సీనియర్‌ స్థాయి ఉద్యోగా? బ్యాడ్‌న్యూసే..! | Are you a senior-level employee in an IT firm? | Sakshi
Sakshi News home page

సీనియర్‌ స్థాయి ఉద్యోగా? అయితే బ్యాడ్‌న్యూసే..!

Published Tue, Oct 10 2017 2:47 PM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM

Are you a senior-level employee in an IT firm?  - Sakshi

న్యూఢిల్లీ : దేశీయ ఐటీ ప్రొఫెషినషల్స్‌కు గడ్డు కాలం మరింత పెరుగుతోంది. వచ్చే ఆరు నెలలు కూడా ఐటీ ప్రొఫిషనల్స్‌కు ఉద్యోగవకాశాలు తగ్గిపోనున్నాయని తాజా రిపోర్టులు వెల్లడించాయి. ఆటోమేషన్‌, డిజిటైజేషన్‌ ప్రభావంతో సంప్రదాయ ఉద్యోగాలకు భారీ మొత్తంలో ఆటంకం కలుగనున్నట్టు తెలిపాయి. ఎక్స్‌పెరిస్‌ ఐటి - మ్యాన్‌ పవర్ గ్రూప్ ఇండియా మంగళవారం విడుదల చేసిన ఎక్స్‌పెరిస్‌ ఐటీ ఎంప్లాయ్‌మెంట్‌ అవుట్‌లుక్‌ సర్వే ప్రకారం 2017 అక్టోబర్‌ నుంచి 2018 మార్చి మధ్యలో కూడా ఐటీ నియామకాలు తగ్గిపోనున్నాయని తెలిసింది. అంతేకాక సీనియర్‌ స్థాయిలో లేఆఫ్స్‌ అధికంగా ఉండనున్నాయని సర్వే వెల్లడించింది. ఇటీవల అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం కాగ్నిజెంట్‌ 400 మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ల వాలంటరీ సెపరేషన్‌ ప్యాకేజీని అంగీకరించిందని తెలిపింది. గత కొన్ని నెలల క్రితమే డైరెక్టర్లకు, అసోసియేట్‌ వీపీలకు, సీనియర్‌ వీపీలకు ఈ ప్రొగ్రామ్‌ను ఆఫర్‌ చేసింది. 

క్యాప్‌జెమిని కూడా 35 మంది వీపీ, ఎస్‌వీపీలు, డైరెక్టర్లు, సీనియర్‌ డైరెక్టర్లను కంపెనీని వీడాలని ఆదేశించింది. ఇన్ఫోసిస్‌ కూడా జాబ్‌ లెవల్‌ 6, ఆపై స్థాయి ఉద్యోగులు(గ్రూప్‌ ప్రాజెక్టు మేనేజర్లు, ప్రాజెక్టు మేనేజర్లు, సీనియర్‌ ఆర్కిటెక్ట్స్‌, హైయల్‌ లెవల్స్‌) వెయ్యి మందిని కంపెనీని వీడాలని ఆదేశాలు జారీచేసినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. 10 నుంచి 20 ఏళ్ల అనుభవమున్న మధ్య, సీనియర్‌ లెవల్‌ స్థాయి ప్రొఫెషనల్స్‌పై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని, పెద్దపెద్ద ఐటీ కంపెనీలు వీరిని ఇంటికి సాగనంపడానికి లేఆఫ్స్‌ ప్రక్రియను చేపడుతున్నాయిని సర్వే తెలిపింది.. కేవలం 3 శాతం కంపెనీలు మాత్రమే సీనియర్‌ స్థాయి ఉద్యోగులను నియమించుకోవడానికి మొగ్గుచూపుతున్నాయని వివరించింది. 0-5 ఏళ్ల అనుభవమున్న అభ్యర్థులకు ఎక్కువ డిమాండ్‌ ఏర్పడిందని చెప్పింది. సీనియర్‌ స్థాయిల్లో ఉద్యోగుల లేఆఫ్స్‌కు ప్రధాన కారణం బయట వ్యక్తులను నియమించుకోవడం కంటే అంతర్గతంగానే ఖాళీలను పూరించుకోవడమైతే, మరో కారణం ఆటోమేషన్ అని తెలిసింది.‌.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement