బెంగుళూరు: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. సీనియర్లు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఇటీవల కొన్ని సర్వేలు తెలిపాయి. కానీ, గత మూడు నెలలుగా కంపెనీలు సీనియర్ లెవల్ ఉద్యగులకు భారీగా వేతనాలు పెంచారని సిక్కి అనే సర్వే సంస్థ తెలిపింది. 72 శాతం కంపెనీలు 8నుంచి 10 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 28 శాతం మంది జూనియర్ ఉద్యోగులకే సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. మరోవైపు సిక్కి టాలెంట్ సంస్థ ముంబై, పుణే, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తదితర నగరాలలో ఐటీ నిపుణులు, ప్రముఖ కంపెనీలను విశ్లేషించి సిక్కి సంస్థ ఈ సర్వేను వెల్లడించింది.
అయితే సిక్కి సర్వేలో ఎనలిస్ట్, ఇంజనీర్, టెస్టర్, డెవలపర్ తదితర విభాగాలకు సంబంధించిన నిపుణులను సంప్రదించినట్లు తెలిపారు. అయితే కరోనా వైరస్ ప్రారంభంలో ప్రాజెక్టులు లేక కంపెనీలు సీనియర్ ఉద్యోగులకు ఎక్కువ జీతాలు చెల్లించలేక ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. కానీ ప్రస్తుతం కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయడాని కంపెనీలు సీనియర్ ఉద్యోగులకు భారీ వేతనాలు ఇస్తున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: హైదరాబాద్‌లో 6.6 లక్షల మందికి కరోనా.. వచ్చింది.. పోయింది!
Comments
Please login to add a commentAdd a comment