సాక్షి, హైదరాబాద్: సైబర్ క్రైమ్ కేసులో నేరస్తులైన కొందర్ని బిహార్ నుంచి నగరానికి తీసుకువస్తుండగా ఆదివారం సాయంత్రం అక్కడి నేరగాళ్లు సైబరాబాద్ పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. బిహార్‌కు చెందిన మిథిలేశ్ అనే వ్యక్తి తన గ్యాంగ్‌తో కలిసి సైబర్ నేరాలకు పాల్పడి నగరంలోని పలువురిని నిండా ముంచాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఈనెల 11న బిహార్‌లోని నవాడాకు వెళ్లారు.
నేరగాళ్లు అక్కడే ఉన్నట్లు గుర్తించి నలుగుర్ని అరెస్టు చేసి తీసుకు వస్తుండగా వారు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో పోలీసులు సురక్షితంగా తప్పించుకున్నారు. కాగా, అప్పటికే పోలీసులు మిథిలేశ్ నుంచి రూ.1.22 కోట్లు నగదు, 3 లగ్జరీ కార్లు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment