ప్రముఖ కన్నడ బుల్లితెర నటుడు చరిత బాలప్పను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. లైంగికంగా వేధిస్తున్నాడంటూ నటి చేసిన ఆరోపణలతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. 29 ఏళ్ల నటికి 2017లో బాలప్పతో పరిచయం ఏర్పడింది. పైకి మంచివాడిగా నటించిన బాలప్ప ఆమెను ప్రేమించాడు. నటి కూడా తిరిగి ప్రేమించాలని వెంటపడ్డాడు. బలవంతపెట్టాడు. అలా ఇద్దరూ శారీరకంగా కలుసుకున్నారు.
బెదిరింపులు
అయితే తనకు డబ్బు కావాలని, అడిగినంత ఇవ్వకపోతే ప్రైవేట్ ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. నటి ఒంటరిగా ఉంటోందని తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్లి నానా రచ్చ చేశాడు. ఈ విషయాలను బయటపెడితే తనకున్న ధనబలంతో, రాజకీయ నాయకుల అండతో నటిపైనే కేసు పెట్టి జైలుకు పంపిస్తానని హెచ్చరించాడు. చంపడానికి కూడా వెనకాడనని బెదిరించాడు. దీంతో నటి పోలీసులను ఆశ్రయించింది. వారు బాలప్పను అరెస్ట్ చేసి విచారణ మొదలుపెట్టారు. కాగా సదరు నటికి ఇదివరకే విడాకులవగా ఒంటరిగా నివసిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment