ప్రతి హీరో చివర్లో బోర్‌ కొట్టేస్తాడు.. రిటైర్‌మెంట్‌పై కిచ్చా సుదీప్‌ | Kiccha Sudeep Retirement Plans: Every Hero Becomes a Bore in End | Sakshi
Sakshi News home page

Kiccha Sudeep: హీరోగా ఎంతో కాలం చేయలేం.. రిటైర్‌ అవుతా.. ఇప్పటికే ఎన్నో రిజెక్ట్‌ చేస్తున్నా!

Published Tue, Jan 14 2025 5:50 PM | Last Updated on Tue, Jan 14 2025 5:50 PM

Kiccha Sudeep Retirement Plans: Every Hero Becomes a Bore in End

స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ (Kichcha Sudeep).. కన్నడవారికే కాదు, తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులకూ సుపరిచితులు. ఏళ్ల తరబడి సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న ఆయన రిటైర్‌మెంట్‌ గురించి మాట్లాడాడు. ఓ ఇంటర్వ్యూలో కిచ్చా సుదీప్‌ మాట్లాడుతూ.. నేనేమీ సినిమాలు చేసి అలిసిపోలేదు. కానీ ఒకానొక దశకు వచ్చాక రిటైర్‌మెంట్‌ తీసుకోక తప్పదేమో!

 జీవితాంతం హీరోగా చేయలేం
నేనే కాదు, ప్రతి హీరో కూడా చివర్లో బోర్‌ కొట్టేస్తాడు. జీవితాంతం హీరోగా చేయలేం. ఒక హీరోగా నేను ఎప్పుడూ సెట్‌కు ఆలస్యంగా వెళ్లను. నాకోసం ఎవరూ వెయిట్‌ చేయకుండా చూసుకుంటాను. రేపు పొద్దున నేను సహాయక పాత్రలు చేసినప్పుడు కూడా ఎవరి కోసమో ఎదురుచూస్తూ కూర్చోలేను. అలా అని సహాయక పాత్రలు నాకు చేయాలని లేదు. 

రిజెక్ట్‌ చేస్తున్నా..
ఇప్పుడు నాకు వస్తున్న చాలా సినిమాలను తిరస్కరిస్తున్నాను. స్క్రిప్టు బాగోలేక కాదు, ఇప్పుడు ఈ వయసులో అలాంటి సినిమాలు చేయలేడం ఇష్టం లేక రిజెక్ట్‌ చేస్తున్నాను. రిటైర్‌మెంట్‌ అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీనే వదిలేసి వెళ్లిపోతాననుకునేరు. అలా ఏం కాదు, హీరోగా, విలన్‌గా ఇక చేసింది చాలు అనిపించినప్పుడు దర్శకుడిగానో, నిర్మాతగానో సెటిలైపోతాను అని చెప్పుకొచ్చాడు.

కిచ్చా సుదీప్‌ కెరీర్‌..
సుదీప్‌ 1997లో వచ్చిన తయవ్వ సినిమాతో వెండితెరపై మెరిశాడు. 2000వ సంవత్సరంలో వచ్చిన స్పర్శ చిత్రంతో హిట్‌ అందుకున్నాడు. 2003లో వచ్చిన హుచ్చ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయింది. ఇందులో సుదీప్‌ కిచ్చ రోల్‌లో మెరిశాడు. అప్పటినుంచి సుదీప్‌ కాస్తా కిచ్చా సుదీప్‌ అయ్యాడు. కన్నడలో హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ పోయిన ఆయన 2008లో ఫూంక్‌ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు.

(చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ)

తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ..
2010లో వచ్చిన రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2తో అటు హిందీ, ఇటు తెలుగులో సెన్సేషన్‌ అయ్యాడు. అయితే తెలుగువారిని తన నటనతో కట్టిపడేసింది మాత్రం ఈగ మూవీతోనే. 2012లో వచ్చిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు అప్పటికీ, ఇప్పటికీ.. ఎప్పటికీ మర్చిపోలేరు. ఈగ మూవీ తమిళంలోనూ రిలీజవడంతో అక్కడివారికీ దగ్గరయ్యాడు. తమిళ పులి చిత్రంలో విలన్‌గా నటించాడు. బాహుబలి, సైరా నరసింహా రెడ్డి, విక్రాంత్‌ రోణ, కబ్జా,.. ఇలా పలు సినిమాలు చేశాడు. 

దర్శకుడిగా..
చివరగా మ్యాక్స్‌ మూవీ (Max Movie)లో నటించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్‌ దగ్గర హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం బిల్లా రంగ బాషా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. కిచ్చా సుదీప్‌ నటుడు మాత్రమే కాదు దర్శకుడు, రచయిత, నిర్మాత, సింగర్‌ కూడా! ఈయన డైరెక్షన్‌లో మై ఆటోగ్రాఫ్‌, వీర మదకరి, జస్ట్‌ మాత్‌ మాతల్లి, కెంపె గౌడ, మాణిక్య చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. 

బిగ్‌బాస్‌కు దూరం!
కన్నడ బిగ్‌బాస్‌ షో (Bigg Boss Reality Show) ఆరంభం నుంచి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఓటీటీ వర్షన్‌తో పాటు పదకొండు బిగ్‌బాస్‌ సీజన్లకు ఈయనే వ్యాఖ్యాతగా పని చేశాడు. అయితే వచ్చే ఏడాది నుంచి మాత్రం తాను హోస్టింగ్‌ చేయబోనని ప్రకటించాడు. దీంతో సుదీప్‌ ఫ్యాన్స్‌ నిరాశ చెందారు. మిగతా భాషల్లో బిగ్‌బాస్‌కు వస్తున్నంత ఆదరణ, ప్రాధాన్యత కన్నడలో రావడం లేదని, తన కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడంతోనే ఈ రియాలిటీ షో నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు.

చదవండి: గేమ్‌ ఛేంజర్‌ మూవీకి నా మనసులో ప్రత్యేక స్థానం: రామ్‌ చరణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement