పంచాయతీరాజ్‌ వ్యవస్థ–పరిణామక్రమం | Panchayati Raj System-Evolution | Sakshi
Sakshi News home page

పంచాయతీరాజ్‌ వ్యవస్థ–పరిణామక్రమం

Published Tue, Mar 7 2017 2:26 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

పంచాయతీరాజ్‌ వ్యవస్థ–పరిణామక్రమం

పంచాయతీరాజ్‌ వ్యవస్థ–పరిణామక్రమం

1.    స్థానిక సంస్థల ప్రధాన ఉద్దేశం?
    1) ప్రజాస్వామ్య వికేంద్రీకరణ        2) అభివృద్ధిలో భాగస్వామ్యం
    3) సామాజిక నాయకత్వాన్ని
        పెంపొందించడం        
    4) పైవన్నీ

2.    మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం కేరళ. రెండో రాష్ట్రం?
    1) తెలంగాణ     2) అసోం
    3) రాజస్థాన్‌    4) ఆంధ్రప్రదేశ్‌

3.    పంచాయతీ వ్యవస్థ అనేది ఏ రకమైన విభజన?
    1) విధుల పరమైన    
    2) పరిపాలనా పరమైన
    3) భౌగోళిక పరమైన
    4) పైవేవీ కావు

4.    రాజకీయ పార్టీలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనవచ్చని చెప్పిన కమిటీ?
    1) అశోక్‌ మెహతా కమిటీ        2) వెంగళరావు కమిటీ
    3) చొక్కారావు కమిటీ        
    4) పైవేవీ కాదు

5.    జిల్లా పరిషత్‌కు ప్రత్యక్ష ఎన్నికలు జరిపించాలని సిఫార్సు చేసిన కమిటీ?
    1) బల్వంత్‌రాయ్‌ మెహతా కమిటీ
    2) అశోక్‌ మెహతా కమిటీ
    3) నరసింహం కమిటీ        
    4) వెంగళరావు కమిటీ

6.    గ్రామ పంచాయతీ సభ్యుల ఎన్నికల వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు?
    1) జిల్లా కలెక్టర్‌        
    2) జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి
    3) జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌
    4) జిల్లా మున్సిఫ్‌ కోర్టు

7.    మన రాష్ట్రంలో అమల్లో ఉన్న స్థానిక స్వపరిపాలన వ్యవస్థ?
    1) గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌         
    2) గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా ప్రజా పరిషత్‌
    3) గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, మున్సిపాలిటీ
    4) పైవేవీ కావు

8.    మండల పరిషత్‌ సమావేశాల్లో పాల్గొనే అధికారం ఉండి ఓటుహక్కు లేని వారు?
    1) ఎన్నికైన సభ్యులు    
    2) కోఆప్ట్‌ సభ్యులు
    3) మండలంలోని రాజ్యసభ సభ్యులు    
    4) మండలంలోని సర్పంచ్‌లు

9.    మండల పరిషత్‌ అధ్యక్షుణ్ని ఎవరు ఎన్నుకుంటారు?
    1) ఓటర్లు      
    2) మండల పరిషత్‌ సభ్యులు
    3) మండల పరిషత్తులో ఎన్నికైన సభ్యులు    
    4) మండలంలోని సర్పంచ్‌లు

10.    కింది వాటిలో సరైనది?
    1) గ్రామసభలో ఎన్నికైన సభ్యులుండరు        2) వార్డు కమిటీల ఏర్పాటుకు కనీస జనాభా 3 లక్షలు ఉండాలి    
    3) జిల్లా పరిషత్‌లో ఏడు స్థాయీ సంఘాలు ఉంటాయి         4) పైవన్నీ

11.    రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం గ్రామ పంచాయతీల ఏర్పాటుకు రాష్ట్రాలు చర్యలు తీసుకుంటాయి?
    1) ప్రకరణ 39    2) ప్రకరణ 41
    3) ప్రకరణ 40    4) ప్రకరణ 42

12.    పదకొండో షెడ్యూల్‌లో పంచాయతీరాజ్‌ సంస్థలకు కేటాయించిన విధుల సంఖ్య?
    1) 9     2) 19    3) 29    4) 39

13.    రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు?
    1) రాష్ట్రపతి    2) గవర్నర్‌
    3) ప్రధానమంత్రి    4) ఎవరూ కాదు

14.    న్యాయ పంచాయతీల ఉద్దేశం?
    1) గ్రామ పంచాయతీలను నిర్వహించడం
    2) çసర్పంచ్‌ తీర్పుల్ని కొట్టేయకపోవడం
    3) హైకోర్ట్‌ అప్పీల్‌కు అనుమతివ్వడం
    4) గ్రామీణ ప్రజలకు ఎక్కువ ఖర్చు లేకుండా త్వరగా న్యాయం అందించడం

15.    గ్రామీణ సమాజం అత్యధిక అధికారాలు కలిగిన కాలం?
    1) చోళులు    2) బ్రిటిష్‌
    3) పల్లవులు    4) మొఘల్

16.    స్థానిక సంస్థలను పర్యవేక్షించే అత్యున్నత వ్యవస్థ?
    1) మానవ వనరుల శాఖ
    2) గణాంక శాఖ    
    3) పట్టణాభివృద్ధి శాఖ
    4) గ్రామీణాభివృద్ధి శాఖ

17.    గ్రామసభలో ఎవరు సభ్యులుగా ఉంటారు?
    1) గ్రామ పంచాయతీలోని వయోజనులు        
    2) గ్రామ పంచాయతీలోని రిజిస్టర్డ్‌ ఓటర్లు
    3) పై ఇద్దరూ    4) పై ఎవరూ కాదు

18.    స్థానిక ప్రభుత్వాలను ఏ జాబితాలో చేర్చారు?
    1) కేంద్ర     2) రాష్ట్ర
    3) ఉమ్మడి     4) పైవేవీ కావు

19.    మన దేశంలో మొదటి మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ఏ నగరంలో ఏర్పాటుచేశారు?
    1) కోల్‌కతా    2) ముంబై
    3) చెన్నై    4) ఢిల్లీ

20.    స్థానిక సంస్థలకు సంబంధించిన మొదటి తీర్మానం?
    1) రిప్పన్‌ తీర్మానం    
    2) వికేంద్రీకరణ కమిషన్‌
    3) మేయో తీర్మానం        
    4) పైవేవీ కాదు

21.    స్థానిక స్వపరిపాలనను రాష్ట్ర అంశంగా ఏ చట్టంలో ప్రకటించారు?
    1) 1909 మింటోమార్లే చట్టం        2) 1919 మాంటెంగ్‌–చెమ్స్‌ఫర్డ్‌ చట్టం
    3) భారత ప్రభుత్వ చట్టం 1935        
    4) భారత స్వాతంత్య్ర చట్టం 1947

22.    కింది వివరాలను పరిశీలించండి.
    ఎ) రాజ్యాంగంలోని 9వ భాగంలో పంచాయితీలకు సంబంధించిన అంశాలున్నాయి. దీన్ని 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చారు
    బి) రాజ్యాంగంలోని 9–ఎ భాగంలో మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలున్నాయి. ప్రకరణ 243–క్యూ ప్రకారం ప్రతి రాష్ట్రంలో మున్సిపల్‌ కౌన్సిల్, మున్సిపల్‌  కార్పొరేషన్‌ అనే రెండు రకాల మున్సిపాలిటీలు ఉండాలి
    పై వ్యాఖ్యల్లో ఏది సరైనది

    1) ఎ మాత్రమే    2) బి మాత్రమే
    3) రెండూ సరైనవి    4) రెండూ సరికాదు

23.    స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు అన్వయించని రాష్ట్రాలు?
    1) గోవా, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి
    2) ఢిల్లీ, గోవా, మిజోరం, మేఘాలయ
    3) మేఘాలయ, నాగాలాండ్, మిజోరం
    4) సిక్కిం, అసోం, మిజోరం

24.    ప్రస్తుత పంచాయతీరాజ్‌ వ్యవస్థకు మూలం?
    1) అశోక్‌ మెహతా కమిటీ        
    2) బల్వంత్‌రాయ్‌ మెహతా కమిటీ
    3) వసంతరావ్‌ నాయక్‌ కమిటీ        
    4) రాజమన్నార్‌ కమిటీ

25.    నూతన పంచాయతీరాజ్‌ చట్టం–1993లో అనేక కొత్త అంశాలు చోటుచేసుకున్నాయి. అయితే ఆ అంశాల జాబితాలో లేనిది?
    1) వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ప్రాథమిక విద్య, సామాజిక అడవులు లాంటి అనేక కొత్త విధులను చేర్చారు    
    2) నిర్దేశిత సమయంలో అన్ని స్థానాలకు తప్పనిసరిగా ఎన్నికలు జరపాలి
    3) పంచాయతీల్లో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు కేటాయించడం
    4) పంచాయతీ సభ్యుల్లో క్రమశిక్షణ, జవాబుదారీ కోసం వారికి వేతనం ఇవ్వడం

26.    రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు?
    1) కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌    2) ప్రధానమంత్రి    
    3) గవర్నర్‌    
    4) జాతీయ ఆర్థిక సంఘం

27.    జతపరచండి. పట్టిక ఐ     
    i) సామాజికాభివృద్ధి పథకం
    ii) జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం
    iii) పంచాయతీరాజ్‌ వ్యవస్థ
    iv) నూతన పంచాయతీరాజ్‌ వ్యవస్థ
       
 సమాధానాలు
1) 4    2) 4    3) 3    4) 1    5) 2    6) 4    7) 1    8) 4    9) 3    10) 4    11) 3    12) 3    13) 2    14) 4    15) 1    16) 4    17) 2    18) 2    19) 3    20) 3
21) 3    22) 3    23) 3    24) 2    25) 4    26) 3    27) 2
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement