తెలంగాణ ప్రభుత్వ పథకాలు | Telangana government schemes | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రభుత్వ పథకాలు

Published Tue, Nov 1 2016 1:45 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

తెలంగాణ ప్రభుత్వ పథకాలు

తెలంగాణ ప్రభుత్వ పథకాలు

కంటికి కనిపించని అతి సూక్ష్మ పదార్థమే పరమాణువు. కానీ, దీని నిర్మాణ ఆవిష్కరణ ఆధునిక విజ్ఞానశాస్త్ర అధ్యయనాన్ని కొత్త పుంతలు తొక్కించింది. నేటి ఆధునిక జీవనానికి అవసరమైన ఎన్నో ఉపకరణాలను రూపొందించడంలో కీలక భూమికను పోషించింది. పరమాణువు నిర్మాణ ఆవిష్కరణకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే..  క్రీ.పూ. 2600 ఏళ్ల కిందట కణాదుడు అనే భారతీయ రుషి తన వైశేషిక సూత్ర అనే గ్రంథంలో అణువును ప్రస్తావించాడు.
 
 అతని ప్రకారం పదార్థం అణువులు అనే అతి చిన్న కణాలతో నిర్మితమవుతుంది. ఈ అణువులు పరమాణువులుగా పిలిచే మరింత చిన్న కణాలతో రూపొందుతాయి. అభ్యర్థులు పరమాణు నిర్మాణానికి సంబంధించి డాల్టన్, థామ్సన్, రూథర్‌ఫర్డ్, బోర్ నమూనాలపై అవగాహన పెంపొందించుకోవాలి. విద్యుదయస్కాంత తరంగం, మాక్స్‌ప్లాంక్ ప్రతిపాదన; సోమర్‌ఫెల్డ్, క్వాంటం యాంత్రిక పరమాణు నమూనాల గురించి తెలుసు
 కోవాలి.
 
 ఉదా:
 రూథర్ ఫర్‌‌డ.. ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం ద్వారా దేనిని ప్రతిపాదించాడు?
 1) ఎలక్ట్రాన్        2) ప్రోటాన్     3) న్యూట్రాన్    4) కేంద్రకం
 సమాధానం: 4
 
 కల్యాణలక్ష్మి పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?     - 2014, అక్టోబర్ 2
 కల్యాణలక్ష్మి పథకంలో 18 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ యువతులకు వివాహ సమయంలో అందించే ఆర్థిక సహాయం?    - రూ. 51,000
 కల్యాణలక్ష్మి పథకం కింద బీసీ యువతులకు కూడా వివాహ సమయంలో ఆర్థిక సహాయాన్ని ఎప్పటి నుంచి అందిస్తున్నారు?   
 - 2016 ఏప్రిల్ 1
 కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధి పొందాలంటే సంబంధిత యువతుల తల్లిదండ్రుల వార్షికాదాయం ఎంతకు మించరాదు?
 - రూ.2 లక్షలు
 షాదీ ముబారక్ పథకం ఉద్దేశం?     
      - పేద ముస్లిం యువతులకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందించడం
 ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?    - మహబూబ్‌నగర్ జిల్లా
 షాద్‌నగర్ నియోజకవర్గంలోని
 కొత్తూరు గ్రామంలో
 ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?    - 2014, నవంబర్ 8
 ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు?     - తెలంగాణ ముఖ్యమంత్రి
 కె.చంద్రశేఖర్‌రావు
 ‘ఆసరా’ పింఛన్ పథకం కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేసింది?     - రూ.4,700 కోట్లు
 తెలంగాణలో ‘ఆసరా’ పింఛన్ పథకం కింద ఎంత మంది లబ్ధి పొందుతున్నారు?
 - 37,65,304 మంది
 వృద్ధులకు అమలుచేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?     - రక్షణ
 వితంతువులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?
 - జీవనాధారం
 చేనేత కార్మికులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?
 - చేయూత
 కల్లుగీత కార్మికులకు అమలుచేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?
  - ఆలంబన
 ఎయిడ్‌‌స బాధితులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?     - భరోసా
 వికలాంగులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?         
 - భద్రత
 ‘ఆసరా’ పింఛన్ పథకంలో వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్‌‌స బాధితులు ప్రతి నెలా ఎంత మొత్తం పొందుతున్నారు?
 - రూ.1000
 వికలాంగులకు ప్రతి నెలా ఇచ్చే ‘ఆసరా’ పింఛన్ ఎంత?     - రూ.1500
 ప్రస్తుతం ‘ఆరోగ్య లక్ష్మి’గా పేర్కొంటున్న పథకాన్ని గతంలో ఏమని పిలిచేవారు?
 - ఇందిరమ్మ అమృత హస్తం
 ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జనవరి 1
 ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ఏ కేంద్రాల ద్వారా అమలుచేస్తున్నారు?     - అంగన్‌వాడీ కేంద్రాలు
 బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు సంపూర్ణ పోషకాహారం అందించేందుకు ఉద్దేశిం చిన పథకం?     - ఆరోగ్యలక్ష్మి
 గ్రామజ్యోతి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, ఆగస్టు 17
 గ్రామజ్యోతి పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?     - గంగదేవిపల్లి (వరంగల్ జిల్లా)
 మన ఊరు-మన ప్రణాళికకు కొనసాగింపుగా రూపకల్పన చేసిన పథకం?    - గ్రామజ్యోతి
 గ్రామజ్యోతి పథకాన్ని అమలు చేసేందుకు ప్రతి గ్రామంలో ఎన్ని గ్రామీణాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేస్తారు?
 - 7 కమిటీలు. అవి.. పారిశుద్ధ్యం-తాగునీరు కమిటీ; ఆరోగ్యం-పోషకాహారం కమిటీ; విద్యా కమిటీ; సామాజిక, పేదరిక నిర్మూలనా కమిటీ; మౌలిక సదుపాయాల కల్పన కమిటీ; సహజ వనరుల నిర్వహణ కమిటీ; వ్యవసాయ కమిటీ
 మెగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్  ఆర్థిక సాయంతో హరే రామ హరే కృష్ట ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు?     - సద్దిమూట, భోజనామృతం
 సద్దిమూట పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2014, అక్టోబర్ 13
 సద్దిమూట పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?     - సిద్దిపేట మార్కెట్ యార్‌‌డ
 సద్దిమూట పథకం ఉద్దేశం?    
 - మార్కెట్ యార్డులో రైతులు, హమాలీలకు రూ.5కే భోజనం అందించడం
 భోజనామృతం కార్యక్రమ ఉద్దేశం?
 - మాతా శిశు సంరక్షణ,
 ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు
 ఉచితంగా భోజనం అందించడం
 హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ).. పేదలకు, భిక్షాటన చేసుకునే వారికి, అడ్డా కూలీలకు ఐదు రూపాయలకే భోజనం పథకాన్ని ఎప్పుడు ప్రారంభిం చింది?     - 2014, జూలై 17
 ఎవరి సాయంతో జీహెచ్‌ఎంసీ ఈ భోజన పథకాన్ని  ప్రారంభించింది?
 - అక్షయపాత్ర ఫౌండే షన్
 ఆహార భద్రత పథకం లబ్ధిదారులను ఏ సర్వే ఆధారంగా గుర్తించారు?
 - సమగ్ర కుటుంబ సర్వే
 ఆహార భద్రత పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జనవరి 1
 ఆహార భద్రత పథకం కింద కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ఎన్ని కిలోల బియ్యం ఇస్తారు?     - రూ.1కి కిలో చొప్పున 6 కిలోలు
 నిరుపేద విద్యార్థులకు సన్న బియ్యం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
 - 2015, జనవరి 1
 ‘మన ఊరు-మన చెరువు’ నినాదంతో రూపకల్పన చేసినకార్యక్రమం?
 - మిషన్ కాకతీయ
 మిషన్ కాకతీయ పైలాన్‌ను తెలంగాణ  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎక్కడ ఆవిష్కరించారు? - నిజామాబాద్ జిల్లా
 సదాశివ నగర్ మండలం పాతచెరువు
 మిషన్ కాకతీయ ప్రధానోద్దేశం?
 - రాష్ర్టంలోని 46,000 చెరువుల పునరుద్ధరణ
 మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, మార్చి 12
 మహిళలకు రక్షణ అందించేందుకు, ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు ప్రారంభించిన బృందాలు? - షీ టీమ్స్
 షీ టీమ్స్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
 - 2014, అక్టోబర్ 24
 హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో అటవీ ప్రాంతాన్ని ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?     - 33%
 మొదటి విడత హరితహారం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జూలై
 మొదటి విడత హరితహారం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?     - చిలుకూరు
 బాలాజీ టెంపుల్ వద్ద (రంగారెడ్డి జిల్లా)
 తొలి విడత హరితహారం కార్యక్రమంలో ఎన్ని మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?    - 40 కోట్ల మొక్కలు
 రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?    - 2016, జూలై 8
 రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?
 - గుండ్రాంపల్లి (నల్గొండ జిల్లా)
 రెండో విడత హరితహారం కార్యక్రమంలో ఎన్ని మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?    - 46 కోట్ల మొక్కలు
 వాటర్‌గ్రిడ్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జూన్ 8
 వాటర్‌గ్రిడ్ పథకం ముఖ్యోద్దేశం?    
 - ప్రతి ఇంటికి నల్లాల ద్వారా
 మంచి నీటిని అందించడం
 వాటర్‌గ్రిడ్ పథకం పేరు?    
 - మిషన్ భగీరథ (2015 డిసెంబర్ 4)
 ‘పల్లె వాకిట్లో పౌర సేవలు’ నినాదంతో రూపుదిద్దుకున్న కార్యక్రమం?
 - పల్లె సమగ్ర సేవా కేంద్రం
 పల్లె సమగ్ర సేవా కేంద్రం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
 - 2015, అక్టోబర్ 2
 పల్లె సమగ్ర సేవా కేంద్రం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?- బీబీనగర్ గ్రామం, దోమకొండ మండలం, నిజామాబాద్ జిల్లా   
 ఏ పథకంలో భాగంగా వాటర్‌గ్రిడ్ పైపులతో పాటు ఆప్టికల్ ఫైబర్‌ను వేసి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు?    - డిజిటల్ తెలంగాణ
 డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జూలై 1
 తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? - కౌడిపల్లి (మెదక్ జిల్లా)
 
 అక్కెనపల్లి మీనయ్య
 ఎకనామిక్స్ (హెచ్‌వోడీ)- రిటైర్డ్
 నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
 నల్లగొండ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement