భారతదేశం– భౌగోళిక స్వరూపాలు
ఇందిరా పాయింట్, నికోబార్ దీవుల ,
Indira Point , Nicobar Islands ,Bhavitha
ఇందిరా పాయింట్: భారతదేశ దక్షిణ చివరి సరిహద్దును ‘ఇందిరా పాయింట్’గా పిలుస్తారు. ఇది నికోబార్ దీవుల దక్షిణ చివరన ఉంది.
అంతర్వేది(Doab): రెండు నదుల మధ్య ఉండే మైదాన ప్రాంతం. ఇది చాలా సారవంతమైన భూభాగం. పూర్వం ఈ ప్రాంతంపై అధికారాన్ని చెలాయించేందుకు రాజుల మధ్య అనేక యుద్దాలు జరిగాయి.
4 మార్కుల ప్రశ్నలు – సమాధానాలు
కింది పేరాగ్రాఫ్‌ను చదివి భారతదేశ శీతోష్ణస్ధితి, హిమాలయాల గురించి వ్యాఖ్యానించండి.
(విద్యా ప్రమాణం: ఇచ్చిన పాఠ్యాంశాన్ని అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం)
హిమాలయాల వల్ల శీతోష్ణస్థితి అనేక విధాలుగా ప్రభావితమవుతుంది. ఇవి భారతదేశ ఉత్తర సరిహద్దున రక్షణ కవచాలుగా ఉండి చలికాలంలో మధ్య ఆసియా నుంచి వచ్చే తీవ్ర చలిగాలులను అడ్డుకుంటాయి. వేసవిలో వర్షాలకు, పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ఉన్న ప్రాంతంలో రుతుపవన శీతోష్ణస్థితికి హిమాలయాలే కారణం. ఇవి లేకపోతే దేశ ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది.
సమాధానం: ఒక ప్రాంతంలో దీర్ఘకాలికంగా ఒక క్రమ పద్ధతిలో ఉండే వాతావరణ పరిస్థితులను శీతోష్ణస్థితిగా పిలుస్తారు. ఉష్ణోగ్రత, వర్షపా తం, పీడనం, పవనాలు, ఆర్ధ్రత మొదలైన భౌతికాంశాల సగటు స్థితి శీతోష్ణస్థితిని వివరిస్తుంది. భారతదేశ శీతోష్ణస్థితిని స్థూలంగా ‘ఉష్ణ మండల రుతుపవన శీతోష్ణస్థితి’గా పేర్కొంటారు. వివిధ ప్రదేశాల్లోని శీతోష్ణస్థితి లక్షణాల్లో తేడాలను నిర్ణయించడంలో దేÔ¶ వైశాల్యం, వివిధ భౌగోళిక స్వరూపాలు ముఖ్యపాత్ర వహిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి హిమాలయ పర్వతాలు.
హిమాలయాలు జమ్ముకాశ్మీర్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు దేశ ఉత్తర సరిహద్దుగా సుమారు 2400 కి.మీ. పొడవున వ్యాపించి ఉన్నాయి. ఇవి శీతాకాలంలో మధ్య ఆసియా నుంచి వీచే అతిశీతల పవనాలను ఉత్తర మైదానంలోకి ప్రవేశించకుండా అడ్డగించి ఉత్తర భారతదేశాన్ని చలి నుంచిlకాపాడుతున్నాయి. వేసవి కాలంలో మైదానాల్లో వర్షపాతానికి; పశ్చిమ కనుమల తూర్పు, ఈశాన్య భాగాల్లో రుతుపవన శీతోష్ణస్థితికి హిమాలయాలే కారణం. రుతుపవన శీతోష్ణస్థితి లేనట్లయితే భారతదేశం ఉష్ణమండల ఎడారిగా మారి ఉండేది. అంతేకాకుండా హిమాలయాల్లోని హిమనీ నదాల నుంచి ప్రవహించే జీవనదుల వల్ల ఉత్తర మైదానాలు సారవంతంగా మారి ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ విధంగా హిమాలయాల వల్ల భారతదేశ శీతోష్ణస్థితి అనేక విధాలుగా ప్రభావితమవుతోంది.
భారతదేశ ప్రధాన భౌగోళిక విభజనలు ఏవి? హిమాలయ ప్రాంత భౌగోళిక పరిస్థితులతో ద్వీపకల్ప పీఠభూమిని పోల్చండి? (విద్యా ప్రమాణం: విషయావగాహన) సమాధానం: భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని ఆరు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. అవి.. హిమాలయాలు, గంగా–సింధు మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీరప్రాంత మైదానాలు, ఎడారులు, దీవులు.
హిమాలయ ప్రాంతానికి, ద్వీపకల్ప పీఠభూమికి మధ్య పోలికలు, తేడాలు:
ఉత్తర భారతదేశ ఉత్తర భాగంలో హిమాలయ పర్వతాలు ఉన్నాయి. వీటి విస్తీర్ణం సుమారు 5 లక్షల చ.కి.మీ. దేశ ఉత్తర ‡మైదానానికి దక్షిణంగా ఉన్న విశాల పీఠభూమిని ద్వీపకల్ప పీఠభూమిగా పిలుస్తారు. ఇది 16 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి, దేశంలో అతి పెద్ద నైసర్గిక స్వరూపంగా గుర్తింపు పొందింది.
మాలయాలు సముద్ర మట్టానికి సరాసరి 600 నుంచి 6100 మీటర్ల ఎత్తులో ఉండగా, ద్వీపకల్ప పీఠభూమి 600 నుంచి 900 మీటర్ల సాధారణ ఎత్తుతో క్రమరహితంగా ఉంది.
హిమాలయాల్లో జన్మించిన గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు, వాటి
ఉప నదులు నిరంతరం ప్రవహిస్తూ ఉత్తర భారతదేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి.
గోదావరి, కృష్ణా, మహానది, కావేరి, నర్మద, తపతి వంటి నదులు ద్వీపకల్ప పీఠభూమిలో ప్రవహిస్తూ ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేస్తున్నాయి.
హిమాలయాల దక్షిణ భాగంలో గంగా–సింధు మైదానం ఉంది. ఇక్కడి సారవంతమైన నేల పలు పంటలు పండటానికి అనుకూలంగా ఉంది. ద్వీపకల్ప పీఠభూమిని ఆనుకొని పశ్చిమ, తూర్పు భాగాల్లో తీర మైదానాలు ఉన్నాయి. వీటిలోని సాగుభూమి వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
ఈ రెండు ప్రాంతాల్లోని భౌగోళిక నిమ్నోన్నతాలు ఆయా ప్రదేశాల్లో రుతుపవన వర్షపాతానికి దోహదపడుతున్నాయి.
హిమాలయ ప్రాంతంలో దాల్, ఊలార్, కుమావున్, సోమర్ వంటి ప్రముఖ సరస్సులు ఉన్నాయి. చిల్కా, పులికాట్, కొల్లేరు, అష్టముడి వంటి సరస్సులు ద్వీపకల్ప పీఠభూమిలో ప్రధానమైనవి. ఈ రెండు ప్రధాన భౌగోళిక స్వరూపాలు వివిధ రూపాల్లో దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్నాయి.
2 మార్కుల ప్రశ్నలు
ప్రపంచపటాన్ని పరిశీలించి భారతదేశ ఉనికి గురించి క్లుప్తంగా రాయండి.
(విద్యా ప్రమాణం: పట నైపుణ్యాలు)
భారతదేశ ఉనికి: భారతదేశం ఆసియా ఖండంలోని దక్షిణ భాగంలో ఉంది. భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్న భారతదేశం ఉత్తరార్ధ, పూర్వార్ధ గోళాల్లో విస్తరించి ఉంది.
భారతదేశం భౌగోళికంగా 8041 – 37061 ఉత్తర అక్షాంశాలు, 68071 – 970 251 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
భారతదేశానికి మూడు వైపులా సముద్రం ఉండి, ఒక వైపు భూభాగ సరిహద్దు ఉంది. అందుకే మన దేశాన్ని ద్వీపకల్పంగా పరిగణిస్తారు.
ఇది అక్షాంశాల పరంగా ఉత్తర, దక్షిణాలుగా 30 డిగ్రీల పొడవున, రేఖాంశాల పరంగా తూర్పు పడమరలుగా 30 డిగ్రీల వెడల్పున వ్యాపించి ఉంది. భారతదేశ భూభాగాలైన అండమాన్ నికోబార్,
లక్ష దీవులు ప్రధాన భూభాగానికి దూరంగా విసిరేసినట్లు ఉన్నాయి.