ప్రముఖ నటి రాధిక కుమారస్వామి డ్యాన్స్ చేస్తూ కిందపడ్డ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె కుట్టి రాధికగా పాపులర్ అయ్యింది. కన్నడలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ఈ మధ్య అవకాశాల లేక తెరకు దూరమైంది. ఇటీవల కన్నడ మాజీ సీఎం హెచ్‌డీ కుమార్‌స్వామిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తెరకు దూరమైనప్పటికి రాధిక తరచూ తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె డాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.
చదవండి: షూటింగ్స్ బంద్‌పై సుమన్ షాకింగ్ కామెంట్స్
ఈ క్రమంలో ఆమె కాలు జారి కిందపడిపోయిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఈ వీడియోలో రాధిక తన జిమ్ ట్రైనర్‌తో కలిసి స్టెప్పులేస్తూ కనిపించింది. జిమ్‌లో ఎంతో ఎనర్జీతో డ్యాన్స్ చేస్తున్న ఆమె సడెన్‌గా కాలు జారడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా నీల మేఘ షామా(2002) మూవీతో కన్నడ పరిశ్రమ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిం స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో రాధిక మొదటి భర్త రతన్ కుమార్ ఆగస్ట్ 2002లో గుండెపోటుతో మరణించగా 2010 నవంబర్‌లో మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామిని రెండో వివాహం చేసుకుంది.
చదవండి: విడాకులపై ప్రశ్న.. తొలిసారి ఘాటుగా స్పందించిన చై
Comments
Please login to add a commentAdd a comment