రాష్ట్రపతి.. బిల్లును పూర్తిగా తిరస్కరించడం?
కాంపిటీటివ్ గైడెన్స్ ఇండియన్ పాలిటీ
భారత రాజ్యాంగం ప్రకారం డిజ్యూర్ సార్వభౌమాధికారిగా ఎవరు వ్యవహరిస్తారు?
రాష్ట్రపతి
పదవీ కాలంలో రాష్ట్రపతి ప్రథమ పౌరునిగా ఉంటే... పదవీ విరమణ తర్వాత హోదా క్రమంలో ఎన్నో స్థానాన్ని పొందుతారు?
5వ స్థానం
భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం గురించి తెలిపే అధికరణలు?
ఆర్టికల్–52 నుంచి ఆర్టికల్–151 వరకు
భారతదేశంలో మూడు ప్రభుత్వాంగాలు ఏ సూత్రంపై పనిచేస్తాయి?
చెక్స్, బ్యాలెన్స్ విధానంలో
భారతదేశానికి ప్రధాన కార్యనిర్వాహక అధికారి రాష్ట్రపతి అని తెలిపే ఆర్టికల్?
ఆర్టికల్–53
రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి చెల్లించాల్సిన డిపాజిట్ మొత్తం?
రూ.15,000
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టాన్ని ఎప్పుడు చేశారు?
1952
రాష్ట్రపతిని ఎన్నుకునే ఎన్నికల గణంలో అతని అభ్యర్థిత్వాన్ని ఎంతమంది ప్రతిపాదించాలి, ఎంతమంది బలపర్చాలి?
50, 50
రాష్ట్రపతి ఎన్నికను సవాల్ చేయాలంటే నియోజకగణంలోని ఎంత మంది సభ్యులు బలపరచాలి?
20
ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి ఎన్నిక వివాదాలకు సంబంధించిన మార్గదర్శకాలను రాజ్యాంగంలో చేర్చారు?
11వ సవరణ, 1961
రాష్ట్రపతి భవన్ రూపశిల్పులు?
హెర్బర్ట్ బేకర్, ఎడ్వర్ట్ లుట్టియాన్స్
రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం గురించి తెలిపే ఆర్టికల్?
ఆర్టికల్–61
రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలను దీర్ఘకాలం వాయిదా వేయడం?
ప్రోరోగ్
రాష్ట్రపతి.. బిల్లును పూర్తిగా తిరస్కరించడం?
నిరపేక్ష వీటో
ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు?
ఆర్టికల్–108
ప్రస్తుతం లోక్‌సభలో ఆంగ్లో–ఇండియన్ సభ్యులు?
జార్జ్ బకెర్, రిచర్డ్ హే
భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తారు?
ఆర్టికల్–123
రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ దురుద్దేశ కారణాలతో ఉంటే న్యాయ సమీక్ష చేయొచ్చని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
కూపర్ కేంద్ర ప్రభుత్వం 1970
రాష్ట్రపతి వద్ద ఉండే నిధి?
ఆగంతుక నిధి
రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారం కల్పించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్?
ఆర్టికల్–72
ఆర్థిక సంఘం, కాగ్ తమ నివేదికలను ఎవరికి సమర్పిస్తాయి?
రాష్ట్రపతికి
ఉరిశిక్షను అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే విధించాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
బచన్ సింగ్ కేసు
భారత రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడు అని తెలిపే ఆర్టికల్?
ఆర్టికల్–53 (2)
రాజ్యాంగంలోని ఏ భాగం రాష్ట్రపతి అత్యవసర అధికారాల గురించి తెలుపుతోంది?
18వ భాగం
జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలిపే ఆర్టికల్?
ఆర్టికల్–352
రాష్ట్రపతి పాలన గురించి తెలిపే ‘ఆర్టికల్ 356’ను మృత పత్రంగా పేర్కొన్నవారు?
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు?
మూడుసార్లు (1962, 1971, 1975)
ఎమర్జెన్సీ కాలంలో జరిగిన అకృత్యాలపై (1975–77) జనతా ప్రభుత్వం నియమించిన కమిషన్?
షా కమిషన్
అత్యవసర అధికారాలను దుర్వినియోగం చేయకుండా మార్గదర్శకాలను కల్పించిన రాజ్యాంగ సవరణ?
44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978
రాష్ట్రపతి పాలనను దుర్వినియోగం చేయకుండా సుప్రీంకోర్టు్ట ఏ కేసులో మార్గదర్శకాలు ఇచ్చింది?
ఎస్.ఆర్. బొౖమ్మై కేసు (1994)
ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలిపే ఆర్టికల్?
ఆర్టికల్ –360
అమెరికా అధ్యక్షుడికి ఉండి, భారత రాష్ట్రపతికి లేని వీటో?
క్వాలిఫైడ్ వీటో
రెండుసార్లు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించినవారు?
హిదయతుల్లా (1969, 1983)
మొదటి రాష్ట్రపతి ఎన్నికల్లో (1952) బాబూ రాజేంద్రప్రసాద్‌పై పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి?
కె.టి. షా
హిందూ కోడ్ బిల్లులో సవరణల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన రాష్ట్రపతి?
బాబూ రాజేంద్రప్రసాద్
అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసినవారు?
జాకీర్ హుస్సేన్ (1967–69)
ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని ఇందిరాగాంధీ ఎప్పుడు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా పిలుపునిచ్చారు?
1969 రాష్ట్రపతి ఎన్నిక
తన ఎన్నికపై వచ్చిన వివాదంపై సుప్రీంకోర్టుకు స్వయంగా హాజరై తన వాదనను వినిపించిన రాష్ట్రపతి?
వి.వి.గిరి
ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, స్పీకర్‌గా, రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి?
నీలం సంజీవరెడ్డి
‘ఆపరేషన్ బ్లూ స్టార్’ సైనిక చర్య ఏ రాష్ట్రపతి కాలంలో జరిగింది?
జ్ఞానీ జైల్‌సింగ్ (1984)
అత్యధికంగా నలుగురు ప్రధానమంత్రుల ప్రమాణ స్వీకారం ఏ రాష్ట్రపతి కాలంలో జరిగింది?
ఆర్. వెంకట్రామన్ (1987–92)