అక్కడ అదృష్టం పరీక్షించుకోనున్న హీరోయిన్‌! | Aishwarya Rajesh Debut in Sandalwood with Uttarakaanda Movie | Sakshi
Sakshi News home page

Aishwarya Rajesh: తమిళంలో టాప్‌ హీరోయిన్‌.. తొలిసారి ఆ భాషలో మూవీ..

Published Thu, Apr 25 2024 5:14 PM | Last Updated on Thu, Apr 25 2024 5:14 PM

Aishwarya Rajesh Debut in Sandalwood with Uttarakaanda Movie - Sakshi

బుల్లితెర నుంచి వెండి తెరకు ప్రవేశించి ఆరంభంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు ఐశ్వర్య రాజేశ్‌. ఇప్పుడు కోలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్నారు. కాక్కాముట్టై చిత్రం ఐశ్వర్య రాజేష్‌ కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. ఆ చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించారు. అలాగే ధనుష్‌ కథానాయకుడిగా నటించిన వడచెన్నై చిత్రంలో బోల్డ్‌ పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలూ చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తూ బహుభాషా కథానాయికగా పేరు తెచ్చుకున్నారు.

తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. కన్నడంలో సూపర్‌స్టార్‌ శివరాజ్‌ కుమార్, బాలి ధనుంజయ కలిసి నటిస్తున్న ఉత్తరాఖాండ అనే భారీ చిత్రంలో ఐశ్వర్య రాజేష్‌ నటిస్తున్నారు. ఇందులో ఆమె నటుడు బాలి ధనుంజయకు జంటగా దుర్గి అనే ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రాన్ని రోహిత్‌ పడకి దర్శకత్వంలో కేఆర్‌జీ స్టూడియోస్‌ పతాకంపై కార్తీక్‌గౌడ, యోగి జి రాజ్‌ కలిసి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం బీజాపూర్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కాగా ఐశ్వర్య రాజేష్‌ జీవి ప్రకాష్‌కుమార్‌తో కలిసి నటించిన డియర్‌ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తమిళంలో కరుప్పర్‌ నగరం, మోహన్‌ దాస్, తీయవర్‌ కులైగల్‌ నడుంగా చిత్రాలతో పాటు మలయాళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు.  

 

 

చదవండి: 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement