
తమిళ నటుడు దర్శన్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడంటూ ఓ వార్త వైరల్‌గా మారింది. ఇగ్లూ హీరోయిన్ అంజు కురియన్‌తో దర్శన్ పెళ్లిపీటలపై కూర్చున్నాడు. కొందరు నిజంగానే వారికి పెళ్లయిపోయిందని భావిస్తున్నారు. ఈ మేరకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఏదైనా యాడ్‌లో భాగంగానే ఈ పెళ్లి జరిగి ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. వాణిజ్య ప్రకటనలో భాగంగా వీరిద్దరూ పెళ్లి గెటప్‌లో కనిపించినట్లు తెలుస్తోంది. ఈ వెడ్డింగ్ రూమర్స్ గురించి అటు దర్శన్, ఇటు అను ఎవరూ ఇంతవరకు స్పందించలేదు.
కాగా దర్శన్.. కనా అనే క్రికెట్ మూవీలో కీలక పాత్రలో నటించి ఫేమస్ అయ్యాడు. తునివు (తెగింపు), అయలాన్ చిత్రాల్లోనూ మెరిశాడు. అను కురియన్ విషయానికి వస్తే.. నేరం అనే సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది. తమిళ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసింది. ఓజ్లర్ మూవీలో చిన్న పాత్రలో మెరిసింది.
Comments
Please login to add a commentAdd a comment