Cleartrip
-
క్లియర్‌ట్రిప్‌లో వాటాలను కొనుగోలుచేసిన అదానీ..!
న్యూఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్.. ఆన్లైన్ ప్రయాణ సౌకర్యాల(ఓటీఏ) కంపెనీ క్లియర్‌ట్రిప్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసింది. క్లియర్‌ట్రిప్ ప్రయివేట్ లిమిటెడ్‌లో ఇన్వెస్ట్ చేసినట్లు అదానీ గ్రూప్ తాజాగా పేర్కొంది. తద్వారా ప్రస్తావించదగ్గ స్థాయిలో మైనారిటీ వాటాను సొంతం చేసుకున్నట్లు తెలియజేసింది. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో భాగమైన క్లియర్‌ట్రిప్‌లో పెట్టుబడి ద్వారా వినియోగదారులకు అంతరాయాలులేని ప్రయాణ సౌకర్యాలు అందించే యోచనలో ఉన్నట్లు వివరించింది. ఇటీవల విమాన ప్రయాణికుల సంఖ్య తిరిగి ఊపందుకుంటున్నట్లు గ్రూప్ కంపెనీ అదానీ పోర్ట్స్ పేర్కొంది. భారత్‌లోని మెజార్టీ విమానాశ్రయాల నిర్వహణను అదానీ గ్రూప్స్ నిర్వహిస్తున్నాయి. చదవండి: Elon Musk: ‘ఎలన్ మస్క్..పాకిస్థాన్‌ను కొనేస్తారా...!’ -
ఫ్లిప్‌కార్ట్ చేతికి ట్రావెల్ బుకింగ్ క్లియర్‌ట్రిప్
ఆన్లైన్ ట్రావెల్, టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ క్లియర్‌ట్రిప్‌ను కొనుగోలు చేయనున్నట్లు వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గురువారం(ఏప్రిల్ 4) ప్రకటించింది. క్లియర్ ట్రిప్ 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఈ-కామర్స్ సంస్థ తెలిపింది. ఒప్పందం ప్రకారం, క్లియర్‌ట్రిప్ కార్యకలాపాలు అన్ని ఫ్లిప్‌కార్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతాయి. అలాగే, ఇది ఇలాగే ప్రత్యేక బ్రాండ్‌గా కొనసాగుతుంది. క్యాష్, ఈక్విటీల రూపంలో మొత్తం 40 మిలియన్ డాలర్లను ఫ్లిప్‌కార్ట్ క్లియర్ ట్రిప్‌కు చెల్లించనుంది. 2006లో స్థాపించబడిన క్లియర్‌ట్రిప్ తన మొబైల్ యాప్, వెబ్సైట్ నుంచి విమాన, రైళ్లు, హోటళ్లను టికెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం కలిపిస్తుంది. క్లియర్‌ట్రిప్‌లో ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ ట్రావెల్ అండ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, డిఎజి వెంచర్స్, గండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడర్ కాంకర్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు పెట్టుబడి దారులుగా ఉన్నాయి. క్లియర్ ట్రిప్ చివరిసారిగా 2016లో నిధుల సమీకరణను చేపట్టింది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ 300 మిలియన్ డాలర్లుగా ఉంది. కరోనాతో విమాన ప్రయాణాలు రద్దవ్వడంతో క్లియర్ ట్రిప్ లాభాలను అందుకో లేకపోయింది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు క్లియర్‌ట్రిప్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకోవడంతో భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందనున్నట్లు కంపెనీ భావిస్తుంది. చదవండి: గడప గడపకి జియో మార్ట్ సేవలు -
ప్రయాణం.. అప్పటికప్పుడే!
చివరి నిమిషంలో ప్రయాణానికే హైదరాబాదీల మొగ్గు ⇒ 40% ట్రావెల్ బుకింగ్స్ ఆఖర్లో జరుగుతున్నవే ⇒ ఇందులో 54 శాతం వాటా మొబైల్స్ నుంచే ⇒ క్లియర్‌ట్రిప్ సక్సెస్‌కు కారణమిదే ⇒ క్లియర్‌ట్రిప్ సీఎంఓ సుబ్రహ్మణ్య శర్మ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘అనుకున్నదే తడవు’’ అనే నానుడిని భాగ్యనగరవాసులు పక్కా ఫాలో అవుతున్నారు. అందుకేనేమో ముందస్తు ట్రావెల్ బుకింగ్స్ కంటే చివరి నిమిషంలో చేస్తున్నవే ఎక్కువగా ఉన్నాయట. మొత్తం వ్యాపారంలో ఇలా జరుగుతున్నది ఏకంగా 40 శాతానికి చేరిందంటున్నారు క్లియర్‌ట్రిప్ చీఫ్ మార్కెటింగ్ అధికారి (సీఎంఓ) సుబ్రహ్మణ్య శర్మ. ఈ 40 శాతంలో కూడా 54 శాతం బుకింగ్స్ సెల్ఫోన్ల ద్వారా జరుగుతున్నవేనని తెలియజేశారు. ‘దక్షిణ భారతదేశం- ఆన్లైన్ ట్రావెల్ పరిశ్రమ’ అనే అంశంపై మంగళవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే... ⇒ దేశంలో ఆన్లైన్ ట్రావెల్ విభాగం ఏటా 32% వృద్ధిని కనబరుస్తోంది. 19.8ుతో దక్షిణ కొరియా రెండో స్థానంలో నిలవగా.. 18.2%తో బ్రెజిల్, 14.1%తో చైనా ఆ తర్వాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. ⇒ ప్రస్తుతం దేశంలో 40 లక్షల మంది క్లియర్‌ట్రిప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. నెలకు 5 లక్షల మంది కొత్తగా చేరుతున్నారు కూడా. నెలకు 6.5 లక్షల మంది కస్టమర్లు క్లియర్‌ట్రిప్ సేవల్ని స్మార్ట్ఫోన్లు, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ల ద్వారా వినియోగించుకుంటున్నారు. ఇందులో మొబైల్స్ ద్వారా జరుగుతున్న వినియోగం నెలకు 3 శాతం వృద్ధి రేటును కనబరుస్తోంది. ఏటా 30 లక్షల ట్రావెల్ బుకింగ్స్ జరుగుతుంటే.. ఇందులో 70% మంది రిపీటెడ్ కస్టమర్లే. ⇒ ఆన్లైన్ ట్రావెల్స్ బుకింగ్స్‌లో మొబైల్ ఫోన్లదే అగ్రస్థానం. డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లు కొందరికే పరిమితం కనక సెల్‌పైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. అందుకే 2006లో ప్రారంభమైన క్లియర్‌ట్రిప్ సంస్థ.. 2010లో మొబైల్ వెబ్‌సైట్‌ను, 2012లో ఐఓఎస్ యాప్‌ను, 2014లో ఆండ్రాయిడ్ యాప్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆన్లైన్ ట్రావెల్ పరిశ్రమలో మేక్మైట్రిప్ మొదటి స్థానంలో ఉంటే.. మొబైల్ ఫోన్ల ద్వారా ట్రావెల్ బుకింగ్స్‌ను వినియోగించటంలో క్లియర్‌ట్రిప్ మొదటి స్థానంలో ఉంది. ⇒ గతేడాది మా టర్నోవర్ 8 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇందులో 43-44 శాతం వాటా మొబైల్ ఫోన్ల ద్వారా వచ్చిందే. భవిష్యత్తులో మా పెట్టుబడుల్లో 60 శాతం వాటాను మొబైల్ ప్లాట్‌ఫాం, టెక్నాలజీ మీదే పెట్టాలని నిర్ణయించాం. ⇒ క్లియర్‌ట్రిప్ ఆన్లైన్ ట్రావెల్స్ విభాగంలో హైదరాబాద్ వాటా 6 శాతం. ఏటా దేశంలో మొబైల్ ఫోన్ల ద్వారా విమానయాన బుకింగ్స్ 150-160 శాతం వృద్ధి రేటును కనబరుస్తుంటే.. హైదరాబాద్‌లో మాత్రం ఏకంగా 192 శాతం వృద్ధి రేటుంది. హోటల్స్‌కు సంబంధించి హైదరాబాద్‌లో 903 శాతం వృద్ధి ఉంది. ⇒ విమాన టికెట్లకు సంబంధించి మొబైల్ ఫోన్ల ద్వారా 28 శాతం బుకింగ్స్ ఆఖరి నిమిషంలో అవుతుంటే.. డెస్క్‌టాప్‌ల ద్వారా 18 శాతం చేస్తున్నారు. రెండు రోజుల ముందైతే మొబైల్స్ ద్వారా 72 శాతం మంది చేస్తుంటే.. డెస్క్‌టాప్ ద్వారా 82 శాతం మంది చేస్తున్నారు. నెట్ న్యూట్రాలిటీకే మా మద్దతు మూడు నెలలక్రితం కొన్ని టెలికం కంపెనీలతో భాగస్వాములమై మా అప్లికేషన్‌ను ఉచితంగా ఇచ్చాం. అయితే తర్వాతి రోజే ‘‘క్రియర్ట్రిప్ను డౌన్లోడ్ చేసుకోవటం మానేస్తున్నాం. ఎందుకంటే నెట్‌న్యూట్రాలిటీకి మద్దతుగా మేం పోరాడుతున్నాం’’ అని కొందరు కస్టమర్లు ట్వీట్ చేశారు. దీంతో వెంటనే నెట్ న్యూట్రాలిటీకి మేమూ మద్దతు ప్రకటించాం. వారి భాగస్వామ్యం నుంచి వైదొలిగాం. కస్టమర్లు, వారి అభిరుచులు, గౌరవాలే మాకు ముఖ్యం. కొన్ని సంస్థల ప్రయోజనాల కోసం కస్టమర్లను కోల్పోలేం.