న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ కోసం ఉదయం నుంచి ఎదురు చూస్తున్న యువతకు నిరాశ ఎదురైంది. దేశంలో కరోనా బారిన పడుతున్న కేసులలో యువత, మధ్య వయస్సు గలవారు వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో 18-45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి టీకా రిజిస్ట్రేషన్ కోసం కేంద్రం అవకాశం కల్పించింది. అయితే నేడు సాయంత్రం 4 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కోవిన్ యాప్-పోర్టల్, ఉమాంగ్ యాప్, ఆరోగ్య సేతు యాప్ ల సర్వర్‌లు అన్నీ క్రాష్ అయ్యాయి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే వేల సంఖ్యలో లాగిన్ అవ్వడానికి ప్రయత్నించంగా సర్వర్ క్రాష్ అయ్యింది. సర్వర్లు క్రాష్ అవుతున్నాయని వినియోగదారులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వినియోగదారులు లాగిన్ అవ్వడానికి అవసరమైన వన్ టైమ్ పాస్వర్డ్(OTP) కూడా రావడం లేదని ఫిర్యాదు చేశారు.
అధిక సర్వర్ లోడ్ కారణంగా సాయంత్రం 4 గంటలకు కోవిన్ సర్వర్లు డౌన్ అయ్యాయి. ఒకే సమయంలో భారీగా రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment