
యశవంతపుర : అక్రమ నగదు బదిలీ ఆరోపణపై నోటీసు అందుకున్న నటి రాధిక కుమార స్వామి శుక్రవారం సీసీబీ ముందు హాజరయ్యారు. ఉదయం తన సోదరుడు రవిరాజ్‌తో పాటు చామరాజపేటలోని సీసీబీ కార్యాలయానికి వచ్చిన ఆమెపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. నిందితుడు యువరాజ్ అకౌంట్ నుండి పెద్దమొత్తంలో నగదు బదిలీపై రాధిక వివరణ ఇచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఓ సినిమాకు సంబంధించి తన ఖాతాకు రూ. 60 లక్షలు జమ అయినట్లు చెప్పారు. అయితే సదరు చిత్ర బృందంతో ఎలాంటి ఒప్పందం లేకుండా నగదు జమ అయినట్లు తెలిపారు. ఆ నగదును తిరిగి వెనక్కి ఇచ్చేసానన్నారు. త్వరలో ఈడీ, ఐటీ అధికారులు కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం.