ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ యాపిల్ తమ ఉద్యోగికి అపూర్వ బహుమతి అందించింది. సంస్థలో పదేళ్లు పూర్తి చేసుకున్న ఓ ఉద్యోగి ప్రత్యేకమైన బహుమతి అందుకున్నారు. ఓ వైపు ఆర్థిక మందగమనం కారణంగా అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో ఓ ఉద్యోగి సేవలను గుర్తించి యాపిల్ బహుమతి పంపించడంపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి.
సదరు ఉద్యోగికి వచ్చిన బహుమతిని డాంగిల్‌బుక్‌ప్రో అనే యూట్యూబర్ అన్‌బాక్స్ చేశాడు. అందులో ఏమేమి వచ్చాయో చూపించాడు. సాధారణంగా యాపిల్ సంస్థ తమ ఉద్యోగులకు క్రిస్టల్‌తో తయారు చేసిన అవార్డులు పంపిస్తుంది. కానీ ఈ ఉద్యోగికి అల్యూమినియంతో తయారు చేసిన భారీ పెట్టె లాంటి బహుమతిని పింపించింది. దీనిపై ప్రకాశమంతమైన యాపిల్ లోగో ఉంది. దీంతో పాలిషింగ్ వస్త్రం కూడా ఉంది. ముఖ్యంగా కంపెనీ సీఈవో టిమ్‌కుక్ స్వయంగా సంతకం చేసిన నోట్ సైతం పంపించడం గమనార్హం. ఉద్యోగి పదేళ్ల సర్వీస్‌ను సూచిస్తూ బహుమతిపై 10 సంఖ్యను జోడించడం ప్రత్యేకతగా నిలిచింది.
పెద్దగా ఉద్యోగులను తొలగించని అతికొద్ది కంపెనీల్లో యాపిల్ ఒకటి. గూగుల్, అమెజాన్, మెటా వంటి పెద్దపెద్ద సంస్థలు లేఆఫ్స్ పేరుతో వేలాదిగా ఉద్యోగులను తొలగించడం తెలిసిందే. ఇదే కాక ఆయా సంస్థల్లో ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులకు సైతం జీతాలు తగ్గించడం వంటి చర్యలు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల సేవలను గుర్తించి బహుమతులు పంపించిన యాపిల్ సంస్థను పలువురు అభినందిస్తున్నారు.
(ఇదీ చదవండి: రూ.14 వేలకే ఐఫోన్14.. యాపిల్ బంపర్ ఆఫర్!)
Comments
Please login to add a commentAdd a comment