
Actor Arjun Sarja Tests Positive For COVID-19: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. సినీ ఇండస్ట్రీని సైతం కరోనా వదలడం లేదు. ఇప్పటికే కరీనా కపూర్, అమృతా అరోరా సహా పలువురు సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు సైతం కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
'నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్యుల సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఐసోలేషన్‌లో ఉన్నాను. కొన్ని రోజులుగా నన్ను కలిసిన వాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నాను. నేను బాగానే ఉన్నాను. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. మాస్క్ తప్పనిసరిగా ధరించండి' అంటూ అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.