ఆన్‌లైన్ ట్రావెల్, టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ క్లియర్‌ట్రిప్‌ను కొనుగోలు చేయనున్నట్లు వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గురువారం(ఏప్రిల్ 4) ప్రకటించింది. క్లియర్ ట్రిప్ 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఈ-కామర్స్ సంస్థ తెలిపింది. ఒప్పందం ప్రకారం, క్లియర్‌ట్రిప్ కార్యకలాపాలు అన్ని ఫ్లిప్‌కార్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతాయి. అలాగే, ఇది ఇలాగే ప్రత్యేక బ్రాండ్‌గా కొనసాగుతుంది. క్యాష్, ఈక్విటీల రూపంలో మొత్తం 40 మిలియన్ డాలర్లను ఫ్లిప్‌కార్ట్ క్లియర్ ట్రిప్‌కు చెల్లించనుంది.
2006లో స్థాపించబడిన క్లియర్‌ట్రిప్ తన మొబైల్ యాప్, వెబ్‌సైట్ నుంచి విమాన, రైళ్లు, హోటళ్లను టికెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం కలిపిస్తుంది. క్లియర్‌ట్రిప్‌లో ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ ట్రావెల్ అండ్ ఎక్స్‌పెన్స్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, డిఎజి వెంచర్స్, గండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొవైడర్ కాంకర్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు పెట్టుబడి దారులుగా ఉన్నాయి. క్లియర్ ట్రిప్ చివరిసారిగా 2016లో నిధుల సమీకరణను చేపట్టింది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ 300 మిలియన్ డాలర్లుగా ఉంది. కరోనాతో విమాన ప్రయాణాలు రద్దవ్వడంతో క్లియర్ ట్రిప్ లాభాలను అందుకో లేకపోయింది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు క్లియర్‌ట్రిప్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకోవడంతో భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందనున్నట్లు కంపెనీ భావిస్తుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment