
న్యూఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్.. ఆన్‌లైన్ ప్రయాణ సౌకర్యాల(ఓటీఏ) కంపెనీ క్లియర్‌ట్రిప్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసింది. క్లియర్‌ట్రిప్ ప్రయివేట్ లిమిటెడ్‌లో ఇన్వెస్ట్ చేసినట్లు అదానీ గ్రూప్ తాజాగా పేర్కొంది. తద్వారా ప్రస్తావించదగ్గ స్థాయిలో మైనారిటీ వాటాను సొంతం చేసుకున్నట్లు తెలియజేసింది.
ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో భాగమైన క్లియర్‌ట్రిప్‌లో పెట్టుబడి ద్వారా వినియోగదారులకు అంతరాయాలులేని ప్రయాణ సౌకర్యాలు అందించే యోచనలో ఉన్నట్లు వివరించింది. ఇటీవల విమాన ప్రయాణికుల సంఖ్య తిరిగి ఊపందుకుంటున్నట్లు గ్రూప్ కంపెనీ అదానీ పోర్ట్స్ పేర్కొంది. భారత్‌లోని మెజార్టీ విమానాశ్రయాల నిర్వహణను అదానీ గ్రూప్స్ నిర్వహిస్తున్నాయి.
చదవండి: Elon Musk: ‘ఎలన్ మస్క్..పాకిస్థాన్‌ను కొనేస్తారా...!’
Comments
Please login to add a commentAdd a comment