
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ ఊచలు లెక్కపెడుతున్నాడు. ప్రియురాలు, నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కోపంతో దర్శన్, అతడి గ్యాంగ్ రేణుకాస్వామిని దారుణంగా కొట్టి చంపారు. అశ్లీల ఫోటోలు పంపడం రేణుకాస్వామి చేసిన తప్పయితే.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అతడి ప్రాణాలు తీయడం దర్శన్ గ్యాంగ్ చేసిన ఘోర తప్పిదం.
ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు
అయితే రేణుకాస్వామి తనక్కూడా అసభ్య ఫోటోలు పంపాడంటోంది కన్నడ నటి చిత్రల్ రంగస్వామి. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన వీడియోలో నటి మాట్లాడుతూ.. 'ప్రస్తుతం దేని గురించి చర్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే! ఆ విషయంలో అంతా బాధగానే ఉన్నారు. రేణుకాస్వామి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ కేసు విషయంలో నేను ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు. కానీ రేణుకాస్వామి చాలామందికి అశ్లీల మెసేజ్‌లు పంపాడన్నది మాత్రం వాస్తవం. పోలీస్ స్టేషన్‌లోనూ తనపై కేసు నమోదైంది.

పనికిమాలిన మెసేజ్‌లు
అలాగే అతడు గౌతమ్ అనే ఫేక్ అకౌంట్‌తో చాలామందికి పనికిమాలిన మెసేజ్‌లు చేసేవాడు. ఆ స్క్రీన్‌షాట్లను నేనిప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తే బాగోదు. కాబట్టి అవి పోస్ట్ చేయడం లేదు. దుస్తుల్లేకుండా ఫోటో లేదా అశ్లీలమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుంటే నేనైతే బ్లాక్ చేసేదాన్ని. కానీ ఇక్కడ ఆశ్చర్యమేంటంటే.. నా ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేసిన లిస్టులో ఆల్‌రెడీ ఇతడి అకౌంట్ కూడా ఉంది. చాలారోజులుగా మౌనంగానే ఉన్నాను. జరుగుతున్న పరిణామాలను చూసి పెదవి విప్పాలనుకున్నాను' అని చిత్రల్ పేర్కొంది. కాగా చిత్రల్ రంగస్వామి బాడీ బిల్డర్. పలు సినిమాల్లో నటించింది. కన్నడ బిగ్‌బాస్ 10వ సీజన్‌లోనూ పాల్గొంది.
చదవండి: థర్డ్ హ్యాండ్ కారు.. వర్షం వస్తే కారులో వాటర్ లీకేజీ..
Comments
Please login to add a commentAdd a comment