తిరువనంతపురం: కరోనా ఎంతోమందికి విషాదాన్ని మిగిల్చింది. ఎందరో సినీ ప్రముఖులను ఇండస్ట్రీకి దూరం చేసింది. తాజాగా ప్రముఖ మళయాళ గేయ రచయిత అనిల్ పనాచూరన్ (55) కన్నుమూశారు. కరోనాతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అనిల్ తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అయితే నిన్న రాత్రి 8.30 గంటల సమయంలో గుండెపోటు రావడంతో మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అనిల్ రాసిన అరబ్బీ కథ, కథ పరయుంబోల్, మాడంబి, మేరిక్కుందోరు కుంజాడు, వెలిపాండింటే పాటలు ఎంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. (ప్రముఖ దర్శకుడు కన్నుమూత )
వృతిరీత్యా లాయర్ అయిన అనిల్.. తర్వాత సినిమాల ప్రభావంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అరబిక్కధతో గేయ రచయితగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన రాసిన పాటలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. ఈరన్ మేఘమే మరియు చోరా వీణా మన్నిల్ వంటి పాటలు ఇండస్ట్రీ బిగ్ హిట్‌గా నిలిచాయి. అతి తక్కువ కాలంలోనే 220 కి పైగా పాటలు రాసిన అనిల్ కొన్ని మలయాళ చిత్రాల్లో నటించారు. అనిల్ పనాచూరన్ మృతి పట్ల నటుడు పృథ్వీరాజ్, తోవినో థామస్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. (ఆ సేవలు అభినందనీయం: సోనూ సూద్ )
Comments
Please login to add a commentAdd a comment