జాబ్ పాయింట్
ఐబీపీఎస్...పీవో/ఎంటీ 3,562 ఖాళీలు
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. వివిధ బ్యాంకుల్లోని 3,562 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/ మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎంటీ) ఖాళీలకు కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్– సీడబ్ల్యూఈ పీవో/ ఎంటీ–7 ద్వారా దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎంటీ).
మొత్తం ఖాళీలు : 3,562 (అన్ రిజర్వుడ్–1,738 +ఓబీసీ 961+ ఎస్సీ– 578 + ఎస్టీ–285).
అర్హతలు : ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి : 2017 ఆగస్ట్ 1 నాటికి 20–30 ఏళ్ల లోపు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం : మూడు దశల్లో ఉంటుంది. అవి.. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ.
పరీక్షల విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్స్ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ : మార్కులు 100; వ్యవధి గంట.
విభాగం ప్రశ్నలు మార్కులు మీడియం
రీజనింగ్ ఎబిలిటీ 35 35 ఇంగ్లిష్, హిందీ
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 30 ఇంగ్లిష్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 35 ఇంగ్లిష్, హిందీ
మొత్తం 10 100
మెయిన్ ఎగ్జామినేషన్: మొత్తం 225 మార్కులకు ఉంటుంది. ఇందులో రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్– 45 ప్రశ్నలు 60 మార్కులు (వ్యవధి గంట), జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్.. 40 ప్రశ్నలు 40 మార్కులకు (వ్యవధి 35 నిమిషాలు), ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్.. 35 ప్రశ్నలు 40 మార్కులు (40 నిమిషాలు), డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్.. 35 ప్రశ్నలు 60 మార్కులు (వ్యవధి 45 నిమిషాలు), లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే (ఇంగ్లిష్)–2 ప్రశ్నలు 25 మార్కుల (వ్యవధి 30 నిమిషాలు)కు ఉంటాయి.
రుణాత్మక మార్కులు: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్ రెండింట్లోనూ ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగిటివ్ మార్కు ఉంటుంది.
ఇంటర్వ్యూ: మెయిన్ ఎగ్జామినేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూలో మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేంద్రాలు (తెలుగు రాష్ట్రాల్లో): ఆంధ్రప్రదేశ్‌లో.. చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
మెయిన్ ఎగ్జామినేషన్ కేంద్రాలు (తెలుగు రాష్ట్రాల్లో): ఆంధ్రప్రదేశ్‌లో.. గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం; తెలంగాణలో.. హైదరాబాద్.
నోట్: ఐబీపీఎస్ నిర్ణయాన్ని బట్టి పరీక్షల కేంద్రాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.100; మిగిలిన అభ్యర్థులకు రూ.600.
దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. www.ibps.in
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఆగస్ట్ 16, 2017
ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు: సెప్టెంబర్ 5, 2017
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ:
ఆగస్ట్ 16, 2017– సెప్టెంబర్ 5, 2017
ప్రి–ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెటర్ డౌన్‌లోడ్: సెప్టెంబర్, 2017
ప్రి–ఎగ్జామ్ ట్రైనింగ్ : సెప్టెంబర్ 23–29, 2017
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్:
సెప్టెంబర్, 2017
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(ఆన్‌లైన్):
అక్టోబర్ 7,8,14,15, 2017
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫలితాలు: అక్టోబర్, 2017
మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: నవంబర్, 2017
మెయిన్ ఎగ్జామినేషన్(ఆన్‌లైన్): నవంబర్ 26, 2017
మెయిన్ ఎగ్జామినేషన్ ఫలితాలు: డిసెంబర్, 2017
ఇంటర్వ్యూ కాల్‌లెటర్ డౌన్‌లోడ్: జనవరి, 2018
ఇంటర్వ్యూ: జనవరి/ఫిబ్రవరి, 2018
ప్రొవిజినల్ అలాట్‌మెంట్: ఏప్రిల్ 2018
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 696 ఖాళీలు
చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీఎల్).. దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖల్లోని 696 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది. యూఐఐసీఎల్ భారత ప్రభుత్వ ఆధీనంలోని పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ.
పోస్టు పేరు: అసిస్టెంట్
వేతనం: రూ.14,435–రూ.32,030+ నిబంధనల మేర ఇతర అలవెన్సులు. ఉద్యోగ ప్రాంతాన్ని బట్టి వేతనంలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
మొత్తం పోస్టులు: 696 (అన్‌రిజర్వుడ్–414, ఓబీసీ–122, ఎస్సీ–110, ఎస్టీ–50).
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్–32(అన్‌రిజర్వుడ్–14, ఓబీసీ–6, ఎస్సీ–7, ఎస్టీ–5); తెలంగాణ–20(అన్‌రిజర్వుడ్–13, ఎస్సీ–3, ఎస్టీ–4).అర్హతలు: ఏదైనా డిగ్రీ. అలాగే స్థానిక భాషలో మంచి పట్టు (మాట్లాడగలగడం, చదవడం, రాయడం) తప్పనిసరి.
వయో పరిమితి: 2017 జూలై 30 నాటికి 18–28 ఏళ్ల లోపు ఉండాలి; ఎస్సీ /ఎస్టీ కేటగిరీలకు అయిదేళ్లు, ఓబీసీ–మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంది. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ కేటగిరీల్లోని దివ్యాంగ అభ్యర్థులకు, ఎక్స్–సర్వీస్‌మెన్ కేటగిరీకి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఎగ్జామినేషన్. ఇందులో టైర్–1 (ప్రిలిమినరీ ఎగ్జామినేషన్), టైర్–2 (మెయిన్ ఎగ్జామినేషన్) దశలు ఉంటాయి.
ఠి పరీక్షల (ప్రిలిమినరీ, మెయిన్) విధానం: టైర్–1 (ప్రిలిమినరీ ఎగ్జామినేషన్) ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్–30 ప్రశ్నలు, రెండో విభాగంలో టెస్ట్ ఆఫ్ రీజనింగ్–35, మూడో విభాగంలో టెస్ట్ ఆఫ్ న్యూమెరికల్ ఎబిలిటీ–35 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి గంట. ఇందులో కనీస అర్హత మార్కులు వచ్చిన అభ్యర్థుల్లో రాష్ట్ర, కేటగిరీ ప్రకారం 1:7 నిష్పత్తిలో మెరిట్ జాబితా తయారుచేస్తారు.
వీరికి టైర్–2 (మెయిన్) ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్–2 (మెయిన్ ఎగ్జామినేషన్)లో ఐదు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 50 మార్కుల చొప్పున మొత్తం 250 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులోని ఐదు విభాగాలు.. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, టెస్ట్ ఆఫ్ న్యూమెరికల్ ఎబిలిటీ. ఇందులోనూ నిర్దేశిత మార్కులతో ఉత్తీర్ణులైన వారికి స్థానిక భాషపై పరీక్ష (రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్) ఉంటుంది. ఇందులోనూ క్వాలిఫై అయితే ఆర్నెళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అభ్యర్థి పనితీరు, ప్రవర్తన ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పరీక్ష కేంద్రాలు(తెలుగు రాష్ట్రాల్లో): ఆంధ్రప్రదేశ్–చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, కంచికచర్ల, ఏలూరు, విజయనగరం; తెలంగాణ–హైదరాబాద్/రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.100; మిగిలిన కేటగిరీలకు రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 28, 2017.
వెబ్‌సైట్: www.uiic.co.in
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో అప్రెంటీస్ 172 ఖాళీలు
కేరళలోని కొచిలో ఉన్న కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్.. 172 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది.
పోస్టు పేరు–ఖాళీలు: గ్రాడ్యుయేట్ అప్రెంటీసెస్–72(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్–12, మెకానికల్ ఇంజనీరింగ్–27, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్–6, సివిల్ ఇంజనీరింగ్–12, కంప్యూటర్‌సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–8, సేఫ్టీ ఇంజనీరింగ్–3, మెరైన్ ఇంజనీరింగ్–2, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్‌బిల్డింగ్–2) ; టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటీసెస్–100(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్–22, మెకానికల్ ఇంజనీరింగ్–28, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్–8, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్–7, సివిల్ ఇంజనీరింగ్–9, కంప్యూటర్ ఇంజనీరింగ్–6, కమర్షియల్ ప్రాక్టీస్–20).
శిక్షణ వ్యవధి: ఏడాది
స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు రూ.8,000; టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్–రూ.7 వేలు
అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి బీఈ/ బీటెక్/డిప్లొమా.
వయో పరిమితి: అప్రెంటీస్‌షిప్ నిబంధనల ప్రకారం.
ఎంపిక విధానం: విద్యార్హతల మార్కుల శాతం అనుసరించి షార్ట్‌లిస్టింగ్.
దరఖాస్తు విధానం: ఎన్‌ఏటీఎస్ (నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్)లో రిజిస్టర్ అయి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 31, 2017.
వెబ్‌సైట్: www.cochinshipyard.com
ముంబై పోర్ట్ ట్రస్ట్ స్పోర్ట్స్ క్లబ్‌లో 56 ఖాళీలు
ముంబై పోర్ట్ స్పోర్ట్స్ క్లబ్.. 56 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది.
పోస్టు పేరు: స్పోర్ట్స్ ట్రైనీ
పోస్టులు: 56 (పురుషులు 54+మహిళలు 2).
ఖాళీలు: అథ్లెటిక్స్–5, షటిల్ బ్యాడ్మింటన్–3, బాడీ బిల్డింగ్–2, క్రికెట్–8, ఫుట్‌బాల్–9, హాకీ–9, కబడ్డీ–7, టేబుల్ టెన్నిస్–2, వాలీబాల్–6, వెయిట్ లిఫ్టింగ్–5.
నోట్: అథ్లెటిక్స్ విభాగంలో రెండు పోస్టులను మహిళలకు కేటాయించారు. మిగిలినవన్నీ పురుషులకే.
అర్హతలు: సంబంధిత క్రీడా విభాగాల్లో మూడేళ్లుగా (2014, 2015, 2016) దేశం తరఫున అంతర్జాతీయ/జాతీయ పోటీల్లో పాల్గొని ఉండాలి. లేదా జాతీయ స్థాయిలో కంబైన్డ్ యూనివర్సిటీ టీమ్‌లో కానీ, యూనివర్సిటీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ నిర్వహించిన ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్‌లో కానీ పాల్గొని ఉండాలి. ‘ఏ’ డివిజన్ క్రికెట్ లేదా సూపర్/ఎలైట్ డివిజన్ (హాకీ, ఫుట్‌బాల్)లో ప్రాతినిథ్యం వహించి ఉండాలి.
వయో పరిమితి: 2017 ఆగస్ట్ 10 నాటికి 18–26 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం: క్రీడా విభాగాల్లో సాధించిన విజయాల ఆధారంగా...
స్టైపెండ్: రూ.15 వేలు. ఇదికాక కిట్‌కు రూ.10 వేలు, మెడికల్ క్లైమ్ + యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ రూ.3,500 (ఏడాదికి) ఉంటాయి. ఉచిత వసతి కల్పిస్తారు. దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు కాపీలు పంపాల్సిన చిరునామా: జేటీ.జనరల్ సెక్రెటరీ, ముంబై పోర్ట్ ట్రస్ట్ స్పోర్ట్స్ క్లబ్, సెకండ్ ఫ్లోర్, రైల్వే మేనేజర్స్ బిల్డింగ్, రామ్‌జీ భాయ్ కమని మార్గ్, నియర్ వసంత్ హోటల్, బల్లార్డ్ ఎస్టేట్, ముంబై–400001.
దరఖాస్తులు చేరడానికి చివరి తేదీ: ఆగస్ట్ 31, 2017
www.mumbaiport.gov.in
ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 300ఖాళీలు
ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(ఓఐసీఎల్)లో 300 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువడింది. ఓఐసీఎల్.. భారత ప్రభుత్వ ఆధీనంలోని పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ.
పోస్టు పేరు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(స్కేల్–1).
మొత్తం పోస్టులు: 300(అన్‌రిజర్వుడ్–158, ఓబీసీ–77, ఎస్సీ–44, ఎస్టీ–21).
విభాగాల వారీ ఖాళీలు: అకౌంట్స్–20, యాక్చురీస్–2, ఇంజనీర్స్ (ఆటోమొబైల్)–15, లీగల్–30, మెడికల్ ఆఫీసర్(ఎంఓ)–10, జనరలిస్ట్ –223.
వేతనం: రూ.32,795–రూ.62,315
అర్హతలు: సంబంధిత విభాగాలను అనుసరించి డిగ్రీ/లా డిగ్రీ/ పీజీ/ ఎంకామ్/సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ/ఎంబీబీఎస్/నాలుగు యాక్చురియల్ పేర్స్(ఐఏఐ/ఐఎఫ్‌ఓఏ)లో ఉత్తీర్ణత.
వయో పరిమితి: 2017 జూలై 31 నాటికి 21–30 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: మూడు దశల్లో ఎంపిక ఉంటుంది. ఫేజ్–1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్–2లో మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్–3లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
పరీక్షల (ఫేజ్–1, ఫేజ్–2) విధానం: ఫేజ్–1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ 35 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి గంట. నిర్దేశిత మార్కులతో క్వాలిఫైడ్ అభ్యర్థుల నుంచి 1:20 నిష్పత్తిలో మెయిన్ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు.
ఫేజ్–2 (మెయిన్ ఎగ్జామినేషన్)లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో, 30 మార్కులకు డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ వ్యవధి రెండు గంటలు. జనరలిస్ట్స్ పోస్టులకు 4 విభాగాలు, మిగిలిన పోస్టులకు 5 విభాగాలుగా ప్రశ్నపత్రం ఉంటుంది. జనరలిస్ట్స్‌కు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్.. ఒక్కోటి 50 మార్కులకు చొప్పున 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. మిగిలిన పోస్టులకు టెస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అదనంగా నిర్వహిస్తారు. ఒక్కో విభాగానికి 40 మార్కులకు చొప్పన 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఫేజ్–2 పరీక్ష వ్యవధి గంట; డిస్క్రిప్టివ్ విధానంలో 30 మార్కులకు లెటర్ రైటింగ్, ఎస్సే ఉంటాయి. ఫేజ్–1, ఫేజ్–2 రెండు పరీక్షలు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు.
ఫేజ్–3 (ఇంటర్వ్యూ): మెయిన్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణుల మెరిట్ జాబితాలోని అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అనంతరం తుది ఎంపిక చేపడతారు.
దరఖాస్తు ఫీజు: రూ.600(అప్లికేషన్ ఫీ+ఇంటిమేషన్ ఛార్జెస్); ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 (ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే).
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్ట్ 18, 2017.
దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 15, 2017.
వెబ్‌సైట్: www.mumbaiport.gov.in
యూపీఎస్‌సీ...54 ఖాళీలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ).. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని 54 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువరించింది.
పోస్టుల పేరు–ఖాళీలు: అసిస్టెంట్ డైరెక్టర్(కెమిస్ట్రీ)–1; అసిస్టెంట్ ఇంజనీర్–3(ఎలక్ట్రికల్–1+ మెకానికల్–2); అసిస్టెంట్ ఫ్రొఫెసర్ (స్పెషలిస్ట్ గ్రేడ్–3)–37(అనాటమీ–8+ ఒబేస్ట్రిక్ అండ్ గైనకాలజీ–13+ ఆప్తాల్మాలజీ–3 + ఆర్థోపీడియాక్(స్పోర్ట్స్ ఇంజూరీ సెంటర్)–1+ పీడియాట్రిక్ కార్డియాలజీ–2+ రేడియో థెరపీ–10); అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్–6; డ్రిల్లర్ ఇంచార్జ్–5; లెక్చరర్–2 (ఎలక్ట్రికల్–1+మెకానికల్–1).
వేతనం: అసిస్టెంట్ డైరెక్టర్ (కెమిస్ట్రీ), అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు–రూ.15,600–రూ.39,100; అసిస్టెంట్ ఇంజనీర్‌కు– రూ.44,900–రూ.1,42,400; అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు– రూ.56,100–రూ.1,77,500; డ్రిల్లర్ ఇంచార్జ్‌కు–రూ.9,300–34,800.
అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా/ఎంఎస్సీ/ఎంబీబీఎస్/డీఎన్‌బీ/ఎంసీహెచ్/డీఎం/ఎండీ/ఎంఎస్. దీంతోపాటు నిబంధనల మేర ఉద్యోగానుభవం, మార్కుల శాతం ఉండాలి.
వయోపరిమితి: పోస్టులను అనుసరించి నిబంధనల మేరకు.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ.
దరఖాస్తు ఫీజు: రూ.25; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళలకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 31, 2017.
వెబ్‌సైట్: www.upsconline.nic.in
నిట్–రూర్కెలా 203 ఖాళీలు
రూర్కెలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో 203 బోధన ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువడింది.
మొత్తం ఖాళీలు: 203 (అన్‌రిజర్వుడ్–55, ఓబీసీ–82, ఎస్సీ–40, ఎస్టీ–26). ఇందులో కొన్ని పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు.
పోస్టుల పేరు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
బోధన విభాగాలు: ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ డిజైన్, ఆర్కిటెక్చర్, సైన్స్/ హ్యుమానిటీస్ అండ్ సోషియల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్.
వేతనం: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.15,600–రూ.39,100; అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు రూ.37,400–రూ.67,000. వీటిలో పోస్టులవారీ గ్రేడ్ పేలో మార్పులు ఉంటాయి.
అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి పీహెచ్‌డీతో పాటు బీఈ/బీటెక్/బీ.డిజైన్/బీఆర్క్/ఎంఆర్క్/మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ/ పీజీడీబీఎం. నిబంధనల మేర మార్కుల శాతం ఉండాలి. ఉద్యోగానుభవం అభిలషణీయం.
వయో పరిమితి: 2017 సెప్టెంబర్ 11 నాటికి ప్రొఫెసర్ పోస్టులకు 50 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 45 ఏళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కాంట్రాక్ట్/శాశ్వత ప్రాతిపదికను అనుసరించి 30/35/40 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ.
దరఖాస్తు ఫీజు: లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 11, 2017
వెబ్‌సైట్: www.upsconline.nic.in
ఐఆర్‌డీఏఐ 30 ఖాళీలు
హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ).. 30 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువరించింది.
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్
వేతనం: ప్రారంభ వేతనం రూ.28,150 +అలవెన్సులు.
మొత్తం ఖాళీలు: 30 (అన్‌రిజర్వుడ్–16, ఓబీసీ–7, ఎస్సీ–4, ఎస్టీ–3).
విభాగాల వారీ ఖాళీలు: యాక్చ్యురియల్–4, అకౌంట్స్–4, లీగల్–2, జనరల్–20.
అర్హతలు : 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. యాక్చ్యరియల్ విభాగం పోస్టులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్యు ్చరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ) పరీక్షలో తొమ్మిది పేపర్ల ఉత్తీర్ణత, అకౌంట్స్ పోస్టులకు ఏసీఏ/ ఏఐసీడబ్ల్యూఏ/ ఏసీఎంఏ/ఏసీఎస్/సీఎఫ్‌ఏ, లీగల్ విభాగం పోస్టులకు ఎల్‌ఎల్‌బీ తప్పనిసరి.
వయో పరిమితి : 2017 సెప్టెంబర్ 9 నాటికి 21–30 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఫేజ్–1లో ప్రిలిమినరీ, ఫేజ్–2లో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్, ఫేజ్–3లో ఇంటర్వ్యూ.
పరీక్షల విధానం: ఫేజ్–1 ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్‌లో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నల చొప్పున 160 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి 1/4 మార్కు చొప్పున రుణాత్మక మార్కు ఉంటుంది. పరీక్ష వ్యవధి గంట.
ఫేజ్–2 (డిస్క్రిప్టివ్) ఎగ్జామినేషన్.. మూడు పేపర్లు ఉంటాయి. పేపర్–1లో ఇంగ్లిష్, పేపర్–2లో ఎకనమిక్ అండ్ సోషల్ ఇష్యూస్ ఇంపాక్టింగ్ ఇన్సూరెన్స్, పేపర్–3లో ఇన్సూరెన్స్ అండ్ మేనేజ్‌మెంట్. ఒక్కో పేపర్ 100 మార్కులకు చొప్పున 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవధి ఒక్కో విభాగానికి గంట.
ఫేజ్–3(ఇంటర్వ్యూ): ఫేజ్–2 మెరిట్ అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఫేజ్–2, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు (తెలుగు రాష్ట్రాల్లో): ఫేజ్–1.. హైదరాబాద్, విజయవాడ; ఫేజ్–2.. హైదరాబాద్
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/ఎక్స్–సర్వీస్‌మెన్ రూ.100 (ఇంటిమేషన్ ఛార్జెస్); మిగిలిన అభ్యర్థులకు రూ.650(ఎగ్జామినేషన్ ఫీ+ ఇంటిమేషన్ ఛార్జెస్)
దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 5, 2017.
వెబ్‌సైట్: www.irdai.gov.in