హిందీ, 14 ప్రాంతీయ భాషల్లో ‘కోవిన్‌’ | Govt Says CoWIN Portal In Hindi And Other Regional Languages Available | Sakshi
Sakshi News home page

హిందీ, 14 ప్రాంతీయ భాషల్లో ‘కోవిన్‌’

Published Tue, May 18 2021 11:33 AM | Last Updated on Tue, May 18 2021 11:35 AM

Govt Says CoWIN Portal In Hindi And Other Regional Languages Available - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ టీకా పొందేందుకు కేంద్రం తీసుకువచ్చిన కోవిన్‌ పోర్టల్‌ ప్రజలకు మరింత చేరువకానుంది. ఈ యాప్‌ వచ్చే వారం నుంచి హిందీ, మరో 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానుందని కేంద్రం తెలిపింది. దీంతోపాటు, దేశంలో తీవ్రంగా ఉన్న కోవిడ్‌–19 వేరియంట్లను త్వరితంగా గుర్తించేందుకు మరో 17 లేబొరేటరీ లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్‌పై ఏర్పాటైన ఉన్నత స్థాయి మంత్రుల 26వ సమావేశం ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా హర్షవర్ధన్‌ పలు కీలక అంశాలను వారికి వివరించారు. దేశంలోని కోవిడ్‌ వేరియంట్లను గుర్తించేందుకు కేంద్ర బయో టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇన్సాకాగ్‌ (ఇండి యన్‌ సార్స్‌ కోవ్‌–2 జినోమిక్‌ కన్సార్టియా) నెట్‌వర్క్‌లో మరో 17 ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటిద్వారా మరిన్ని శాంపిళ్లను పరీక్షించేందుకు, మరింత విశ్లేషణ చేపట్టేందుకు వీలవుతుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇలాంటి 10 ల్యాబ్‌లున్నాయన్నారు.

పంజాబ్‌లో బి.1.1.7 వేరియంట్‌
దేశంలో సార్క్‌ కోవ్‌–2 మ్యుటేషన్లు, వేరియంట్లపై ఎన్‌సీడీసీ డైరెక్టర్‌ డాక్టర్‌ సుజీత్‌ కె.సింగ్‌ వారికి వివరించారు. బి.1.1.7, బి.1.617 వంటి వేరియంట్ల తీవ్రత వివిధ రాష్ట్రాల వారీగా ఎలా ఉందో తెలిపారు. బి.1.1.7 వేరియంట్‌ పంజాబ్, ఛండీగఢ్‌ల నుంచి ఫిబ్రవరి మార్చి మధ్యలో సేకరించిన శాంపిల్స్‌లో ఎక్కువగా కనిపించిందన్నారు.

రెమిడెసివిర్‌ ఉత్పత్తి మూడు రెట్లు
కోవిడ్‌–19 చికిత్సలో ఎక్కువగా వాడుతున్న ఔషధాలు.. ముఖ్యంగా రెమిడెసివిర్, టోసిలిజు మాబ్, అంఫొటెరిసిన్‌–బి ఉత్పత్తి, కేటాయింపుల సమన్వయానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని ఫార్మా సెక్రటరీ ఎస్‌.అపర్ణ తెలిపారు. కోవిడ్‌ వైద్య సూచనల్లో పేర్కొనకపోయినా ఫవిపిరవిర్‌ ఔషధానికి కూడా డిమాండ్‌ పెరిగిందన్నారు. ప్రస్తుతం దేశంలో రెమిడెసివిర్‌ ఉత్పత్తి మూడు రెట్లు పెరిగి, నెలకు 39 లక్షల వయల్స్‌ నుంచి 1.18 కోట్ల వయల్స్‌ వరకు తయారవుతోందని తెలిపారు. అదేవిధంగా, బ్లాక్‌ ఫంగస్‌(మ్యుకోర్‌మైకోసిస్‌) బారిన పడిన వారికి ఇచ్చే అంఫొటెరిసిన్‌–బి ఔషధం తయారీ కూడా పెరిగిందని చెప్పారు.  మే1–14 తేదీల మధ్య రాష్ట్రాలకు ఒక లక్ష వయల్స్‌ అంఫొటెరిసిన్‌–బిను అందజేశామన్నారు.
 
పరీక్షల సామర్థ్యం పెంపు
గ్రామీణ ప్రాంతాల వారికి కోవిడ్‌ పరీక్షలను మరింత చేరువ చేసేందుకు ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టింగ్‌ వ్యాన్లు, ఆర్‌ఏటీ టెస్ట్‌ కిట్లను అందుబాటులోకి తెస్తున్నామని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎంఆర్‌) డీజీ డాక్టర్‌ బలరాం భార్గవ తెలిపారు. వీటితో ఆర్‌టీ–పీసీఆర్, ఆర్‌ఏటీ పరీక్షల సామర్థ్యం రోజుకు 25 లక్షల నుంచి 45 లక్షలకు పెరుగుతుందని వివరించారు. హోం ఐసోలేషన్‌ మార్గదర్శకాలను హిందీతోపాటు 14 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.

(చదవండి: తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో కుటుంబీకుల హర్షం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement