
వాట్సాప్ ఉపయోగించుకుందాం ఇలా..
వాట్సాప్.. నేటి సాంకేతిక ప్రపంచంలో దీని గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు.
వాట్సాప్.. నేటి సాంకేతిక ప్రపంచంలో దీని గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. టాక్‌టైం బ్యాలెన్‌స లేకపోయినా మొబైల్ డేటా ఉంటే చాలు గంటల తరబడి చాటింగ్ చేయొచ్చు. వీడియోలు, వాయిస్ చాట్‌లు, ఎస్‌ఎంఎస్‌లు పంపించొచ్చు. అందుకే నేటి యువత దృష్టిలో వాట్సాప్ అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది.
అయితే ఈ సాంకేతికతను సద్వినియోగ పరచుకుంటున్న వారితో పాటు దుర్వినియోగపరుస్తున్న వారు కూడా ఉంటున్నారు. కొందరు దీని వాడకం తెలియక ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ని
ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..
చేయదగినవి (Do's)
వాట్సాప్‌లో కొత్తగా వస్తున్న ఫీచర్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.
వ్యక్తిగత, వివాదాస్పద విషయాలను గ్రూప్‌లో కాకుండా విడిగా చర్చించాలి.
తెలిసిన వారికే రిక్వెస్ట్‌లు పంపాలి. తెలిసిన వాళ్ల రిక్వెస్ట్‌లనే అంగీకరించాలి.
గ్రూప్‌లోని సభ్యుల మధ్య ఎంత ఘాటుగా చర్చ జరుగుతున్నా సంయమనం కోల్పోకూడదు.
మీరు పంపిన మెసేజ్‌లు ఎవరెవరు చూస్తున్నారో తెలుసుకుంటూ ఉండాలి.
ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తులను బ్లాక్ చేయాలి.
మీరు చెప్పదలచుకున్న విషయాలను సూటిగా, స్పష్టంగా చెప్పండి.
అవసరమైన, ఉపయోగకరమైన విషయాలను మాత్రమే చర్చించాలి.
చేయకూడనివి (Dont's)
చాలా మంది క్లాస్‌మేట్స్, రూంమేట్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఇలా రకరకాల గ్రూప్‌లను క్రియేట్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ దెబ్బతింటుంది. మీ అభిప్రాయాలు, వ్యక్తిగత విషయాలు, ఇతరులతో మీరు చర్చించిన అంశాలు, మీరు మీ క్లోజ్ ఫ్రెండ్‌కి పంపిన ఫొటోలు, వాయిస్ చాట్‌లు గ్రూప్‌లో ఉన్న వారందరికీ తెలుస్తుంది. అందువల్ల సంబంధిత వ్యక్తుల అనుమతి లేకుండా వారిని గ్రూప్‌లో యాడ్ చేయకండి. గ్రూప్‌లో ఉండి ఒక్కరితోనే మాట్లాడకండి. ఇలా చేయడ ం వల్ల ఇతరులు మిమ్మల్ని దూరం పెట్టడంతో పాటు అనుమానించే అవకాశం ఉంది. మీకు తెలియని వారు పంపిన రిక్వెస్ట్‌ను అంగీకరించకండి.
ఒకవేళ మీకు పరిచయం లేని వారు పంపిన రిక్వెస్ట్‌ని అంగీకరిస్తే వారి చెడ్డ పనులకు మీరు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అనవసర, వివాదాస్పద విషయాలను గ్రూప్‌లో పోస్ట్ చేయకండి. వీటివల్ల గ్రూప్ సభ్యుల మధ్య సుహృద్భావ వాతావరణం దెబ్బతిని అనేక వివాదాలు ఏర్పడతాయి. ఒకే సమాధానాన్ని పదేపదే పంపడం, ఒకే పదంతో జవాబివ్వడం లేదా రిప్లై ఇవ్వకుండా మౌనంగా ఉండటం వంటివి చేయకూడదు. ఇలాంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల ఎదుటివారి మనసు గాయపడి, రిలేషన్‌షిప్ దెబ్బతింటుంది. అవతలి వాళ్ల మానసిక, శారీరక, వృత్తిగత పరిస్థితిని అర్థం చేసుకోకుండా గంటల తరబడి చాటింగ్ చేయడం మంచిది కాదు.
మీ వ్యక్తిగత విషయాలు, ఇష్టాయిష్టాలు గ్రూప్‌లలో పోస్ట్ చేయకపోవడం ఉత్తమం. ఎందుకంటే మీతో ఏకీభవించని వారు కూడా ప్‌లో ఉంటారన్న విషయాన్ని మరచిపోకండి. లేనిపోని రూమర్లను పంపడం, ఏదైనా మెసేజ్ పంపిన వెంటనే రిప్లై ఆశించడం మంచిది కాదు. అర్థంకాని ఫొటోలను పంపొద్దు. ఇతరులు పంపిన ప్రతి విషయాన్ని నమ్మకూడదు. అలాగే ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా స్పందించకూడదు.