరణి’ నయనకి 75వ చిత్రం. డిసెంబరు 1న విడుదల కానున్న ఈ చిత్రంలో బ్రాహ్మణ యువతిగా నటించారు నయన. ఈ చిత్రం టీజర్లో మాంసాహారానికి సంబంధించిన బుక్ చదువుతూ కనిపించారామె. ఇక మరో చిత్రం ‘టెస్ట్’. ఇందులో మాధవన్, సిద్ధార్థ్, నయనతార లీడ్ రోల్స్‌లో కనిపిస్తారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురి జీవితాలు క్రికెట్‌తో ఎలా ముడిపడ్డాయనేది ఈ చిత్రం కథాంశం. ► హీరో సూర్యను పెళ్లి (2006) చేసుకుని సుమారు పదేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన జ్యోతిక 2015 నుంచి ఇప్పటివరకూ దాదాపు డజను కథానాయికప్రాధాన్యంగా సాగే చిత్రాల్లో నటించారు. ఆ తరహా చిత్రాలు మరిన్ని చేయడానికి కథలు వింటున్న జ్యోతిక ఇరవయ్యేళ్ల తర్వాత ఇటీవల హిందీలో ‘శ్రీ’, ‘బ్లాక్ మ్యాజిక్’ చిత్రాల్లో లీడ్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే మలయాళంలో ‘కాదల్–ది కోర్’ అనే చిత్రంలో ముమ్ముట్టితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. పదేళ్ల తర్వాత జ్యోతిక మలయాళంలో చేస్తున్న చిత్రమిది. ఇరవయ్యేళ్ల తర్వాత హిందీలో, పదేళ్ల తర్వాత మలయాళంలో సినిమాలు ఒప్పుకున్నారంటే నటిగా తన కెరీర్‌ని ఇంకా విస్తరించేలా జ్యోతిక ప్లాన్ చేసుకుంటున్నారని ఊహించవచ్చు. ►హీరో ఉపేంద్ర భార్య, నటి ప్రియాంక ఓ ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సింగిల్ లెన్స్‌తో తీసిన తొలి చిత్రం ‘క్యాప్చర్’లో ఆమె లీడ్ రోల్ చేశారు. ఒక నటి లీడ్ రోల్ చేసిన ఈ చిత్రానికి లీడ్ రోల్స్ చేస్తూ దూసుకెళుతున్న మరో నటి రాధికా కుమారస్వామి సమర్పకురాలిగా వ్యవహరించడం విశేషం. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా ఏజ్‌తో సంబంధం లేకుండా తగ్గేదే లే అంటూ లీడ్ రోల్స్ చేస్తున్న తారలు ఇంకొందరు ఉన్నారు. ►కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భార్య, నటి రాధికా కుమారస్వామి ఒకేసారి రెండు ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలు ‘అజాగ్రత్త’, ‘భైరా దేవి’లో నటిస్తున్నారు. ‘భైరా దేవి’ సినిమాలో ఆమె అఘోరాగా కనిపించనున్నారు. ఇక ‘అజాగ్రత్త’ ఏడు భాషల్లో విడుదల కానుంది. మామూలుగా స్టార్ హీరోల చిత్రాలు పాన్ ఇండియాగా పలు భాషల్లో విడుదలవు తుంటాయి. కథానాయికప్రాధాన్యంగా సాగే ఓ సినిమా ఏడు భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ కావడం అంటే చిన్న విషయం కాదు. ►నలభయ్యేళ్ల వయసులో ఉన్న తారల్లో త్రిష ఒకరు. ఈ బ్యూటీ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాల్లో కన్నా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం అజిత్ సరసన తమిళంలో ‘విడా ముయర్చి’, మోహన్‌లాల్‌తో మలయాళంలో ‘రామ్’ చిత్రాల్లో నటిస్తున్నారు త్రిష. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘పొన్నియిన్ సెల్వన్ 2’లో యువరాణిగా కనిపించిన త్రిష గత నెల విజయ్ సరసన ‘లియో’తో పాటు ‘ది రోడ్’ అనే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలో కనిపించారు. -
మాజీ సీఎం భార్య హీరోయిన్గా అజాగ్రత, ఫస్ట్ లుక్ చూశారా?
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య, కన్నడ నటి రాధిక ‘అజాగ్రత’ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీతో పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకులను పలకరించనున్నారు. కర్ణాటకలో సూపర్ హిట్ బ్యానర్ అయిన శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ ఈ మూవీ నిర్మిస్తోంది. దర్శకుడు శశిధర్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం అద్భుతమైన సెట్లను వేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి రవి రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాధిక కుమారస్వామి బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఏడు భాషల్లో ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఎరుపు రంగు చీర, భారీ నగలతో రాధిక అందంగా నిండుగా కనిపిస్తున్నారు. పోస్టర్లో దీపాల వెలుగులు కూడా కనిపిస్తున్నాయి. ది షాడోస్ బిహైండ్ ది కర్మ అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైతం నటించబోతోన్నారు. ఈ యాక్షన్ చిత్రంలో శ్రేయాస్ తల్పడే, సునీల్, రావు రమేష్, ఆదిత్య మీనన్, దేవ్ రాజ్, వినయ ప్రసాద్, శ్రావణ్ ఇలా ఎంతో మంది సౌత్ స్టార్లు నటిస్తున్నారు. చదవండి: అత్తారింట్లో దీపావళి జరుపుకున్న లావణ్య త్రిపాఠి, ఫోటో వైరల్ -
ప్రతి ఒక్కరూ మెచ్చే 'ఇద్దరు': హీరోయిన్ సోనీ
యాక్షన్ కింగ్ అర్జున్, రాధికా కుమారస్వామి (కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భార్య), సోని చరిష్టా హీరోహీరోయిన్లుగా నటించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఇద్దరు'. ఎఫ్.ఎస్.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.ఎస్.రెడ్డి సమర్పణలో ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వం వహించారు. ఫర్హీన్ ఫాతిమా నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రముఖ నటుడు జె.డి.చక్రవర్తి, అమీర్ ఖాన్ సోదరుడు ఫైసల్ ఖాన్, స్వర్గీయ కె.విశ్వనాథ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా హీరోయిన్లలో ఒకరైన సోని చరిష్టా మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు సమీర్ కి నా కృతజ్ఞతలు. యాక్షన్ కింగ్ అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం. 'ఇద్దరు' అనే ఈ చిత్రం నా కెరీర్ లో ఓ మైలురాయి. చిత్ర సమర్పకులు డి.ఎస్.రెడ్డి, నిర్మాత ఫర్హీన్ ఫాతిమాకు కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్' అని అన్నారు. (ఇదీ చదవండి: అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!) -
డ్యాన్స్ చేస్తూ జారిపడ్డ నటి.. వీడియో వైరల్
ప్రముఖ నటి రాధిక కుమారస్వామి డ్యాన్స్ చేస్తూ కిందపడ్డ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె కుట్టి రాధికగా పాపులర్ అయ్యింది. కన్నడలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ఈ మధ్య అవకాశాల లేక తెరకు దూరమైంది. ఇటీవల కన్నడ మాజీ సీఎం హెచ్డీ కుమార్‌స్వామిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తెరకు దూరమైనప్పటికి రాధిక తరచూ తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె డాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. చదవండి: షూటింగ్స్ బంద్‌పై సుమన్ షాకింగ్ కామెంట్స్ ఈ క్రమంలో ఆమె కాలు జారి కిందపడిపోయిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఈ వీడియోలో రాధిక తన జిమ్ ట్రైనర్‌తో కలిసి స్టెప్పులేస్తూ కనిపించింది. జిమ్‌లో ఎంతో ఎనర్జీతో డ్యాన్స్ చేస్తున్న ఆమె సడెన్‌గా కాలు జారడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా నీల మేఘ షామా(2002) మూవీతో కన్నడ పరిశ్రమ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిం స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో రాధిక మొదటి భర్త రతన్ కుమార్ ఆగస్ట్ 2002లో గుండెపోటుతో మరణించగా 2010 నవంబర్‌లో మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామిని రెండో వివాహం చేసుకుంది. చదవండి: విడాకులపై ప్రశ్న.. తొలిసారి ఘాటుగా స్పందించిన చై View this post on Instagram A post shared by Radhika kumaraswamy (@radhikakumaraswamy) -
నటి రాధికపై సీసీబీ ప్రశ్నల వర్షం
యశవంతపుర : అక్రమ నగదు బదిలీ ఆరోపణపై నోటీసు అందుకున్న నటి రాధిక కుమార స్వామి శుక్రవారం సీసీబీ ముందు హాజరయ్యారు. ఉదయం తన సోదరుడు రవిరాజ్‌తో పాటు చామరాజపేటలోని సీసీబీ కార్యాలయానికి వచ్చిన ఆమెపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. నిందితుడు యువరాజ్ అకౌంట్ నుండి పెద్దమొత్తంలో నగదు బదిలీపై రాధిక వివరణ ఇచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఓ సినిమాకు సంబంధించి తన ఖాతాకు రూ. 60 లక్షలు జమ అయినట్లు చెప్పారు. అయితే సదరు చిత్ర బృందంతో ఎలాంటి ఒప్పందం లేకుండా నగదు జమ అయినట్లు తెలిపారు. ఆ నగదును తిరిగి వెనక్కి ఇచ్చేసానన్నారు. త్వరలో ఈడీ, ఐటీ అధికారులు కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
చిక్కుల్లో నటి రాధికా కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆర్ఎస్ఎస్ చోటా నాయకుడు యువరాజ్ బ్యాంకు ఖాతా నుంచి నటి రాధికా కుమారస్వామి, మరో నిర్మాతకు కోటి రూపాయిల వరకు బదిలీ అయినట్లు సీసీబీ అధికారులు గుర్తించారు. రాధికాను విచారించాలని నిర్ణయించారు. ఆమె సోదరున్ని ఇప్పటికే ప్రశ్నించి ఈ వంచన కేసులో అనేక విషయాలను సేకరించారు. చదవండి: (స్టాక్ మార్కెట్ నష్టాలు.. కుటుంబం ఆత్మహత్య) తనకు పెద్ద పెద్ద ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు తెలుసు, పనులు ఏవైనా చేయిస్తానని పలువురి నుంచి పెద్దమొతాల్లో నగదును యువరాజ్ స్వాహా చేసినట్లు ఫిర్యాదులు రావడంతో సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే యువరాజ్ కుటుంబానికి– తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నట్లు రాధికా కుమారస్వామి తెలిపారు. ఆమె బుధవారం బెంగళూరు డాలర్స్ కాలనీలో విలేకర్లతో మాట్లాడారు. ఆయన అకౌంట్ నుంచి రూ.15 లక్షలు ఒక సినిమా అడ్వాన్స్‌గా తన ఖాతాకు బదిలీ అయిందన్నారు. తన తమ్ముడు రవిరాజ్ అకౌంట్‌కు ఏమీ బదిలీ కాలేదన్నారు. చదవండి: (నిన్ను చంపేస్తాం..) -
మూడు భాషల్లో ఇద్దరు
అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇద్దరు’. ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వంలో ఫర్హీన్ ఫాతిమా నిర్మిస్తున్నారు. తెలుగు–తమిళ–కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో రాధికా కుమారస్వామి, సోనీ చరిష్టా, జె.డి. చక్రవర్తి, కళాతపస్వి కె.విశ్వనాధ్, హీరో ఆమిర్ ఖాన్ సోదరుడు ఫైసల్ ఖాన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శనివారం అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘ఇద్దరు’ చిత్రంలోని ప్రత్యేక గీతాన్ని దర్శకుడు బోయపాటి శ్రీనుతో చిత్రబృందం విడుదల చేయించింది. ‘‘అర్జున్‌గారితో కలిసి నేను చేసిన స్పెషల్ సాంగ్ బోయపాటి సార్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సోనీ చరిష్టా. ఈ పాట విడుదల కార్యక్రమంలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, చిత్ర సహనిర్మాత శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. -
సీఎం భార్య ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, బెంగళూరు/చెన్నై: కర్ణాటకలో ఐటీ దాడులు కలకలం రేపాయి. ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం ఏకకాలంలో 60 ప్రాంతాలలో దాడులకు దిగడం సంచలనం సృష్టించింది. ప్రధానంగా సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రెండో భార్య రాధిక, సినీ దిగ్గజ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, కన్నడ కంఠీరవ దివంగత రాజ్‌కుమార్ కుమారులు శివరాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ నివాసాల్లో ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. వీరితోపాటు పలువురు నటులు, నిర్మాతల నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో ఐటీ దాడులు నిర్వహించింది. హీరో సుదీప్, ‘కేజీఎఫ్’ నటుడు యశ్, ఈ సినిమా నిర్మాత విజయ్ ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రాజకీయ కక్షసాధింపుతోనే కుమారస్వామి భార్య రాధిక నివాసంలో ఐటీ దాడులు చేపట్టారని జేడీ(ఎస్) నాయకులు ఆరోపిస్తున్నారు. చెన్నైలోనూ ఐటీ దాడులు తమిళనాడు రాజధాని చెన్నైలోని పలు ప్రముఖ హోటళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు. 32 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. పన్ను ఎగవేత కారణంతో శరవణభవన్, అంజప్పార్ తదితర ప్రముఖ హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు. -
సోషల్ మీడియాలో రాధికా కుమారస్వామి హల్చల్
-
సోషల్ మీడియాలో రాధికా హల్చల్
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి కన్నా ఆయన రెండో భార్య రాధికా కుమారస్వామి లేదా కుట్టీ రాధిక ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. మూడు నెలలకు మించి కుమార స్వామి ప్రభుత్వం మనుగడ సాగించలేదంటూ మూడు రోజుల బీజేపీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప శాపనార్థాలు పెడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా ఓ కొత్త ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. రాధికా కుమార స్వామిని ముఖ్యమంత్రిని చేస్తే మూడు నెలలుకాదు, 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగేలా తాము చూసుకుంటామంటూ సోషల్ మీడియా ట్వీటై కూస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి కుమారస్వామికి గవర్నర్ నుంచి ఆహ్వానం అందిన మరుక్షణం నుంచే రాధికా ఫొటోల హల్చల్ మొదలైంది. ముఖ్యంగా పెళ్లికి ముందు ఆమె చేసినట్లుగా భావిస్తున్న బెల్లీ డ్యాన్స్ నేటి కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. రాధికా కన్నడ నటి, నిర్మాత అవడమే కాదు, అందచందాలలో తనకు తానే సాటి. అలాంటి అందమైన తార పక్కన కుమార స్వామిని ఊహించడం కష్టం. ఎక్కువ మంది ఇష్టంగా కాకుండా నిష్ఠూరంగానే కుమార స్వామి భార్యగా ఆమె గురించి చెబుతున్నారు. 2006, లండన్‌లో కుట్టీ రాధికను కుమార స్వామి రహస్యంగా వివాహమాడినట్లు అప్పట్లో కర్ణాటకలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయాన్ని కుమార స్వామి, ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. తాను కుమార స్వామిని పెళ్లి చేసుకున్నట్లు రాధిక మొదటి సారి 2010లో బహిరంగంగా ప్రకటించారు. మొదటి భార్య అనిత బతికి ఉండగా రెండో పెళ్లి చేసుకున్నందుకు తన రాజకీయ జీవితానికి అవాంతరం కలుగుతుందన్న ఉద్దేశంతో కుమార స్వామి తన పెళ్లిపై అప్పటి నుంచి ఇప్పటి వరకు మౌనం పాటిస్తున్నారు. హిందూ వివాహ చట్టం–1955ను ఉల్లంఘించి రాధికను రెండో పెళ్లి చేసుకున్నందున ఆయన ఎంపీ పదవని రద్దు చేయాలంటూ కుమార స్వామిపై 2011లో ఓ కేసు దాఖలైంది. సరైన ఆధారాలు లేవంటూ కోర్టు ఆ కేసును కొట్టివేసింది. కుమార స్వామి కూతురు శ్యామిక కే. కుమార స్వామి పుట్టిన రోజు సందర్భంగా రాధిక, కుమార స్వామి ఫొటోలు ఆన్లైన్లో హల్చల్ చేయడంతో మరోసారి ఆయన వివాహం వివాదాస్పదమైంది. నైనాగాగి సినిమాతో 14వ ఏటనే కుట్టీ రాధికా కన్నడ సినీరంగ ప్రవేశం చేశారు. వాస్తవానికి ఆమె మొదట నటించిన చిత్రం ‘నీల మేఘ శ్యామ’ చిత్రం రెండో చిత్రంగా విడుదలయింది. అప్పటి నుంచే మన రాజకీయ నీల మేఘ శ్యాముడు కుమార స్వామి పట్ల రాధిక ప్రేమ మరులుగొల్పిందేమో! అంటూ సోషల్ మీడియాలో ఛలోక్తులు వస్తున్నాయి. కానీ అప్పటికి ఆమె రతన్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించింది. వారిద్దరు 2000 సంవత్సరంలో గుళ్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. రాధికా తండ్రి మైనర్ బాలికను మోసం చేశారంటూ రతన్ కుమార్‌పై కేసు పెట్టి రాధికకు విడాకులు ఇప్పించారు. 2002లో ఆ రతన్ కుమార్ గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత నాలుగేళ్లకు కుమార స్వామిని పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కుమార స్వామి రాజకీయ నాయకుడికన్నా సినిమా నిర్మాతగా, ఎగ్జిబిటర్‌గా స్థానిక ప్రజలకు ఎక్కువ పరిచయం. కన్నడ, తమిళంలో దాదాపు 22 చిత్రాల్లో హీరోయిన్గా నటించిన రాధిక ‘భద్రాది రాముడు’ అనే ఒకే ఒక్క తెలుగు చిత్రంలో తారక రత్న పక్కన నటించారు. నిర్మాతగా కూడా ఆమె మూడు, నాలుగు చిత్రాలు తీశారు. ‘శ్యామిక ఎంటర్ప్రైజెస్’ అని తన కూతురు పేరిట చిత్ర నిర్మాణ సంస్థను ఆమె ఏర్పాటు చేశారు. ఆమె తీసిన ‘లక్కీ’ చిత్రంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ, మరో నటి రమ్య కూడా నటించారు. ఆమె మొన్నటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కుమార స్వామి, రాధికల వివాహం గురించి మీడియా ముందు ప్రస్థావించారు. వారిద్దరు పెళ్లి చేసుకున్న విషయం తనకు తెలుసునని, వారి కూతురిని కూడా చూశానని చెప్పారు. రాధిక కూడా కూతురు ప్రొడక్షన్ పేరుతో నిర్మించిన ఓ సినిమాకు కూడా ‘హెచ్డీ కుమార స్వామి సమర్పించు’ అని కూడా పెట్టుకున్నారు. చాలా మంది రాజకీయ నాయకులు రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారు ఉన్నారు. తమిళనాడులో డీఎంకే నాయకుడు కరుణానిధి తన మొదటి భార్య పద్మావతి చనిపోయాక, తక్కువ కాల వ్యవధిలో ఇద్దర్ని పెళ్లి చేసుకున్నారు. హిందూ వివాహ చట్టం ప్రకారం అది తప్పే అయినప్పటికీ తమిళనాడు ప్రజలు ఈ పెళ్లిళ్లను గౌరవిస్తారు. అయ్యగారు ఎక్కడికి వెళ్లారని ఎవరైనా అడిగితే చిన్న వీడు (చిన్నింటికి వెళ్లారు) అని గౌరవంగా చెబుతారు. మరో డీఎంకే నాయకుడు టీఆర్ బాలుకు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌కు ఇద్దరు భార్యలున్నారంటూ ఆయన సీఎంగా ఉన్నప్పుడు బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. బీజేపీ ఎంపీగా ఉన్న హేమ మాలిని కూడా మొదటి భార్యకు విడాకుల ఇవ్వని ధర్మేంద్రను చేసుకున్నారు. గుజరాత్‌కు చెందిన హరిజీవన్భాయ్ పటేల్, మధు శ్రీవాత్సవ లాంటి గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా ఇద్దరేసి భార్యలు ఉన్నారు. వారు ఆ విషయాన్ని బహిరంగంగా కూడా చెప్పుకున్నారు. ఎవరైన ఎన్నికల కమిషన్ లేదా కోర్టు వద్దకు వెళ్లి ఇద్దరు భార్యలున్నట్లు రుజువు చేస్తేనే ముప్పు వస్తుంది. కుమార స్వామికి రెండో భార్య ఉన్నట్లు రుజువైనా ఆయన సీఎం పదవి ఎంతో కాలం నిలబడదు. కాకి ముక్కుకు దొండ పండుగా రాధికను అభివర్ణిస్తున్న సోషల్ మీడియా, సినీ నిర్మాతగానే ఆమెను వలలో వేసుకొని ఉంటారని, అది క్యాస్టింగ్ కౌచ్ కాదా? అని ప్రశ్నిస్తున్నారు. -
సస్పెన్స్ కాంట్రాక్ట్
కాంట్రాక్ట్ కుదిరింది. కానీ.. ఎవరు? ఎవరితో? దేనికోసం? కాంట్రాక్ట్ కదుర్చుకున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. అర్జున్ హీరోగా సంజయ్ గొడావత్ సమర్పణలో సమీర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్ఎస్ సమీర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తు్తన్న చిత్రం ‘కాంట్రాక్ట్’. కన్నడ నటి రాధికా కుమారస్వామి కథానాయిక. సీనియర్ దర్శకులు కె.విశ్వనాథ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. నటుడు జేడీ చక్రవర్తి విలన్ పాత్రధారి. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ తమ్ముడు ఫైజల్ ఖాన్ ఈ సినిమాతో సౌత్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ తొలివారంలో విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శక–నిర్మాత సమీర్ మాట్లాడుతూ–‘‘యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. అర్జున్ మల్టీ మిలియనీర్ పాత్రలో నటిస్తున్నారు. టాకీపార్ట్‌తో పాటు మూడు పాటల చిత్రీకరణ పూర్తి అయింది. ఓ పాటను మహారాష్ట్రలో, రెండు పాటలను థాయ్‌లాండ్‌లో చిత్రీకరించనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్. కెమెరా: అమీర్లాల్. -
నయనతార స్థానంలో...?
ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే నానుడి చిత్రసీమకు సరిగ్గా సరిపోతుంది. ఒక పాత్రకు ఎవర్నో అనుకుని, మరెవర్నోతీసుకోవడం ఇక్కడ సర్వసాధారణం. అందుకు బోల్డన్ని ఉదాహరణలున్నాయి. తాజాగా, ‘ఓ మై గాడ్’ని చెప్పొచ్చు. హిందీలో అక్షయ్‌కుమార్, పరేష్ రావల్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం తెలుగులో రీమేక్ కానుంది. పరేష్ రావల్ పాత్రను వెంకటేశ్, అక్షయ్‌కుమార్ చేసిన శ్రీకష్ణుడి పాత్రను పవన్ కల్యాణ్ చేయనున్నారు. ఇందులో వెంకటేశ్ సరసన నయనతార నటిస్తారనే వార్త వచ్చింది. అది కూడా వెంకటేశ్ సరసన ‘రాధ’ చిత్రానికి నయన్ ఇచ్చిన డేట్స్‌ని ‘ఓ మైగాడ్’కి వినియోగించుకోవాలనుకున్నారట. అయితే, ఇప్పుడామె స్థానంలో రాధికా కుమారస్వామిని తీసుకోవాలనుకుంటున్నారన్నది ఫిల్మ్‌నగర్ టాక్. ఇటీవల విడుదలైన ‘అవతారం’లో ముఖ్య పాత్ర చేశారు రాధికా. ఒకవేళ, వెంకటేశ్ సరసన ఆమె అవకాశం కొట్టేస్తే.. ‘ఓ మై గాడ్... వాట్ ఎ గోల్డెన్ చాన్స్’ అని అనుకోకుండా ఉండలేరు.