సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపై సైబర్ నేరగాళ్లు కన్ను పడింది. అమ్మ ఒడి, చేయూత, జగన్నన విద్యా దీవెన, వైఎస్సార్ కాపు నేస్తం, వాహన మిత్ర లాంటి పథకాలు వస్తున్నాయా అంటూ ఫోన్ కాల్స్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఏదైనా పథకం రాక పోతే వెంటనే డబ్బులు ఖాతాలో వేస్తామంటూ కేటుగాళ్లు లింక్ పంపిస్తున్నారు.
దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ కేంద్రంగా రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ఫోన్ చేసి అమాయకుల్ని నిండా ముంచేస్తున్నారు. ఇలాంటి లాంటి ఫోన్ కాల్స్ నమ్మొద్దని, అప్రమత్తంగా ఉండాలని విశాఖ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment