Job Point
-
కాస్త శ్రద్ధ పెడితే కేంద్ర కొలువు మీ సొంతం!
ఈపీఎఫ్ఓ–2020 నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల భర్తీకి త్వరలో పరీక్ష నిర్వహించనున్నట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఇటీవల ప్రకటించింది. గతేడాది వెలువడిన ఈ నోటిఫికేషన్ నియామక పరీక్ష వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ఈ పరీక్ష ద్వారా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ శాఖల్లో 421 ఖాళీలు భర్తీ చేయనున్నారు. 2021 మే 9వ తేదీన పరీక్ష జరుగనుంది. ఈ నేపథ్యంలో.. పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్ టిప్స్... యూపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఈపీఎఫ్ఓ నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులకు గ్రాడ్యుయేషన్ చేసినవారు అర్హులు. ఇప్పటికే ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి గతంలోనే జరగాల్సిన ఈ పరీక్ష కోవిడ్ కారణంగా వాయిదా పడింది. దాంతో చాలామంది తమ ప్రిపరేషన్‌ను వాయిదా వేశారు. మే 9వ తేదీన పరీక్ష జరుగనుంది. ప్రస్తుతం తక్కువ సమయమే అందుబాటులో ఉంది. ఈ విలువైన సమయంలో సమర్థంగా ప్రిపరేషన్ సాగిస్తే.. విజయం సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్ష విధానం ఈపీఎఫ్ఓ పోస్టుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో(ఫేజ్–1, ఫేజ్–2) చేపడతారు. మొదటి దశలో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇందులో ప్రతిభ చూపినవారిని రెండో దశ పర్సనల్ ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ♦ రాత పరీక్ష: ఇది ఆఫ్‌లైన్ అంటే.. పెన్ అండ్ పేపర్ ఆధారిత విధానంలో జరిగే పరీక్ష. ఇందులో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. వీటిని రెండు గంటల్లో పూర్తిచేయాలి. అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3వంతు మార్కు తగ్గిస్తారు. పేపర్ హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది. ♦ పర్సనల్ ఇంటర్వ్యూ: రాత పరీక్షలో ప్రతిభ చూపినవారిని పర్సనల్ ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. దీనికి కూడా 100 మార్కులు కేటాయించారు. ఈ విభాగంలో మొత్తం మార్కుల్లో జనరల్ అభ్యర్థులు కనీసం 50మార్కులు, ఓబీసీలు 45, ఎస్సీ/ఎస్టీ /వికలాంగులు 40 మార్కులు సాధించాలి. వీటిని రాత పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులతో కలిసి తుది జాబితా రూపొందిస్తారు. రాత పరీక్షకు 75శాతం, ఇంటర్వ్యూకి 25 శాతం వెయిటేజీ ఇస్తారు. సిలబస్‌పై ఓ లుక్కేయండి ♦ ఇందులో ప్రధానంగా తొమ్మిది విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ♦ జనరల్ ఇంగ్లిష్: ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్, గ్రామర్‌పై ప్రశ్నలు అడుగుతారు. ప్రధానంగా క్లోజ్ టెస్ట్, ఎర్రర్ స్పాటింగ్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, పేరా జంబుల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, సెంటెన్స్ కంప్లీషన్, పేరా కంప్లీషన్, స్పెల్లింగ్స్, సినానిమ్స్, యాంటినిమ్స్పై ప్రశ్నలు ఉంటాయి. ♦ భారత స్వాతంత్రోద్యమం: 1857 నాటి తిరుగుబాటు–బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన మొదటి స్వాతంత్య్ర పోరాటం, భారత జాతీయోద్యమం–కారణాలు,భారత జాతీయవాదం–మితవాద దశ, మింటో–మార్లె సంస్కరణలు, 1905లో బెంగాల్ విభజన, భారత జాతీయోద్యమం–అతివాద దశ, ముఖ్యమైన భారత స్వాతంత్య్ర సమరయోధులు, భారత స్వాతంత్య్రోద్యమంలో విప్లవకారులు, భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ పాత్ర, రౌలత్ చట్టం, జలియన్ వాలాబాగ్ ఘటన, 1916 లక్నో ఒప్పందం, సహాయ నిరాకరణోద్యమం; హోమ్‌రూల్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, 1921 నాటి మోప్లా తిరుగుబాటు, సైమన్ కమిషన్, స్వరాజ్ పార్టీ, గాంధీ–ఇర్విన్ ఒప్పందం, 1930 మొదటి రౌండ్ టేబుల్ సమావేశం, పూనా ఒడంబడిక, క్రిప్స్ మిషన్; క్విట్ ఇండియా ఉద్యమం, భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు, 1947 భారత స్వాతంత్య్ర చట్టంపై ప్రశ్నలు ఉంటాయి. ♦ కరెంట్ ఈవెంట్స్: ఈ విభాగంలో జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు,క్రీడలు, అవార్డులు–వాటి ప్రాముఖ్యత, రాజకీయాలు, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ రంగం, జనాభా గణన, ముఖ్యమైన పుస్తకాలు–వాటి రచయితలు, స్టేట్ యానిమల్స్ అండ్ సింబల్స్, నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తల పేర్లు–వారి ఆవిష్కరణలు, ముఖ్యమైన తేదీలు, ప్రధానమైన ఆవిష్కరణలు–ఆవిష్కర్తల గురించి ప్రశ్నలు వస్తాయి. ♦ ఇండియన్ పాలిటీ–ఎకానమీ: సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఎన్నిక–విధులు, కాగ్ వంటి ముఖ్యమైన రాజ్యాంగ సంస్థలు, పార్లమెంటు గురించి వాస్తవాలు, ప్రాథమిక విధులు, గవర్నర్–విధులు, రాష్ట్ర శాసనసభ, ప్రధాన రాజ్యాంగ సవరణలు–వాటి ప్రాధాన్యం, అధికార భాషలు, అత్యవసర నిబంధనలు, జాతీయ రాజకీయ పార్టీలు–వాటి చిహ్నాలు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ♦ జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపుల్స్: ఇందులో అకౌంటింగ్ కాన్సెప్ట్స్ విభాగంలో.. సెపరేట్ ఎన్టిటీ కాన్సెప్ట్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, డ్యూయల్ యాస్పెక్ట్ కన్సర్న్, రియలైజేషన్ కాన్సెప్ట్, కాస్ట్ కాన్సెప్ట్, అకౌంటింగ్ పిరియడ్ కాన్సెప్ట్, మ్యాచింగ్ కాన్సెప్ట్ అంశాలు ఉన్నాయి. అకౌంటింగ్ కన్వెన్షన్ విభాగంలో.. కన్సర్వేటిజం, కన్సిస్టెన్సీ, ఫుల్ డిస్క్లోజర్, మెటీరియాలిటీ అంశాలను పరిశీలించాలి. ♦ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లాస్: ఈ విభాగంలో భారత రాజ్యాంగం– కార్మికుల నిబంధనలు, మహిళా కార్మికుల కోసం చట్టాలు–ప్రసూతి ప్రయోజన చట్టం, విశాఖ కేసు, ఫ్యాక్టరీల చట్టం, సమాన వేతన చట్టం, భారతదేశంలో కార్మిక చట్టం, కనీస వేతనాల చట్టం, సమ్మెలు, లాకౌట్లు, పారిశ్రామిక వివాదాల చట్టం (ఐడీఏ), లేబర్ కోర్టులు, ఇండస్ట్రియల్ ట్రిబ్యునళ్లు, కార్మికుల నష్టపరిహార చట్టం, ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ చట్టం, పదవీ విరమణ ప్రయోజనాలు, వలస చట్టం, అసంఘటిత కార్మికులు, అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ), భారతదేశంలో కార్మిక మంత్రిత్వశాఖ–కార్మిక మంత్రిత్వశాఖలో ముఖ్యమైన కార్యాలయాలు/సంస్థలు, ప్రధాన కార్మిక కమిషనర్, లేబర్ బ్యూరో, వెల్ఫేర్ కమిషనర్లు, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ), ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ), బోర్డ్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. జనరల్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్‌పై పరిజ్ఞానం: జనరల్ సైన్స్ విభాగంలో..బయాలజీ నుంచి మానవ శరీర భాగాలకు సంబంధించిన ముఖ్యమైన, ఆసక్తికరమైన వాస్తవాలు, జంతువులు, మొక్కల పోషణ, వ్యాధులు–వాటికి కారణాలు ఉంటాయి. ► ఫిజిక్స్ నుంచి ఎస్ఐ ప్రమాణాలు, చలనం, ధ్వని, కాంతి, తరంగం, శక్తి, విద్యుచ్ఛక్తి, కెమిస్ట్రీ నుంచి రసాయనిక ధర్మాలు–వాటి ఉపయోగాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మొదలైన ముఖ్యమైన పదార్థాల రసాయనిక నామాలు, రసాయన మార్పు–భౌతిక మార్పు, వాయువుల ధర్మాలు, ఉపరితల రసాయనశాస్త్రం, నిత్యజీవితంలో రసాయన శాస్త్రం ఉంటాయి. ► కంప్యూటర్స్ డెవలప్మెంట్,ఇన్పుట్ అండ్ అవుట్‌పుట్ పరికరాలు, మెమొరీ, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ► జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో.. జనరల్ మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్’ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ మెంటల్ ఎబిలిటీ: సీక్వెన్స్ ఆఫ్ ఫిగర్స్, సిరీస్, రక్త సంబంధాలు, దిక్కులు, సిలోజిజం, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, స్టేట్మెంట్ అండ్ ఇన్ఫెరెన్సెస్, డేటా సఫిషియెన్సీపై ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ఆల్జీబ్రా, హెచ్‌సీఎఫ్ అండ్ ఎల్సీఎం, యావరేజెస్, మిక్చర్స్ అండ్ అలైగేషన్, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్టనర్షిప్, పర్సంటేజ్ అండ్ ఇట్స్ అప్లికేషన్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఏజెస్, క్యాలెండర్ అండ్ క్లాక్, ప్రాబబిలిటీ, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంశాలను పరిశీలించాలి. సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా: ఇందులో భారతదేశంలో సామాజిక భద్రత, అసంఘటిత రంగానికి సామాజిక భద్రత పథకాలు, పెన్షన్, ఆరోగ్య బీమా–వైద్య ప్రయోజనం, వైకల్య బెనిఫిట్, ప్రసూతి బెనిఫిట్, గ్రాట్యుటీ వంటి సామాజిక సామాజిక భద్రతా పథకాలు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ), ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ), అటల్ పెన్షన్ యోజన(ఏపీవై), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎం జేజేబీఈ), ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన(పీఎంఎస్బీవై), ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) యోజన, ప్రధానమంత్రి కిసాన్ మంధాన్ యోజన మొదలైన పథకాలపై ప్రశ్నలు వస్తాయి. పాత పేపర్ల సాధన రాత పరీక్షను మే 9వ తేదీన నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. దీనిప్రకారం చూస్తే మొత్తం సిలబస్ పూర్తి చేయడానికి ఉన్న సమయం సుమారు 45 రోజులు మాత్రమే. ఇంత తక్కువ సమయంలో సిలబస్‌ను పూర్తిచేయాల్సి రావడం కత్తిమీద సాములాంటిదే. అందువల్ల సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే అభ్యుర్థులు ఇప్పటికే పూర్తి చేసిన సిలబస్‌ను మరోసారి రివిజన్ చేసుకుంటూ.. పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కులు ఉన్నందున తెలియని ప్రశ్నల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. ప్రతిరోజు మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ కోసం నిర్ణీత సమయం కేటాయించుకోవాలి. ఏ విభాగంలో వెనుకబడి ఉన్నారో గుర్తించి.. ఆయా టాపిక్స్‌పై అధిక సమయం కేటాయించి చదవాలి. చదవండి: ఈ భాష నేర్చుకుంటే బ్రహ్మాండమైన ఉద్యోగం! -
ఈ భాష నేర్చుకుంటే బ్రహ్మాండమైన ఉద్యోగం!
కొత్త భాష నేర్చుకుంటే ఏమొస్తుంది? కొత్త ఉత్సాహం వస్తుంది. మెమోరీ మెరుగు పడుతుంది. విషయ జ్ఞానం పెరుగుతుంది. జపనీస్ నేర్చుకుంటే వీటితో పాటు బ్రహ్మాండమైన ఉద్యోగం కూడా వస్తుంది.... తమ దేశంలో ఉద్యోగుల కొరత తీర్చడానికి మన ప్రభుత్వం జపాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. హెల్త్‌కేర్, కన్స్ట్రక్షన్, ఏవియేషన్, ఫుడ్‌సర్వీస్, నర్సింగ్‌కేర్, మెషిన్ పార్ట్స్ అండ్ టూల్ ఇండస్త్రీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్, షిప్ బిల్డింగ్ అండ్ షిప్ మెషినరీ...ఇలా పద్నాలుగు రంగాలలో జపాన్‌లో బోలెడు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగం చేయాలనుకునేవారికి స్పెసీఫైడ్ స్కిల్డ్ వర్కర్ కేటగిరిలో జపాన్ ప్రభుత్వం ప్రత్యేక వీసాలు ఇవ్వనుంది. 2030 నాటికి జపాన్‌లో 60 లక్షలకుపైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగం కోసం జపాన్ వైపు చూస్తోంది యువత. అయితే అక్కడ ఉద్యోగ ఎంపికలో జపనీస్ భాష నైపుణ్యం అనేది కీలకం కావడంతో పెన్ను, పుస్తకం పట్టుకొని భాష బడుల వైపు పరుగెత్తే వారి సంఖ్య పెరుగుతుంది. అసలు మనం జపనీస్ నేర్చుకోగలమా, మన వల్ల అవుతుందా? ఎందుకు కాదు అంటున్నాడు థామస్. యూరోపియన్ సిటిజన్ అయిన థామస్ ఫ్లైర్ సరదాగా జపనీస్ మీద మనసుపడ్డాడు. ఎలాగైనా నేర్చుకోవాలనుకోవడమే కాదు నేర్చుకున్నాడు కూడా. జపనీస్ రాయగలడు. మాట్లాడగలడు. తాను జపనీస్ ఎలా నేర్చుకున్నది ఆయన మాటల్లోనే... ‘మొదట నేను చేసిన పని ఏమిటంటే, జపనీస్ నేర్చుకోవడానికి అవసరమైన అన్ని రకాల పుస్తకాలు కొనడం. వాటిలో డిక్షనరీ, వొకాబులరీ, గ్రామర్ పుస్తకాలు ఉన్నాయి. ఎంత పెద్ద భవనానికైనా పునాది గట్టిగా ఉండాలంటారు కదా...కొత్త భాష మనకు పట్టుబడాలంటే ఎక్కువ పదాలు నేర్చుకోవాలి. ఇందుకు wani kani వెబ్సైట్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఆరువేల పదాలను నేర్చుకోవచ్చు. text fugu సెల్ఫ్ లెర్నింగ్ జపనీస్ ఆన్లైన్ బుక్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో టెక్స్ట్‌తో పాటు వీడియోలు కూడా ఉంటాయి. జపనీస్ వైబ్సెట్లలోకి వెళ్లి చిన్న చిన్న పదాలు చదివేవాడిని. నీ పేరేమిటి? మీ ఇల్లు ఎక్కడ...నిత్యజీవితంలో ఉపయోగపడే చిన్న చిన్న వాక్యాలు నేర్చుకున్నాను. భాష నైపుణ్యానికి మూడు ‘పి’లు ఉంటే సరిపోతుంది. 1.ప్రాక్టిస్ లిజనింగ్ 2. ప్రాక్టిస్ స్పీకింగ్ 3. ప్రాక్టిస్ రైటింగ్. lang8 అనే సోషల్ నెట్‌వర్క్‌లోకి వెళితే మనకు విలువైన సలహాలెన్నో దొరుకుతాయి. జపనీస్‌లో మీరేమైనా రాసి పోస్ట్ చేస్తే అందులో ఏదైనా తప్పుదొర్లితే ఎవరో ఒకరు సవరించడమే కాదు సలహా కూడా ఇస్తారు. భాష నేర్చుకోవడం అనేది భారం కాదు. ఒక ప్రయాణం. గమ్యం చేరే క్రమంలో చేసే ప్రయాణం ఆనందమయం. లెర్న్ జపనీస్ ఆల్ఫాబెట్, జపనీస్ ఆల్ఫాబెట్ విత్ ఇంగ్లిష్ ట్రాన్స్లేషన్, హౌటూ రీడ్ అండ్ రైట్ హిరగన (జపనీ అక్షరమాల)...మొదలైన పీడిఎఫ్లతో పాటు వీడియోలు నెట్లో అందుబాటులో ఉన్నాయి. అందాలొలికే సుందర జపనీ ► జపనీస్ కాలిగ్రఫీని ‘షోడో’ అంటారు. ఎంతో మంది విదేశీలు దీనికి ఆకర్షితులయ్యారు. ‘కంజి’ క్యారెక్టర్లలో 1–3 స్ట్రోక్‌లతో పాటు 20 స్ట్రోక్‌లతో రూపొందించినవి ఉన్నాయి. ► ఇంగ్లిష్‌కు ఒక స్క్రిప్ట్ చాలు. జపనీస్‌లో మాత్రం హిరగన, కటకన, కంజి అనే మూడు స్క్రిప్ట్‌లను నేర్చుకోవాల్సిందే. అయితే ఈ మూడు కలిపే ఉపయోగిస్తారు. దీంతో పాటు రొమజి (రోమనైజేషన్ ఆఫ్ జపనీ) స్క్రిప్ట్ కూడా ఉంటుంది. పిల్లల పుస్తకాలు తప్పనిసరిగా హిరగన, కటకన లో ఉంటాయి. హిరగన, కటకనలను కలిపి ‘కన’ అంటారు. ► ‘ది ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది యూఎస్’ చెప్పేదాని ప్రకారం జపనీస్‌లో పదును తేలడానికి 2200 గంటలు అవసరమవుతాయి. - కౌన్ ఒ ఇనొరిమసు (బెస్ట్ ఆఫ్ లక్) -
జాబ్ పాయింట్
ఐబీపీఎస్...పీవో/ఎంటీ 3,562 ఖాళీలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. వివిధ బ్యాంకుల్లోని 3,562 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/ మేనేజ్మెంట్ ట్రైనీ (ఎంటీ) ఖాళీలకు కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్– సీడబ్ల్యూఈ పీవో/ ఎంటీ–7 ద్వారా దరఖాస్తులు కోరుతోంది. పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్మెంట్ ట్రైనీ (ఎంటీ). మొత్తం ఖాళీలు : 3,562 (అన్ రిజర్వుడ్–1,738 +ఓబీసీ 961+ ఎస్సీ– 578 + ఎస్టీ–285). అర్హతలు : ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉత్తీర్ణులై ఉండాలి. వయో పరిమితి : 2017 ఆగస్ట్ 1 నాటికి 20–30 ఏళ్ల లోపు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం : మూడు దశల్లో ఉంటుంది. అవి.. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ. పరీక్షల విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్స్ ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ : మార్కులు 100; వ్యవధి గంట. విభాగం ప్రశ్నలు మార్కులు మీడియం రీజనింగ్ ఎబిలిటీ 35 35 ఇంగ్లిష్, హిందీ ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 30 ఇంగ్లిష్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 35 ఇంగ్లిష్, హిందీ మొత్తం 10 100 మెయిన్ ఎగ్జామినేషన్: మొత్తం 225 మార్కులకు ఉంటుంది. ఇందులో రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్– 45 ప్రశ్నలు 60 మార్కులు (వ్యవధి గంట), జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్.. 40 ప్రశ్నలు 40 మార్కులకు (వ్యవధి 35 నిమిషాలు), ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్.. 35 ప్రశ్నలు 40 మార్కులు (40 నిమిషాలు), డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్.. 35 ప్రశ్నలు 60 మార్కులు (వ్యవధి 45 నిమిషాలు), లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే (ఇంగ్లిష్)–2 ప్రశ్నలు 25 మార్కుల (వ్యవధి 30 నిమిషాలు)కు ఉంటాయి. రుణాత్మక మార్కులు: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్ రెండింట్లోనూ ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగిటివ్ మార్కు ఉంటుంది. ఇంటర్వ్యూ: మెయిన్ ఎగ్జామినేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూలో మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేపడతారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేంద్రాలు (తెలుగు రాష్ట్రాల్లో): ఆంధ్రప్రదేశ్‌లో.. చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. మెయిన్ ఎగ్జామినేషన్ కేంద్రాలు (తెలుగు రాష్ట్రాల్లో): ఆంధ్రప్రదేశ్‌లో.. గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం; తెలంగాణలో.. హైదరాబాద్. నోట్: ఐబీపీఎస్ నిర్ణయాన్ని బట్టి పరీక్షల కేంద్రాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.100; మిగిలిన అభ్యర్థులకు రూ.600. దరఖాస్తు విధానం: వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. www.ibps.in ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఆగస్ట్ 16, 2017 ఆన్లైన్ దరఖాస్తుల ముగింపు: సెప్టెంబర్ 5, 2017 ఆన్లైన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ: ఆగస్ట్ 16, 2017– సెప్టెంబర్ 5, 2017 ప్రి–ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెటర్ డౌన్లోడ్: సెప్టెంబర్, 2017 ప్రి–ఎగ్జామ్ ట్రైనింగ్ : సెప్టెంబర్ 23–29, 2017 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్లోడ్: సెప్టెంబర్, 2017 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(ఆన్లైన్): అక్టోబర్ 7,8,14,15, 2017 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫలితాలు: అక్టోబర్, 2017 మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్లోడ్: నవంబర్, 2017 మెయిన్ ఎగ్జామినేషన్(ఆన్లైన్): నవంబర్ 26, 2017 మెయిన్ ఎగ్జామినేషన్ ఫలితాలు: డిసెంబర్, 2017 ఇంటర్వ్యూ కాల్‌లెటర్ డౌన్లోడ్: జనవరి, 2018 ఇంటర్వ్యూ: జనవరి/ఫిబ్రవరి, 2018 ప్రొవిజినల్ అలాట్మెంట్: ఏప్రిల్ 2018 యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 696 ఖాళీలు చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీఎల్).. దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖల్లోని 696 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది. యూఐఐసీఎల్ భారత ప్రభుత్వ ఆధీనంలోని పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. పోస్టు పేరు: అసిస్టెంట్ వేతనం: రూ.14,435–రూ.32,030+ నిబంధనల మేర ఇతర అలవెన్సులు. ఉద్యోగ ప్రాంతాన్ని బట్టి వేతనంలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. మొత్తం పోస్టులు: 696 (అన్‌రిజర్వుడ్–414, ఓబీసీ–122, ఎస్సీ–110, ఎస్టీ–50). తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్–32(అన్‌రిజర్వుడ్–14, ఓబీసీ–6, ఎస్సీ–7, ఎస్టీ–5); తెలంగాణ–20(అన్‌రిజర్వుడ్–13, ఎస్సీ–3, ఎస్టీ–4).అర్హతలు: ఏదైనా డిగ్రీ. అలాగే స్థానిక భాషలో మంచి పట్టు (మాట్లాడగలగడం, చదవడం, రాయడం) తప్పనిసరి. వయో పరిమితి: 2017 జూలై 30 నాటికి 18–28 ఏళ్ల లోపు ఉండాలి; ఎస్సీ /ఎస్టీ కేటగిరీలకు అయిదేళ్లు, ఓబీసీ–మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంది. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ కేటగిరీల్లోని దివ్యాంగ అభ్యర్థులకు, ఎక్స్–సర్వీస్‌మెన్ కేటగిరీకి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఇందులో టైర్–1 (ప్రిలిమినరీ ఎగ్జామినేషన్), టైర్–2 (మెయిన్ ఎగ్జామినేషన్) దశలు ఉంటాయి. ఠి పరీక్షల (ప్రిలిమినరీ, మెయిన్) విధానం: టైర్–1 (ప్రిలిమినరీ ఎగ్జామినేషన్) ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్–30 ప్రశ్నలు, రెండో విభాగంలో టెస్ట్ ఆఫ్ రీజనింగ్–35, మూడో విభాగంలో టెస్ట్ ఆఫ్ న్యూమెరికల్ ఎబిలిటీ–35 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి గంట. ఇందులో కనీస అర్హత మార్కులు వచ్చిన అభ్యర్థుల్లో రాష్ట్ర, కేటగిరీ ప్రకారం 1:7 నిష్పత్తిలో మెరిట్ జాబితా తయారుచేస్తారు. వీరికి టైర్–2 (మెయిన్) ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్–2 (మెయిన్ ఎగ్జామినేషన్)లో ఐదు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 50 మార్కుల చొప్పున మొత్తం 250 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులోని ఐదు విభాగాలు.. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, టెస్ట్ ఆఫ్ న్యూమెరికల్ ఎబిలిటీ. ఇందులోనూ నిర్దేశిత మార్కులతో ఉత్తీర్ణులైన వారికి స్థానిక భాషపై పరీక్ష (రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్) ఉంటుంది. ఇందులోనూ క్వాలిఫై అయితే ఆర్నెళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అభ్యర్థి పనితీరు, ప్రవర్తన ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పరీక్ష కేంద్రాలు(తెలుగు రాష్ట్రాల్లో): ఆంధ్రప్రదేశ్–చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, కంచికచర్ల, ఏలూరు, విజయనగరం; తెలంగాణ–హైదరాబాద్/రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.100; మిగిలిన కేటగిరీలకు రూ.500. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 28, 2017. వెబ్సైట్: www.uiic.co.in కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో అప్రెంటీస్ 172 ఖాళీలు కేరళలోని కొచిలో ఉన్న కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్.. 172 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది. పోస్టు పేరు–ఖాళీలు: గ్రాడ్యుయేట్ అప్రెంటీసెస్–72(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్–12, మెకానికల్ ఇంజనీరింగ్–27, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్–6, సివిల్ ఇంజనీరింగ్–12, కంప్యూటర్‌సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–8, సేఫ్టీ ఇంజనీరింగ్–3, మెరైన్ ఇంజనీరింగ్–2, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్‌బిల్డింగ్–2) ; టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటీసెస్–100(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్–22, మెకానికల్ ఇంజనీరింగ్–28, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్–8, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్–7, సివిల్ ఇంజనీరింగ్–9, కంప్యూటర్ ఇంజనీరింగ్–6, కమర్షియల్ ప్రాక్టీస్–20). శిక్షణ వ్యవధి: ఏడాది స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు రూ.8,000; టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్–రూ.7 వేలు అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి బీఈ/ బీటెక్/డిప్లొమా. వయో పరిమితి: అప్రెంటీస్‌షిప్ నిబంధనల ప్రకారం. ఎంపిక విధానం: విద్యార్హతల మార్కుల శాతం అనుసరించి షార్ట్‌లిస్టింగ్. దరఖాస్తు విధానం: ఎన్ఏటీఎస్ (నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్)లో రిజిస్టర్ అయి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 31, 2017. వెబ్సైట్: www.cochinshipyard.com ముంబై పోర్ట్ ట్రస్ట్ స్పోర్ట్స్ క్లబ్లో 56 ఖాళీలు ముంబై పోర్ట్ స్పోర్ట్స్ క్లబ్.. 56 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. పోస్టు పేరు: స్పోర్ట్స్ ట్రైనీ పోస్టులు: 56 (పురుషులు 54+మహిళలు 2). ఖాళీలు: అథ్లెటిక్స్–5, షటిల్ బ్యాడ్మింటన్–3, బాడీ బిల్డింగ్–2, క్రికెట్–8, ఫుట్‌బాల్–9, హాకీ–9, కబడ్డీ–7, టేబుల్ టెన్నిస్–2, వాలీబాల్–6, వెయిట్ లిఫ్టింగ్–5. నోట్: అథ్లెటిక్స్ విభాగంలో రెండు పోస్టులను మహిళలకు కేటాయించారు. మిగిలినవన్నీ పురుషులకే. అర్హతలు: సంబంధిత క్రీడా విభాగాల్లో మూడేళ్లుగా (2014, 2015, 2016) దేశం తరఫున అంతర్జాతీయ/జాతీయ పోటీల్లో పాల్గొని ఉండాలి. లేదా జాతీయ స్థాయిలో కంబైన్డ్ యూనివర్సిటీ టీమ్‌లో కానీ, యూనివర్సిటీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ నిర్వహించిన ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో కానీ పాల్గొని ఉండాలి. ‘ఏ’ డివిజన్ క్రికెట్ లేదా సూపర్/ఎలైట్ డివిజన్ (హాకీ, ఫుట్‌బాల్)లో ప్రాతినిథ్యం వహించి ఉండాలి. వయో పరిమితి: 2017 ఆగస్ట్ 10 నాటికి 18–26 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపిక విధానం: క్రీడా విభాగాల్లో సాధించిన విజయాల ఆధారంగా... స్టైపెండ్: రూ.15 వేలు. ఇదికాక కిట్‌కు రూ.10 వేలు, మెడికల్ క్లైమ్ + యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ రూ.3,500 (ఏడాదికి) ఉంటాయి. ఉచిత వసతి కల్పిస్తారు. దరఖాస్తు ఫీజు: రూ.100 దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కాపీలు పంపాల్సిన చిరునామా: జేటీ.జనరల్ సెక్రెటరీ, ముంబై పోర్ట్ ట్రస్ట్ స్పోర్ట్స్ క్లబ్, సెకండ్ ఫ్లోర్, రైల్వే మేనేజర్స్ బిల్డింగ్, రామ్‌జీ భాయ్ కమని మార్గ్, నియర్ వసంత్ హోటల్, బల్లార్డ్ ఎస్టేట్, ముంబై–400001. దరఖాస్తులు చేరడానికి చివరి తేదీ: ఆగస్ట్ 31, 2017 www.mumbaiport.gov.in ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 300ఖాళీలు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(ఓఐసీఎల్)లో 300 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువడింది. ఓఐసీఎల్.. భారత ప్రభుత్వ ఆధీనంలోని పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. పోస్టు పేరు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(స్కేల్–1). మొత్తం పోస్టులు: 300(అన్‌రిజర్వుడ్–158, ఓబీసీ–77, ఎస్సీ–44, ఎస్టీ–21). విభాగాల వారీ ఖాళీలు: అకౌంట్స్–20, యాక్చురీస్–2, ఇంజనీర్స్ (ఆటోమొబైల్)–15, లీగల్–30, మెడికల్ ఆఫీసర్(ఎంఓ)–10, జనరలిస్ట్ –223. వేతనం: రూ.32,795–రూ.62,315 అర్హతలు: సంబంధిత విభాగాలను అనుసరించి డిగ్రీ/లా డిగ్రీ/ పీజీ/ ఎంకామ్/సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ/ఎంబీబీఎస్/నాలుగు యాక్చురియల్ పేర్స్(ఐఏఐ/ఐఎఫ్ఓఏ)లో ఉత్తీర్ణత. వయో పరిమితి: 2017 జూలై 31 నాటికి 21–30 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: మూడు దశల్లో ఎంపిక ఉంటుంది. ఫేజ్–1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్–2లో మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్–3లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పరీక్షల (ఫేజ్–1, ఫేజ్–2) విధానం: ఫేజ్–1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ 35 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి గంట. నిర్దేశిత మార్కులతో క్వాలిఫైడ్ అభ్యర్థుల నుంచి 1:20 నిష్పత్తిలో మెయిన్ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు. ఫేజ్–2 (మెయిన్ ఎగ్జామినేషన్)లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో, 30 మార్కులకు డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ వ్యవధి రెండు గంటలు. జనరలిస్ట్స్ పోస్టులకు 4 విభాగాలు, మిగిలిన పోస్టులకు 5 విభాగాలుగా ప్రశ్నపత్రం ఉంటుంది. జనరలిస్ట్స్కు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్.. ఒక్కోటి 50 మార్కులకు చొప్పున 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. మిగిలిన పోస్టులకు టెస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అదనంగా నిర్వహిస్తారు. ఒక్కో విభాగానికి 40 మార్కులకు చొప్పన 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఫేజ్–2 పరీక్ష వ్యవధి గంట; డిస్క్రిప్టివ్ విధానంలో 30 మార్కులకు లెటర్ రైటింగ్, ఎస్సే ఉంటాయి. ఫేజ్–1, ఫేజ్–2 రెండు పరీక్షలు ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. ఫేజ్–3 (ఇంటర్వ్యూ): మెయిన్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణుల మెరిట్ జాబితాలోని అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అనంతరం తుది ఎంపిక చేపడతారు. దరఖాస్తు ఫీజు: రూ.600(అప్లికేషన్ ఫీ+ఇంటిమేషన్ ఛార్జెస్); ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 (ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే). దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు ప్రారంభం: ఆగస్ట్ 18, 2017. దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 15, 2017. వెబ్సైట్: www.mumbaiport.gov.in యూపీఎస్సీ...54 ఖాళీలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని 54 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువరించింది. పోస్టుల పేరు–ఖాళీలు: అసిస్టెంట్ డైరెక్టర్(కెమిస్ట్రీ)–1; అసిస్టెంట్ ఇంజనీర్–3(ఎలక్ట్రికల్–1+ మెకానికల్–2); అసిస్టెంట్ ఫ్రొఫెసర్ (స్పెషలిస్ట్ గ్రేడ్–3)–37(అనాటమీ–8+ ఒబేస్ట్రిక్ అండ్ గైనకాలజీ–13+ ఆప్తాల్మాలజీ–3 + ఆర్థోపీడియాక్(స్పోర్ట్స్ ఇంజూరీ సెంటర్)–1+ పీడియాట్రిక్ కార్డియాలజీ–2+ రేడియో థెరపీ–10); అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్–6; డ్రిల్లర్ ఇంచార్జ్–5; లెక్చరర్–2 (ఎలక్ట్రికల్–1+మెకానికల్–1). వేతనం: అసిస్టెంట్ డైరెక్టర్ (కెమిస్ట్రీ), అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు–రూ.15,600–రూ.39,100; అసిస్టెంట్ ఇంజనీర్‌కు– రూ.44,900–రూ.1,42,400; అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు– రూ.56,100–రూ.1,77,500; డ్రిల్లర్ ఇంచార్జ్‌కు–రూ.9,300–34,800. అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా/ఎంఎస్సీ/ఎంబీబీఎస్/డీఎన్బీ/ఎంసీహెచ్/డీఎం/ఎండీ/ఎంఎస్. దీంతోపాటు నిబంధనల మేర ఉద్యోగానుభవం, మార్కుల శాతం ఉండాలి. వయోపరిమితి: పోస్టులను అనుసరించి నిబంధనల మేరకు. ఎంపిక విధానం: రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ. దరఖాస్తు ఫీజు: రూ.25; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళలకు ఫీజు లేదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 31, 2017. వెబ్సైట్: www.upsconline.nic.in నిట్–రూర్కెలా 203 ఖాళీలు రూర్కెలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో 203 బోధన ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువడింది. మొత్తం ఖాళీలు: 203 (అన్‌రిజర్వుడ్–55, ఓబీసీ–82, ఎస్సీ–40, ఎస్టీ–26). ఇందులో కొన్ని పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. పోస్టుల పేరు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. బోధన విభాగాలు: ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ డిజైన్, ఆర్కిటెక్చర్, సైన్స్/ హ్యుమానిటీస్ అండ్ సోషియల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. వేతనం: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.15,600–రూ.39,100; అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు రూ.37,400–రూ.67,000. వీటిలో పోస్టులవారీ గ్రేడ్ పేలో మార్పులు ఉంటాయి. అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి పీహెచ్‌డీతో పాటు బీఈ/బీటెక్/బీ.డిజైన్/బీఆర్క్/ఎంఆర్క్/మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ/ పీజీడీబీఎం. నిబంధనల మేర మార్కుల శాతం ఉండాలి. ఉద్యోగానుభవం అభిలషణీయం. వయో పరిమితి: 2017 సెప్టెంబర్ 11 నాటికి ప్రొఫెసర్ పోస్టులకు 50 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 45 ఏళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కాంట్రాక్ట్/శాశ్వత ప్రాతిపదికను అనుసరించి 30/35/40 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ. దరఖాస్తు ఫీజు: లేదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 11, 2017 వెబ్సైట్: www.upsconline.nic.in ఐఆర్డీఏఐ 30 ఖాళీలు హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ).. 30 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువరించింది. పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్ వేతనం: ప్రారంభ వేతనం రూ.28,150 +అలవెన్సులు. మొత్తం ఖాళీలు: 30 (అన్‌రిజర్వుడ్–16, ఓబీసీ–7, ఎస్సీ–4, ఎస్టీ–3). విభాగాల వారీ ఖాళీలు: యాక్చ్యురియల్–4, అకౌంట్స్–4, లీగల్–2, జనరల్–20. అర్హతలు : 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. యాక్చ్యరియల్ విభాగం పోస్టులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్యు ్చరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ) పరీక్షలో తొమ్మిది పేపర్ల ఉత్తీర్ణత, అకౌంట్స్ పోస్టులకు ఏసీఏ/ ఏఐసీడబ్ల్యూఏ/ ఏసీఎంఏ/ఏసీఎస్/సీఎఫ్ఏ, లీగల్ విభాగం పోస్టులకు ఎల్ఎల్బీ తప్పనిసరి. వయో పరిమితి : 2017 సెప్టెంబర్ 9 నాటికి 21–30 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఫేజ్–1లో ప్రిలిమినరీ, ఫేజ్–2లో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్, ఫేజ్–3లో ఇంటర్వ్యూ. పరీక్షల విధానం: ఫేజ్–1 ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్‌లో ఆన్లైన్లో నిర్వహిస్తారు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నల చొప్పున 160 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి 1/4 మార్కు చొప్పున రుణాత్మక మార్కు ఉంటుంది. పరీక్ష వ్యవధి గంట. ఫేజ్–2 (డిస్క్రిప్టివ్) ఎగ్జామినేషన్.. మూడు పేపర్లు ఉంటాయి. పేపర్–1లో ఇంగ్లిష్, పేపర్–2లో ఎకనమిక్ అండ్ సోషల్ ఇష్యూస్ ఇంపాక్టింగ్ ఇన్సూరెన్స్, పేపర్–3లో ఇన్సూరెన్స్ అండ్ మేనేజ్మెంట్. ఒక్కో పేపర్ 100 మార్కులకు చొప్పున 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవధి ఒక్కో విభాగానికి గంట. ఫేజ్–3(ఇంటర్వ్యూ): ఫేజ్–2 మెరిట్ అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఫేజ్–2, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పరీక్ష కేంద్రాలు (తెలుగు రాష్ట్రాల్లో): ఫేజ్–1.. హైదరాబాద్, విజయవాడ; ఫేజ్–2.. హైదరాబాద్ దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/ఎక్స్–సర్వీస్‌మెన్ రూ.100 (ఇంటిమేషన్ ఛార్జెస్); మిగిలిన అభ్యర్థులకు రూ.650(ఎగ్జామినేషన్ ఫీ+ ఇంటిమేషన్ ఛార్జెస్) దరఖాస్తు విధానం: వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 5, 2017. వెబ్సైట్: www.irdai.gov.in -
పదో తరగతితో కేంద్ర ప్రభుత్వోద్యోగం
-
పదో తరగతితో కేంద్ర ప్రభుత్వోద్యోగం
కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ).. సెక్యూరిటీ అసిస్టెంట్ల (మోటర్ ట్రాన్స్పోర్ట్) నియామకానికి ప్రకటనను విడుదల చేసింది. దీని ద్వారా పదో తరగతి విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అందుకోవచ్చు. నోటిఫికేషన్ వివరాలు.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో 209 పోస్టులు ఖాళీల వివరాలు: మొత్తం పోస్టులు 209 (ఓపెన్ కేటగిరీ-106, ఓబీసీ-45, ఎస్సీ-30, ఎస్టీ-28). దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానుల వారీగా పోస్టుల సంఖ్యను పరిశీలిస్తే హైదరాబాద్‌లో 4 (ఓపెన్-2, ఓబీసీ-1, ఎస్సీ-1), విజయవాడలో 4 (ఓపెన్-2, ఓబీసీ-1, ఎస్సీ-1) పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా ఢిల్లీలో 45 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను జనరల్ సెంట్రల్ సర్వీస్‌లోని గ్రూప్-సీ (నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) కేటగిరీగా పేర్కొన్నారు. వేతనం: రూ.5,200-20,200 ప్లస్ గ్రేడ్ పే రూ.2000 (పీబీ-1). వీటితోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఇతర అలవెన్సులు. విద్యార్హత-పరిజ్ఞానం: పదో తరగతి/తత్సమానం. మోటర్ మెకానిజం తెలిసుండాలి. వాహనంలో తలెత్తే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించగలగాలి. అనుభవం: లైట్ మోటర్ వెహికిల్ డ్రైవింగ్ లెసైన్స్ తీసుకున్న తేదీ నుంచి కనీసం ఏడాది పాటు కారు నడిపిన అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు; ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. గమనిక: వయసు, విద్యార్హతలు, డ్రైవింగ్ లెసైన్స్, అనుభవం తదితరాలకు కటాఫ్ తేదీగా 2016 ఆగస్టు 6ను పరిగణనలోకి తీసుకుంటారు. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా విధులను నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: 100 మార్కులకు నిర్వహించే స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో 50 మార్కులను డ్రైవింగ్ టెస్ట్‌కు, 50 మార్కులను మోటర్ మెకానిజం టెస్ట్‌కు కేటాయించారు. డ్రైవింగ్ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థులు ఇన్స్ట్రక్టర్ సూచనల మేరకు వాహనం నడపాలి. మోటర్ మెకానిజం టెస్ట్‌లో భాగంగా వాహనం నిర్వహణ, అందులో తలెత్తే తేలికపాటి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైనవారికి క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్ వెరిఫికేషన్ (ప్రవర్తన, పూర్వాపరాల తనిఖీ), వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 6, 2016 పరీక్ష ఫీజు: జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.50 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు ఇచ్చారు. చివరి తేదీ (ఆగస్టు 6)న అప్లై చేసేవాళ్లు 8, 9 తేదీల్లో కూడా ఎగ్జామ్ ఫీజు చెల్లించొచ్చు. వెబ్సైట్: దరఖాస్తు చేసుకునేందుకు, వివరాలకు http://mha.nic.in/vacanciesను చూడొచ్చు. .................................... నేవీలో 262 పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) నియామకానికి భారత నావికా దళం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి విద్యార్హతతోనే ఉజ్వల భవిష్యత్‌ను నిర్మించుకునేందుకు బాటలు వేసే ఈ కొలువులు ఉద్యోగార్థులకు సువర్ణావకాశం లాంటివి. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టులు 262. ఇందులో ఎంటీఎస్ (మినిస్టీరియల్)-246, ఎంటీఎస్ (నాన్ ఇండస్ట్రియల్)-16. కేటగిరీల వారీగా చూస్తే.. 1. ఎంటీఎస్ (మినిస్టీరియల్) మొత్తం పోస్టుల్లో ఎక్స్సర్వీస్మెన్లకు 25, అంధులకు 5, బధిరులకు 7, క్రీడాకారులకు 12 పోస్టులను రిజర్వ్ చేశారు. 2. ఎంటీఎస్ (నాన్-ఇండస్ట్రియల్) మొత్తం పోస్టుల్లో ఎక్స్సర్వీస్మెన్లకు 2, క్రీడాకారులకు 1 పోస్టును రిజర్వ్ చేశారు. వేతనం: రూ.5,200-20,200 ప్లస్ గ్రేడ్ పే రూ.1800 విద్యార్హత: మినిస్టీరియల్ పోస్టులకు పదో తరగతి/తత్సమాన విద్యార్హత, నాన్ ఇండస్ట్రియల్ పోస్టులకు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్లలో నైపుణ్యం ఉండాలి. వయసు: మినిస్టీరియల్ పోస్టులకు 18-27 ఏళ్లు. నాన్ ఇండస్ట్రియల్ పోస్టులకు 18-25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీలు, ప్రభుత్వోద్యోగులు, డిపార్ట్మెంట్ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. విధులు: మినిస్టీరియల్ సిబ్బంది కింది విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. అవి.. 1. సంబంధిత సెక్షన్లు/యూనిట్లలో రికార్డుల నిర్వహణ 2. సెక్షన్లు/యూనిట్లలో పరిశుభ్రత 3. కార్యాలయ భవనాల్లో ఫైల్స్, ఇతర పత్రాల బట్వాడా 4. డాక్యుమెంట్లను జిరాక్స్ తీయడం, ఫ్యాక్స్ చేయడం 5. సెక్షన్లు/యూనిట్లలో ఇతర నాన్ క్లరికల్ పనులు 6. ఉత్తరాల బట్వాడా 7. పహారా, రక్షణ 8. ప్రారంభ, ముగింపు విధులు (ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డ్యూటీస్) 9. రూమ్‌లు, వాష్ రూమ్‌ల క్లీనింగ్ 10. కార్యాలయ సామగ్రి దుమ్ము దులపడం 11. సంబంధిత పోస్టుకు తగిన పనులు 12. పైఅధికారులు చెప్పే ఇతర పనులు నాన్ ఇండస్ట్రియల్ సిబ్బంది కూడా సంబంధిత పోస్టులకు తగిన విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎంపిక విధానం: దరఖాస్తులు భారీగా వస్తే అందరికీ రాత పరీక్ష నిర్వహించడం కష్టంతో కూడిన పని. అందువల్ల పదో తరగతి మార్కుల ఆధారంగా సముచిత సంఖ్యలో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష విధానం: అన్నీ ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలే ఇస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. సబ్జెక్టుల వారీగా ప్రశ్నల సంఖ్యను పరిశీలిస్తే.. పరీక్ష తేదీ: రాత పరీక్షను 2016 సెప్టెంబర్ 25న (లేదా) అక్టోబర్ 1న నిర్వహించే అవకాశం ఉంది. ఖచ్చితమైన తేదీ, సమయం, పరీక్ష కేంద్రం వివరాలను అడ్మిట్ కార్డ్పైన, నేవీ వెబ్సైట్లో కొద్ది రోజుల తర్వాత పొందుపరుస్తారు. తుది ఎంపిక: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయినవారికి సర్టిఫికెట్ల తనిఖీ, వైద్య పరీక్షలు నిర్వహించి, అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును పూర్తి చేసి, సెల్ఫ్ అటెస్ట్ చేసిన ధృవీకరణ పత్రాల జిరాక్స్‌లను జత చేసి రిజిస్టర్ పోస్ట్‌లో/స్పీడ్ పోస్ట్‌లో పంపాలి. దరఖాస్తు ఉన్న ఎన్వలప్ కవర్‌పై ‘అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (మినిస్టీరియల్/ నాన్ ఇండస్ట్రియల్) ‘‘...........’’, కేటగిరీ (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ యూఆర్/ఈఎస్ఎం/ పీడబ్ల్యూడీ) ‘‘......’’ రాయాలి. చిరునామా: ది ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, ((ఫర్ స్టాఫ్ ఆఫీసర్(సివిలియన్ రిక్రూట్మెంట్ సెల్)), హెడ్ క్వార్టర్స్ సదరన్ నావల్ కమాండ్, కొచ్చి, 682004. దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 5 వెబ్సైట్: దరఖాస్తులు, వివరాలకు www.indiannavy.nic.in/content/civilian చూడొచ్చు. ........................... హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో 171 అప్రెంటీస్ పోస్టులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ తన పరిధిలోని వివిధ ప్లాంట్లలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 171 కాగా ఇందులో 101 పోస్టులు రాజస్థాన్‌లోని ఖేత్రి కాపర్ కాంప్లెక్స్‌కు, 42 పోస్టులు జార్ఖండ్‌లోని ఘట్సిలా ప్రాంతంలో గల ఇండియన్ కాపర్ కాంప్లెక్స్‌కు, 28 పోస్టులు గుజరాత్ కాపర్ ప్రాజెక్టుకు సంబంధించినవి. ప్లాంట్లు, ట్రేడ్లు, కేటగిరీల వారీగా వేకెన్సీలు.. 1. ఖేత్రి కాపర్ కాంప్లెక్స్ ఇందులో బ్లాస్టర్(మైన్స్) ట్రేడ్ శిక్షణ కాల వ్యవధి రెండేళ్లు, మేట్(మైన్స్) ట్రేడ్‌కు మూడేళ్లు, మిగిలిన అన్నిటికి ఏడాది. 2. ఘట్సిలాలోని ఇండియన్ కాపర్ కాంప్లెక్స్ ఈ ట్రేడ్లు అన్నిటికీ శిక్షణ కాల వ్యవధి ఏడాది 3. గుజరాత్ కాపర్ ప్లాంట్ ఇందులో ప్లంబర్ ట్రేడ్ శిక్షణ కాల వ్యవధి రెండేళ్లు. మిగిలినవాటికి ఏడాది. విద్యార్హతలు 1.ఖేత్రి కాపర్ కాంప్లెక్స్‌లోని పోస్టులకు మెట్రిక్/సెకండరీ/టెన్త్ (10+2 సిస్టమ్) పాస్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణత. 2014కు ముందు ఐటీఐ పాసైనవారు ఈ మధ్య కాలంలో ఏ సంస్థలోనూ అప్రెంటీస్ చేయలేదని/ఎక్కడా ఉద్యోగంలో చేరలేదని ప్రమాణపత్రాన్ని దాఖలు చేయాలి. బ్లాస్టర్ (మైన్స్), మేట్ (మైన్స్) ట్రేడ్లకు ఐటీఐ, ప్రమాణపత్రాలు అవసరంలేదు. 2.ఘట్సిలా కాంప్లెక్స్‌లోని పోస్టులకు హైస్కూల్/తత్సమాన విద్యార్హతతోపాటు 60 శాతం మార్కులతో సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ (ఎస్సీ/ఎస్టీలకు 50 శాతం). 3.గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టుల్లో వెల్డర్, వైర్‌మ్యాన్ ట్రేడ్లకు 8వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణత. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్లకు సైన్స్, మ్యాథమెటిక్స్‌లతో టెన్త్ (10+2 సిస్టమ్) పాస్ లేదా తత్సమానం. దీంతోపాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణత. ప్లంబర్ ట్రేడ్‌కు టెన్త్ పాస్/ఫెయిల్తోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. వయసు 1.ఖేత్రి కాంప్లెక్స్‌లోని పోస్టుల విషయంలో వయో పరిమితి, విద్యార్హతలకు 2016 జూలై 20వ తేదీని కటాఫ్ డేట్‌గా పరిగణిస్తారు. 2.ఘట్సిలా కాంప్లెక్స్‌లో పోస్టులకు కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 42 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. అర్హతల పరిశీలనకు 2016 ఆగస్టు 31ని కటాఫ్ డేట్‌గా పరిగణిస్తారు. 3.గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టులకు 2016 జూలై 1 నాటికి 18-25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. స్టైపెండ్ 1.ఘట్సిలా కాంప్లెక్స్‌లోని పోస్టులకు మొదటి ఏడాది రూ.4004; రెండో ఏడాది రూ.4576; మూడు, నాలుగో ఏడాది రూ.5148 ఉపకారవేతనం ఇస్తారు. ఖేత్రి కాంప్లెక్స్, గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టులకు నిబంధనల మేరకు స్టైపెండ్ ఇస్తారు. ఎంపిక విధానం 1.ఖేత్రి కాంప్లెక్స్‌లోని పోస్టులకు రాత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తే అందరినీ రాత పరీక్షకు ఎంపిక చేయరు. సాధారణ/సాంకేతిక విద్యలో పొందిన మార్కుల ఆధారంగా కొందరినే రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఎంపికైన అభ్యర్థుల ఫిజికల్ ఫిట్నెస్ను పరిశీలిస్తారు. 2.ఘట్సిలా కాపర్ కాంప్లెక్స్, గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టులకు కూడా రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. పరీక్ష తేదీలు 1.ఖేత్రి కాపర్ కాంప్లెక్స్‌లోని పోస్టులకు రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 11 2.ఘట్సిలా కాపర్ కాంప్లెక్స్‌లోని పోస్టులకు రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 25 3.గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టులకు రాత పరీక్ష తేదీని పేర్కొనలేదు. దరఖాస్తు విధానం 1.ఆయా ప్లాంట్లలోని పోస్టులకు నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తులకు సెల్ఫ్ అటెస్ట్ చేసిన అర్హతల ధృవీకరణ పత్రాల జిరాక్స్‌లను జత చేసి ఆయా సంస్థల అడ్రస్‌కు స్పీడ్ పోస్ట్/రిజిస్టర్ పోస్ట్‌లో పంపాలి. దరఖాస్తులకు చివరి తేదీలు 1. ఖేత్రి కాపర్ కాంప్లెక్స్‌లోని పోస్టులకు: ఆగస్టు 16. 2. ఘట్సిలా కాపర్ కాంప్లెక్స్‌లోని పోస్టులకు: సెప్టెంబర్ 10. 3. గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టులకు: ఆగస్టు 13. వెబ్సైట్: www.hindustancopper.com ......................... జిప్మర్లో 82 నర్సు పోస్టులు జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 92. వాటిలో సింహ భాగం (82 పోస్టులు) స్టాఫ్ నర్సులు కాగా మరో మూడు రకాల జాబ్‌లు (10 పోస్టులు) ఉన్నాయి. వాటిని కేటగిరీల వారీగా పరిశీలిస్తే.. వేతనం: అన్ని పోస్టులకూ రూ.9300-34,800 ప్లస్ గ్రేడ్ పే రూ.4,200. స్టాఫ్ నర్సు పోస్టులకు మాత్రం గ్రేడ్ పే రూ.400 అదనం. అంటే మొత్తం గ్రేడ్ పే రూ.4,600. విద్యార్హత: 1.స్టాఫ్ నర్సుకు జీఎన్ఎంలో డిగ్రీ/డిప్లొమా/తత్సమాన అర్హతతోపాటు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సు అండ్ మిడ్ వైఫ్‌గా రిజిస్టరై ఉండాలి. 2.ఎక్స్‌రే టెక్నీషియన్(ఆర్డీ)కి ఇంటర్/సైన్స్ సబ్జెక్టులతో తత్సమాన విద్యార్హత. దీంతోపాటు బీఎస్సీ(మెడికల్ రేడియేషన్ టెక్నాలజీ). రేడియో డయాగ్నోసిస్(ఆర్డీ) /రేడియోథెరపీలో రెండేళ్ల అనుభవం (లేదా) రేడియోలజీలో రెండేళ్ల డిప్లొమా/ తత్సమానంతోపాటు ఆర్డీ/రేడియోథెరపీలో మూడేళ్ల అనుభవం. 3.ఎక్స్‌రే టెక్నీషియన్(ఆర్టీ)కి ఇంటర్/సైన్స్ సబ్జెక్టులతో తత్సమాన విద్యార్హత. దీంతోపాటు బీఎస్సీ(ఆర్టీ: రేడియోథెరపీ)/బీఎస్సీ ఇన్ మెడికల్ టెక్నాలజీ(ఆర్టీ)/ బీఎస్సీ(మెడికల్ రేడియేషన్ టెక్నాలజీ)తోపాటు ఆర్టీలో రెండేళ్ల అనుభవం (లేదా) రేడియోథెరపీ టెక్నాలజీలో రెండేళ్ల పీజీ డిప్లొమా/డిప్లొమాతోపాటు ఆర్టీలో మూడేళ్ల అనుభవం. 4.ఫిజికల్ ఇన్‌స్ట్రక్టర్‌కు ఇంటర్‌తోపాటు బీపీఈడీ, రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: అన్ని పోస్టులకూ 2016 ఆగస్టు 16 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల వారికి నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష రుసుం: ఓసీ, ఓబీసీలు రూ.500; ఎస్సీ/ఎస్టీలు రూ.250 చెల్లించాలి. పీడబ్ల్యూడీలకు మినహాయింపు ఉంది. ఫీజును ‘ది డెరైక్టర్, జిప్మర్’ పేరిట పుదుచ్చేరి (ఎస్బీఐ జిప్మర్ బ్రాంచ్)లో చెల్లుబాటు అయ్యేలా డీడీ తీయాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలనుకునేవారు వేర్వేరు దరఖాస్తులు, డీడీలు పంపాలి. దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనా దరఖాస్తును పూర్తి చేసి, విద్యార్హత ధృవీకరణ పత్రాల జిరాక్స్‌లను జత చేసి, ‘ది డెరైక్టర్, జిప్మర్, పుదుచ్చెరి, 605006’ అడ్రస్‌కు పంపాలి. దరఖాస్తును పంపే కవర్‌పై ‘అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్....... (కోడ్ నంబర్.......)’ అని రాయాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 2016 ఆగస్టు 16. వెబ్సైట్: దరఖాస్తులకు, వివరాలకు http://jipmer.edu.in/category/jobs/ను చూడొచ్చు. -
‘ఈపీఎఫ్ఓ’లో 257 కొలువులు..
జాబ్ పాయింట్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు/అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. పోస్టుల సంఖ్య: మొత్తం 257. వీటిలో 21 పోస్టులను వికలాంగులకు కేటాయించారు. వేతన స్కేల్: రూ.9,300 నుంచి రూ.34,800 (గ్రేడ్ పే రూ. 4,600 అదనంగా చెల్లిస్తారు) వయోపరిమితి: 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయో సడలింపు ఉంటుంది. అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. లా, ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్/కంపెనీ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఇస్తారు. విధులు: వర్క్ ఎన్ఫోర్స్మెంట్, రికవరీ, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ క్యాష్, లీగల్ పెన్షన్, విచారణలు, నష్టపరిహారాల మదింపు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ తదితర విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. జమ్ముకశ్మీర్ తప్ప దేశంలోని ఏ ప్రాంతంలోనైనా పని చేయాలి. ప్రొబేషన్: రెండేళ్లు ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.. రాత పరీక్ష ఇలా: రెండు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్ష ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ల్లో ఉంటుంది. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు విధిస్తారు. జనరల్ ఇంగ్లిష్, భారత స్వాతంత్య్ర సంగ్రామం, సమకాలీన అంశాలు - అభివృద్ధి, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపుల్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లాస్, జనరల్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 23 దరఖాస్తు ప్రింట్‌ను సబ్మిట్ చేయడానికి చివరి తేదీ: జూన్ 24 వెబ్‌సైట్స్: www.upsc.gov.in, http://www.upsconline.nic.in -
ఇండియన్ నేవీ
జాబ్ పాయింట్ లా కేడర్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) ఇండియన్ నేవీలో లా కేడర్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) కోర్సు 2017, జనవరిలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శిక్షణ, ఎంపిక విధానం, వేతనం తదితర వివరాలు... అర్హతలు 55 శాతం మార్కులతో లా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 1990, జనవరి 2 - 1995, జనవరి 2 మధ్య జన్మించినఅవివాహితులు మాత్రమే అర్హులు. ప్రస్తుతం లా చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవడం కుదరదు. శారీరక ప్రమాణాలు పురుషులు కనీసం 157 సెం.మీ. ఎత్తు; మహిళలు కనీసం 152 సెం.మీ. ఎత్తు ఉండాలి. శిక్షణ ఎంపికైన అభ్యర్థులకు సబ్ లెఫ్టినెంట్ హోదా కల్పించి కేరళలోని నేవల్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. వేతనం సబ్ లెఫ్టినెంట్కు పే బ్యాండ్ 3/ రూ.15,600 - 39,100 స్కేల్‌తో 5,400 గ్రేడ్ పేతో వేతనం చెల్లిస్తారు. అదనంగా ఇన్స్ట్రక్షనల్, యూనిఫాం, హార్డ్ ఏరియా, ఇంటి అద్దె, రవాణా అలవెన్సులు కూడా ఉంటాయి. అన్ని కలుపుకొని సుమారు నెలకు రూ.74,100 వరకు పొందవచ్చు. గ్రూప్ ఇన్సూరెన్స్ అండ్ గ్రాట్యుటీ, ఇతర సదుపాయాలు ఉంటాయి. ఎంపిక లా డిగ్రీలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) షార్ట్‌లిస్ట్ చేస్తుంది. ఇందుకోసం కటాఫ్ మార్కులను నిర్ణయించే పూర్తి అధికారం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ)కి ఉంటుంది. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు 2016 జూన్- సెప్టెంబర్ మధ్య బెంగళూరు/ భోపాల్/ కోయంబత్తూర్/ విశాఖపట్నంలో ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూలను అయిదు రోజుల పాటు రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్ఫెక్షన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. ఈ దశలో అర్హత సాధించని అభ్యర్థులను అదే రోజున వెనక్కి పంపుతారు. రెండో స్టేజ్‌కు ఎంపికైన అభ్యర్థులకు సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ దశలను విజయవంతంగా పూర్తిచేసిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఖాళీల ఆధారంగా శిక్షణకు ఎంపికైన వారితో తుది జాబితా రూపొందిస్తారు. కోర్సుకు ఎంపికైన అభ్యర్థులు కేరళలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నేవల్ ఓరియెంటేషన్ కోర్సులో ట్రైనింగ్ పొందుతారు. తర్వాత శిక్షణలో భాగంగా వేర్వేరు నేవల్ ట్రైనింగ్ యూనిట్లలో ప్రొఫెషనల్ ట్రైనింగ్‌కు పంపిస్తారు. శిక్షణ ప్రారంభమైన నాటి నుంచి లేదా ప్రాథమిక శిక్షణ పూర్తయిన తర్వాతి నుంచి అభ్యర్థులు రెండేళ్లపాటు ప్రొబేషన్‌లో ఉంటారు. షార్ట్ సర్వీస్ కమిషన్ లా కేడర్‌లో ప్రవేశం పొందిన అభ్యర్థులకు మొదట పదేళ్ల సర్వీస్ మంజూరు చేస్తారు. తర్వాత అభ్యర్థుల ఆసక్తి, అవసరం, పనితీరు ఆధారంగా మరో నాలుగేళ్లు పొడిగించే అవకాశం ఉంటుంది. దరఖాస్తు దరఖాస్తుకు గడువు ముగిసింది. దరఖాస్తు ప్రింటవుట్‌కు ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ల నకలు పత్రాలను జతపరిచి పోస్ట్ బాక్స్ నంబర్ 4, చాణక్య పురి పోస్ట్, న్యూఢిల్లీ-110021 చిరునామాకు సాధారణ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. వెబ్సైట్: www.joinindiannavy.gov.in -
బీఎస్ఎన్ఎల్లో జేఏవో ఉద్యోగాలు
జాబ్ పాయింట్: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)లో 962 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (జేఏవో) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. రూ.16,400-రూ.40,500 వేతన స్కేలు, ఏటా 3 శాతం ఇంక్రిమెంట్, హెచ్ఆర్ఏ, మెడికల్ అలవెన్సు ఇలా ఆకర్షణీయ జీతభత్యాలకు నెలవైన జేఏవో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలు.. రెండేళ్ల విరామం తర్వాత ప్రకటన వెలువడింది. గతంలో పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉండేది. ఇప్పుడు దీన్ని ఆబ్జెక్టివ్ విధానంలోకి మార్చారు. ఖాళీల వివరాలు: కేటగిరీ ఉద్యోగాలు ఓసీ 389 ఓబీసీ 260 ఎస్సీ 195 ఎస్టీ 118 మొత్తం 962 ఆంధ్రప్రదేశ్ సర్కిల్: ఓసీ-46; ఓబీసీ-11; ఎస్సీ-22; ఎస్టీ-12. మొత్తం 91. అర్హతలు: చార్టర్డ్ అకౌంటెంట్/కంపెనీ సెక్రటరీ/కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్/మాస్టర్ ఆఫ్ కామర్స్. గుర్తింపు పొందిన సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుంచి 2014, డిసెంబర్ 31 నాటికి అర్హత సాధించి ఉండాలి. వయసు: 2015, జనవరి 1 నాటికి కనిష్ట వయసు 20 ఏళ్లు, గరిష్ట వయసు 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు సడలింపు ఉంటుంది. ఎంపిక: అఖిల భారత స్థాయిలో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే రాత పరీక్ష ద్వారా నియామకాలు జరుగుతాయి. రాత పరీక్షలో రెండు పేపర్లుంటాయి. పేపర్-1కు 150 మార్కులు, పేపర్-2కు 300 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు మూడు గంటలు కేటాయించారు. మెరిట్ జాబితాలో చోటుసంపాదించాలంటే సెక్షన్ వారీగా, మొత్తంమీద అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం: పేపర్ సబ్జెక్టు మార్కులు పేపర్-1 జనరల్ ఇంగ్లిష్ 100 జనరల్ ఆప్టిట్యూడ్/అవేర్నెస్ 50 పేపర్-2 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్/ కాస్ట్ అకౌంటింగ్/ట్యాక్స్ అండ్ కమర్షియల్ లాస్ 300 సిలబస్: జనరల్ ఇంగ్లిష్: కాంప్రెహెన్షన్, గ్రామర్, వొకాబ్యులరీ. జనరల్ ఆప్టిట్యూడ్: జాతీయ, అంతర్జాతీయ వర్తమాన వ్యవహారాలు; భారత రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ; జనరల్ మెంటల్ ఎబిలిటీ; రీజనింగ్, క్వాంటిటేటివ్ టెక్నిక్. ఫైనాన్షియల్, కమర్షియల్ అకౌంట్స్: అడ్వాన్స్డ్ అకౌంటింగ్, ఆడిటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ప్రభుత్వ రంగ సంస్థలు-ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆర్థిక చట్టాలు. ముఖ్య అంశాలు: ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబర్ 1, 2014- డిసెంబర్ 31, 2014. ఫీజు: ఓసీ, ఓబీసీ అభ్యర్థులు మాత్రమే రూ.వెయ్యి ఆన్లైన్లో చెల్లించాలి. సర్కిల్ వారీగా: అభ్యర్థులు ఏవైనా ఐదు సర్కిళ్లను ప్రాధాన్యత వారీగా ఎంపిక చేసుకోవచ్చు. మెరిట్, ఖాళీల వారీగా నియామకాలు ఉంటాయి. పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌లో సెంటర్ అందుబాటులో ఉంది. టీఏ: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ప్రయాణ భత్యానికి అర్హులు. రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 22, 2015. వెబ్సైట్: www.externalexam.bsnl.co.in ఉద్యోగానికి ఎంపికైన వారిని రెండేళ్ల పాటు ప్రొబేషన్‌లో ఉంచుతారు. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని శాశ్వత ఉద్యోగులుగా నియమించుకుంటారు. ప్రిపరేషన్: జనరల్ ఇంగ్లిష్‌లో మంచి మార్కులు సాధించేందుకు గ్రామర్‌లోని ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. ఇంగ్లిష్ పత్రికలు, ప్రామాణిక పుస్తకాల సహాయంతో వొకాబ్యులరీని మెరుగుపరుచుకోవాలి. రీజనింగ్ విభాగంలో సిరీస్, అనాలజీ; క్లాసిఫికేషన్; కోడింగ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, డెరైక్షన్స్ తదితర అంశాలను ప్రాక్టీస్ చేయాలి. క్వాంటిటేటివ్ టెక్నిక్కు సంబంధించి సూక్ష్మీకరణ, నిష్పత్తులు, శాతాలు, సరాసరి, అనుపాతం, క్లాక్స్, టైమ్ అండ్ వర్క్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. పీజీ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. అందువల్ల ఆ కోణంలో సిద్ధమవ్వాలి. నమూనా ప్రశ్నలు: The SAARC Culture Minister Conference was held in september 2014? a) Kathmandu b) New Delhi c) Male d) Islamabad Ans: b The phase of accounting that deals with collecting and controlling the costs of producing a given product or service is called a) internal auditing b) bookkeeping c) cost accounting d) general accounting Ans: c - కె.వి. జ్ఞానకుమార్, డెరైక్టర్, డీబీఎస్, హైదరాబాద్. ఇండియన్ నేవీ సెయిలర్స్ ఇండియన్ నేవీ.. అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి సీనియర్ సెకండరీ రిక్రూటర్స్ సెయిలర్స్ నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్‌లతో 10+2/తత్సమానం. నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి. వయసు: ఆగస్ట్ 1, 1994-జూలై 31, 1998 మధ్య జన్మించి ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నె స్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. రాత పరీక్షను ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. సమాధానాలను గుర్తించడానికి గంట సమయం కేటాయించారు. 10+2 స్థాయిలో ప్రశ్నల క్లిష్టత ఉంటుంది. ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిష్/హిందీ భాషల్లో రూపొందిస్తారు. సిలబస్‌ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్‌లో 1.6 కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తి చేయాలి. 20 సిట్ అప్స్, 10 పుష్ అప్స్ చేయాలి. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్ట్, 2015 నుంచి ఐఎన్ఎస్-చిల్కాలో 22 వారాలపాలు శిక్షణనిస్తారు. తర్వాత దేశంలోని వివిధ నేవల్ ఎస్టాబ్లిష్మెంట్లలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఆ దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 7, 2014. {పింట్ అవుట్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్ 14, 2014. వివరాలకు: http://nausenabharti.nic.in ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు ప్రింట్ అవుట్ పంపాల్సిన చిరునామా: పోస్ట్‌బాక్స్ నంబర్-488, గోలే డాక్ఖానా, జీపీవో, న్యూఢిల్లీ-110001. -
పదో తరగతితోనే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ).. పదో తరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది.. వివిధ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రూప్-సి కేటగిరీ కింద మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్) నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నేపథ్యంలో నియామక విధానం, ప్రిపరేషన్ ప్లాన్ తదితర అంశాలపై ఫోకస్.. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇందులో పేపర్-1, పేపర్-2 అనే రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 ఇలా: పేపర్-1ను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రశ్నలను ఇంగ్లిష్, హిందీ భాషల్లో రూపొందిస్తారు. కమిషన్ విచక్షణాధికారం మేరకు స్థానిక భాషలో కూడా ప్రశ్నలను ఇచ్చే అవకాశం ఉంది. ఈ పేపర్లో నాలుగు విభాగాలు ఉంటాయి. వీటిల్లో 150 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు కేటాయించారు. సమాధానాలను గుర్తించడానికి 2 గంటల సమయం ఉంటుంది. విభాగం ప్రశ్నలు మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ - రీజనింగ్ 25 25 న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25 25 జనరల్ ఇంగ్లిష్ 50 50 జనరల్ అవేర్నెస్ 50 50 మొత్తం 150 150 సంబంధిత విభాగాల్లోని ప్రాథమిక భావనలపై పట్టు సాధించడం ద్వారా ఈ పరీక్షలో సులభంగానే విజయాన్ని నమోదు చేసుకోవచ్చు. నెగిటివ్ మార్కింగ్ కూడా అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు (0.25) మార్కు కోత విధిస్తారు. విశ్లేషణకు పరీక్ష: జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం అభ్యర్థిలోని విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించింది. ఈ క్రమంలో రెండు గుర్తుల మధ్య ఉండే సంబంధాన్ని గుర్తించడం, సామాన్య గణిత సమస్యలు వంటి నాన్ వెర్బల్ ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో చిత్రాల వర్గీకరణ (ఫిగర్ క్లాసిఫికేషన్), సంబంధాలు (రిలేషన్ కాన్సెప్ట్స్), నిర్ణయాత్మక సామర్థ్యం (డెసిషన్ మేకింగ్, జడ్జ్మెంట్), భేదాలను గుర్తించడం (డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్), సమస్య సాధన, ఇచ్చిన సమస్యను విశ్లేషించడం, నంబర్ సిరీస్, నాన్-వెర్బల్ సిరీస్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అంతేకాకుండా అమూర్త చిత్రాలు-గుర్తులు-వాటి మధ్య సంబంధాల పట్ల అవగాహనను పరీక్షించే విధంగా కూడా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అడిగే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ సులభంగానే ఉంటాయి. కాబట్టి సంబంధిత అంశాలపై ప్రాథమిక అవగాహన ఉంటే వాటిని సులభంగానే సాధించవచ్చు. మిగతా అంశాల విషయానికొస్తే.. ఆయా అంశాలు అకడమిక్ పరంగా ఎక్కడా ఎదురు కావు. కేవలం మన విశ్లేషణ సామర్థ్యాన్ని ఉపయోగించి మాత్రమే సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువగా ఈ తరహా ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం మంచిది. మరో విషయం ప్రశ్నలు చూడగానే సులభంగానే అనిపిస్తాయి. కానీ కొంచెం క్లిష్టతతో కూడి ఉంటాయి. కాబట్టి సమాధానాన్ని గుర్తించే ముందు ఒకటికి రెండు సార్లు ప్రశ్నను చదవడం మంచిది. ప్రాథమిక పరిజ్ఞానం: ఇంగ్లిష్‌లో అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో ఇంగ్లిష్ భాషకు సంబంధించిన ప్రాథమిక భావనల ఆధారంగా అధిక శాతం ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో వొకాబ్యులరీ, వ్యాకరణం, వాక్య నిర్మాణం (సెంటెన్స్ స్ట్రక్చర్), సినానిమ్స్, యాంటో నిమ్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సాధారణంగా అభ్యర్థుల్లో ఇంగ్లిష్ అంటే కొంచెం క్లిష్టం అనే భావన నెలకొని ఉంటుంది. వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ భావన నుంచి త్వరగానే బయటపడొచ్చు. ఈ క్రమంలో వ్యాకరణ (గ్రామర్) విభాగంపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఇంగ్లిష్ ప్రిపరేషన్లో సగ భాగం వరకు ఈ అంశానికే కేటాయించడం మంచిది. వేగంగా చదవడం అలవర్చుకోవాలి. రీడింగ్ కాంప్రెహెన్షన్‌లో మెరుగైన మార్కులు సాధించేందుకు ఇది దోహద పడుతుంది. అంతేకాకుండా ప్రశ్నను ముందు చదివి.. తర్వాత పేరాగ్రాఫ్‌ను చదవడం చక్కని ఎత్తుగడ. తద్వారా పేరాగ్రాఫ్ చదువుతున్నప్పుడే సంబంధిత ప్రశ్నలకు కావల్సిన సమాధానాలపై ఒక స్పష్టత ఏర్పడుతుంది. దాంతో సమాధానాన్ని తేలిగ్గా గుర్తించవచ్చు. జనరల్ టిప్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ విభాగాల్లోని ప్రతి అంశం నుంచి కనీసం 30 ప్రశ్నలను సాధించాలి. మాదిరి/గత ప్రశ్నపత్రాలను సాధించేటప్పుడు ముందుగా సులభమైన వాటిని.. తర్వాత క్లిష్టమైన ప్రశ్నలను సాధించడానికి ప్రయత్నించాలి. మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ విషయంలో షార్ట్‌కట్ మెథడ్స్‌ను రూపొందించుకోవాలి. తద్వారా పరీక్షల్లో చాలా సమయం ఆదా అవుతుంది. పరీక్షలో ముందుగా జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లిష్ విభాగాలతో ప్రారంభించడం మంచిది. ఎందుకంటే ఈ రెండు విభాగాలకు కలిపి అత్యధిక వెయిటేజీ (100 మార్కులు) కేటాయించారు. గణిత సామర్థ్యం: న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అభ్యర్థిలోని గణిత సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగం. ఇందులో నంబర్ సిస్టమ్, దశాంశమానం, వివిధ భిన్నాలు, శాతాలు, నిష్పత్తులు, అనుపాతం, సగటు, లాభం-నష్టం, క్షేత్రమితి, కొలతలు, సరళ వడ్డీ, చక్ర వడ్డీ, కాలం-పని, కాలం-దూరం, వైశాల్యం, ఘనపరిమాణం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులో మెరుగైన స్కోర్‌కు తక్కువ సమయంలో ఎక్కువ సమస్యలను సాధించే విధంగా షార్ట్‌కట్ మెథడ్స్, కొండ గుర్తులను నేర్చుకోవాలి. సూత్రాల ఆధారంగా లెక్కలను సాధించడం అలవర్చుకోవాలి. ఈ విభాగంలో అడిగే ప్రశ్నలు తార్కికంగా, లోతుగా కాకుండా కనీస పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. కాబట్టి గణితంలో కీలకమైన గుణకారం, భాగహారం, కసాగు, గసాభా వంటి ప్రక్రియల్లో పట్టు సాధించాలి. పరీక్షలో సాధ్యమైనంత వరకు ఈ అంశాన్ని చివర్లో ప్రయత్నించడం మంచిది. ఎందుకంటే ఈ విభాగానికి తక్కువ వెయిటేజీ ఉంటుంది. నోటిఫికేషన్ సమాచారం ఎస్ఎస్సీ-మల్టీటాస్కింగ్ స్టాఫ్ పేబాండ్: రూ.5,200-రూ. 20,200+1,800(గ్రేడ్‌పే). అర్హత: మెట్రిక్యులేషన్/తత్సమానం. వయసు: 18-25 ఏళ్లు (జనవరి 1, 2014 నాటికి) పరీక్ష ఫీజు: రూ.100 (మహిళా, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్సీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు). దరఖాస్తు విధానం: ఆన్లైన్లో లేదా వెబ్సైట్ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:డిసెంబర్ 13, 2013 రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, గుంటూరు, తిరుపతి, కర్నూలు, విశాఖపట్నం, రాజమండ్రి. వివరాలకు: http://ssc.nic.in, sscsr.gov.in జనరల్ అవేర్నెస్: పరీక్షలో.. ముందుగా ఈ అంశం నుంచి పరీక్షను ప్రారంభించడం మంచిది. ఎందుకంటే ఇందులో ప్రశ్నలు తేలిగ్గా అనిపించడమేకాకుండా నేరుగా కూడా ఉంటాయి. అంతేకాకుండా సమాధానాన్ని గుర్తించడానికి తక్కువ సమయం సరిపోతుంది. మరో విషయం ఈ విభాగానికి అధిక వెయిటేజీ ఇచ్చారు. ఈ విభాగానికి సంబంధించి స్టాక్ జనరల్ నాలెడ్జ్ (జీకే), కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, క్రీడారంగం తదితర విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కరెంట్ అఫైర్స్ కోసం ప్రతి రోజూ వార్తా పత్రికలను చదువుతుండాలి. కీలకమైన సమాచారాన్ని నోట్స్ రూపంలో పొందుపరుచుకోవాలి. ఈ విభాగం చూడ్డానికి విస్తృతంగా ఉన్నప్పటికీ.. సీబీఎస్ఈ ఆరు నుంచి పదో తరగతి వరకు సైన్స్, సోషల్ పుస్తకాలను చదవడం లాభిస్తుంది. ముఖ్యంగా అందులోని శాస్త్ర పరిశోధన సంస్థలు, ప్రముఖ శాస్త్రవేత్తలు, వివిధ శాస్త్రసాంకేతిక కార్యక్రమాలు-వాటి పురోగతి, ఎకానమీకి సంబంధించి జీడీపీ, ఫిస్కల్ పాలసీస్ వంటి అంశాలపై అధికంగా దృష్టి సారించాలి. ఈ విభాగంలో చక్కని స్కోర్ చేయాలంటే దృష్టి సారించాల్సిన అంశాలు: దేశాలు- రాజధానులు- కరెన్సీ-భాషలు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సంస్థలు, జాతీయ పార్కులు, అబ్రివేషన్స్, అంతరిక్ష పరిశోధనలు, భారత రక్షణ వ్యవస్థ, సమాచార రంగం, రవాణా వ్యవస్థ, భారతదేశం- రాజ్యాంగం, భారతదేశ చరిత్ర- ముఖ్యాంశాలు, ఇండియన్ నేషనల్ మూమెంట్, జనరల్ సైన్స్, వివిధ పరిశోధనలు- శాస్త్రవేత్తలు, శాస్త్రీయ పరికరాలు, దేశాలు పూర్వపు పేర్లు-మారు పేర్లు, సరిహద్దు రేఖలు, అవార్డులు, క్రీడలు, విశ్వం- పుట్టుక, తొలి వ్యక్తులు, బిరుదులు, నాట్యాలు- నృత్యాలు, ప్రముఖ రచయితలు- రచనలు, నదీ తీర నగరాలు, జాతీయ చిహ్నాలు, వివిధ సంస్థలు- నెలకొల్పిన ప్రదేశాలు, ప్రముఖుల నినాదాలు మొదలైనవి. సమానంగా వస్తే పేపర్-1లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను పేపర్-2 కోసం షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి మాత్రమే పేపర్-2కు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు. చివరగా పేపర్-1, 2లలో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకం ఖరారు చేస్తారు. పరీక్షలో ఇద్దరు అభ్యర్థులకు మార్కులు సమానంగా వస్తే కింది పేర్కొన్న ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుని నియామయం ఖరారు చేస్తారు. అవి.. ఆబ్జెక్టివ్ పేపర్లో పార్ట్-3లో వచ్చిన మార్కులు ఆబ్జెక్టివ్ పేపర్లో పార్ట్-2లో వచ్చిన మార్కులు పుట్టిన తేదీ పేరులోని ఆంగ్ల అక్షర క్రమం (ఆల్ఫాబెటికల్ ఆర్డర్) డిస్క్రిప్టివ్‌గా: పేపర్-2 డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది. అభ్యర్థిలోని భాషా సామర్థ్యాలను పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో భాగంగా వ్యాసం (షార్ట్ ఎస్సే) లేదా లెటర్ రైటింగ్ అంశాలపై ప్రశ్న ఉంటుంది. ఇందులో సమకాలీన అంశాలు లేదా వ్యక్తిగత నేపథ్యం ఆధారంగా ప్రశ్నలు అడగొచ్చు. ఈ విభాగాన్ని అభ్యర్థుల ఆసక్తిని బట్టి వారి స్థానిక భాషలోనూ సమాధానాలు రాయొచ్చు. ఈ విభాగానికి 50 మార్కులు కేటాయించారు. సమాధానాల కోసం 30 నిమిషాల సమయం ఉంటుంది. ఈ విభాగాన్ని కేవలం అర్హత పరీక్షగా మాత్రమే పరీక్షిస్తారు. రిఫరెన్స్ బుక్స్ ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్-ఎస్.చాంద్ పబ్లికేషన్స్ మల్టీస్టాఫ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్- అర్హింత్ పబ్లికేషన్స్ మోడ్రన్ అప్రోచ్ టు వెర్బల్-నాన్ వెర్బల్ రీజనింగ్-ఆర్ఎస్ అగర్వాల్ ఇండియా ఇయర్ బుక్ -
స్పెషలిస్ట్ ఆఫీసర్ల ప్రిపరేషన్ ఇలా
కిరణ్ కుమార్ అడుసుమిల్లి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్యాంక్ కార్యకలాపాలు ఒకప్పటి మాదిరిగా కేవలం బ్యాంకింగ్ సేవలకే పరిమితం కావడం లేదు.. బ్యాంకులు మారుతున్న అవసరాలకనుగుణంగా సేవలను విస్తృతం చేస్తున్నాయి.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి.. దీంతో సంబంధిత వ్యవహారాలను నిర్వహించడానికి ప్రత్యేక నిపుణుల అవసరం ఏర్పడుతోంది.. ఈ నేపథ్యంలోనే ఐబీపీఎస్.. స్పెషలిస్ట్ ఆఫీసర్ల నియామకం కోసం క్రమం తప్పకుండా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.. ఇదే కోవలో తాజాగా ఐబీపీఎస్-స్పెషలిస్ట్ ఆఫీసర్ల నియామకం కోసం నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలపై ఫోకస్.. బ్యాంకుల్లో క్లరికల్, ఆఫీసర్ స్థాయి ఉద్యోగులు ఫ్రంట్ లైన్ సేవలను అందిస్తుంటారు. కొన్ని ప్రత్యేక సేవలను అందించడానికి నైపుణ్యం ఉన్న అభ్యర్థులు కావాలి. తాజా నోటిఫికేషన్ ద్వారా 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర బ్యాంకింగ్/ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లలో.. 10 రకాల స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటి వివరాలు.. ఐటీ ఆఫీసర్(స్కేల్-1); అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1); రాజభాష అధికారి (స్కేల్-1); లా ఆఫీసర్ (స్కేల్-1); హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1); మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్-1); ఐటీ ఆఫీసర్ (స్కేల్-2); లా ఆఫీసర్ (స్కేల్-2); చార్టెడ్ అకౌంటెంట్ (స్కేల్-2); మేనేజర్ క్రెడిట్ /ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ (స్కేల్-2) ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ దశల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాతి దశ ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఇందులో రాత పరీక్షకు 80 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయించారు (20 శాతం వెయిటేజీ). ఇందులో కనీసం 40 శాతం అర్హత మార్కులను (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఓబీసీ అభ్యర్థులకు 35 శాతం) సాధించాలి. రాత పరీక్ష ఇలా: రాత పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో ప్రశ్నలు ఇంగ్లిష్/హిందీ భాషల్లో ఉంటాయి. వివరాలు.. లా ఆఫీసర్ (స్కేల్-1,2), రాజభాష అధికారి (స్కేల్-1) విభాగం {పశ్నలు మార్కులు రీజనింగ్ 50 50 ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 25 జనరల్ అవేర్నెస్ (రిఫరెన్స్ టు బ్యాంకింగ్) 50 50 ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 75 మొత్తం 200 200 సమయం 120 నిమిషాలు (రెండు గంటలు) మిగతా పోస్టులకు: రీజనింగ్ 50 50 ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 25 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50 ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 75 మొత్తం 200 200 సమయం 120 నిమిషాలు (రెండు గంటలు) నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు (0.25) కోత విధిస్తారు. నోటిఫికేషన్ సమాచారం: అర్హత: సంబంధిత/అనుబంధ విభాగంలో డిగ్రీ/పీజీ. నిర్దేశించిన పోస్టులకు అనుభవం తప్పనిసరి. వయసు: 20-30 ఏళ్లు (స్కేల్-2 కేటగిరీకి మాత్రం 20-35 ఏళ్లు). దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 14, 2013. దరఖాస్తు ఫీజు: రూ. 600 (ఎస్సీ/ఎస్టీ/పీడ బ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100) దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: డిసెంబర్ 16, 2013 (ఆన్లైన్లో మాత్రమే) రాత పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 8-9, 2014. వివరాలకు: www.ibps.in వివిధ పన్నులకు సంబంధించిన వ్యవహారాలను సక్రమంగా నిర్వహించడానికి చార్టెడ్ అకౌంటెంట్ సేవలు అవసరం. పలు వ్యవసాయ పనులకు సంబంధించిన సలహాలు ఇవ్వడానికి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు. న్యాయ సంబంధ విషయాల్లో, రుణాలకు సంబంధించి డాక్యుమెంట్స్‌ను నిర్ధారించడానికి లా ఆఫీసర్లు ఉపయోగపడతారు. నిర్వహణలో ఐటీ/సాఫ్ట్వేర్ వినియోగం కోసం ఐటీ ఆఫీసర్ల సేవలను వినియోగించుకుంటారు. హిందీ భాష అభివృద్ధి-వినియోగంతోపాటు సిబ్బందిని ఆ దిశగా ప్రేరేపించడా నికి రాజభాష అధికారిని నియమిస్తారు. కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి మార్కెటింగ్ ఆఫీసర్ల సేవలు అవసరం. కెరీర్-వేతనాలు: స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలు సాధారణంగా జూనియర్, మిడిల్, సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉంటాయి. తాజా నోటిఫికేషన్ ద్వారా జూనియర్, మిడిల్ మేనేజ్మెంట్ కేడర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సాధారణ బ్యాంక్ శాఖలలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు ఉండరు. వ్యవసాయ సంబంధ ప్రత్యేక శాఖలలో అగ్రికల్చర్ ఆఫీసర్లు, పెద్ద బ్రాంచ్‌లలో మార్కెటింగ్ ఆఫీసర్లు ఉంటారు. మిగిలిన పోస్టులు సాధారణంగా రీజనల్, జోనల్ ఆఫీస్, హెడ్ ఆఫీస్‌లకు మాత్రమే పరిమితం. స్పెషలిస్ట్ ఆఫీసర్ల పదోన్నతులు కూడా ఆ కేడర్ ఆఫీసర్ల మధ్యనే ఉంటాయి. పోటీ తక్కువగా ఉన్న కారణంగా టైమ్ బౌండ్ ప్రమోషన్లు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ ప్రమోషన్లు స్పెషలిస్ట్ కేడర్‌కు మాత్రమే పరిమితం. కొన్ని బ్యాంకులు స్పెషలిస్ట్ ఆఫీసర్లను జనరల్ కేడర్‌కు మారే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇలా కేటగిరీ మారిన వారు అత్యున్నత స్థాయి హోదాకు కూడా చేరుకోవచ్చు. స్పెషలిస్ట్ ఆఫీసర్ల జీతాభత్యాలు ఇతర ఆఫీసర్లతో సమానంగా ఉంటాయి. స్కేల్-1 ఆఫీసర్లకు రూ. 25 వేల వరకు, స్కేల్-2 ఆఫీసర్లకు రూ. 30 వేల వరకు వేత నం అందుతుంది. నవంబర్, 2012 నుంచి వేతన ఒప్పందం సవరణ జరగాల్సి ఉంది. ఇప్పుడే చేరే అభ్యర్థులకు ఇది వర్తిస్తుంది. కాబట్టి భవిష్యత్‌లో ఎరియర్స్‌తో సహా పెరిగిన వేతనాలను అందుకుంటారు. సన్నద్ధం ఇలా... రీజనింగ్:బ్యాంకుల్లో నియామకం కోసం నిర్వహించే పరీక్షల్లో అత్యంత క్లిష్టమైన విభాగం రీజనింగ్. అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని అంచనా వేసేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో ప్రశ్నలను సాధించాలంటే విశ్లేషణ సామర్థ్యంతోపాటు తార్కికత (లాజిక్) కూడా అవసరం. అంతేకాకుండా స్వల్ప సమయంలోనే సమాధానాన్ని గుర్తించాలి. ఇందులో సిరీస్; అనాలజీ; క్లాసిఫికేషన్; కోడింగ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; రక్త సంబంధాలు; సీటింగ్ అరేంజ్మెంట్స్; ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, పజిల్స్ తదితర అంశాలుంటాయి. ఇందులో మెరుగైన స్కోర్ సాధించాలంటే షార్ట్‌కట్ మెథడ్స్, కొండ గుర్తులను సాధన చేయాలి. ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యతనివ్వాలి. చిత్రాలు, మిర్రర్ ఇమేజ్‌లతో కూడిన ప్రశ్నలను అధికంగా ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్: ఇంగ్లిష్‌లో గ్రామర్, రీడింగ్ కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, రూట్‌వర్డ్స్‌ను బాగా సాధన చేయాలి. జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటివాటిల్లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అందువల్ల అభ్యర్థులు వీటిపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాల సహాయంతో వొకాబ్యులరీని డెవలప్ చేసుకోవాలి. రోజుకు 10-15 వరకు యాంటోనిమ్స్, సినానిమ్స్ నేర్చుకోవాలి. ప్రాథమిక గ్రామర్ అంశాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్; యాక్టివ్, పాసివ్ వాయిస్; డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్ తదితర అంశాలను సాధన చేయాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: అభ్యర్థుల్లోని గణిత సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో చాలా వరకు ప్రశ్నలు నేరుగా లేదా సూత్రాల ఆధారితంగా ఉంటాయి. కాబట్టి గణిత నేపథ్యం లేని విద్యార్థులు కూడా ప్రాథమిక భావనలపై పట్టు సాధిస్తే ఈ విభాగంలో మెరుగైన స్కోర్ సాధించవచ్చు. వర్గమూలాలు, ఘన మూలాలు, శాతాలు, కాలం-పని; కాలం-దూరం, లాభం-నష్టం, నిష్పత్తులకు సంబంధించిన సమస్యల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. వీటికి తేలిగ్గా సమాధానాలు గుర్తించాలంటే గణిత మూలస్తంభాలైన కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలపై పట్టు సాధించాలి. దాంతోపాటు 20 వరకు టేబుల్స్, 25 వరకు స్క్వేర్స్, 15 వరకు క్యూబ్స్‌ను నేర్చుకోవాలి. జనరల్ అవేర్నెస్ (రిఫరెన్స్ టు బ్యాంకింగ్): ఈ విభాగానికి సంబంధించి బ్యాంకింగ్ రంగంలో తాజాగా చోటు చేసుకుంటున్న మార్పులు, చేర్పులపై ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో ఆర్బీఐ-విధాన నిర్ణయాలు, బ్యాంకింగ్ రంగంలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం (నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్), వివిధ బ్యాంకులు/ఆర్థిక సంస్థల ఉన్నతాధికారుల వివరాలు, బ్యాంకింగ్/ ఆర్థిక రంగంలో ఉపయోగించే పదజాలం (ఎన్పీఏ, ఎన్ఈఎఫ్టీ వంటివి), ద్రవ్య సాధనాలు (చెక్స్, ఏటీఎం కార్డు తదితర), భారత ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల నుంచి అధిక శాతం ప్రశ్నలు రావచ్చు. ఈ విభాగంలో మెరుగైన స్కోర్ కోసం ప్రతిరోజూ ఫైనాన్షియల్ డైలీ/మ్యాగజైన్స్ చదవాలి. స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ అంశాలపై కూడా దృష్టి సారించాలి. స్టాండర్డ్ జీకేకు సంబంధించి వివిధ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షుల పేర్లు; కరెన్సీలు; ఆస్కార్లతో పాటు వివిధ అవార్డుల విజేతల గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు ముఖ్యమైన సంఘటనలను తెలుసుకోవాలి. ప్రొఫెషనల్ నాలెడ్జ్: ఈ విభాగంలో ఆయా పోస్టులకు అర్హతగా పేర్కొన్న డిగ్రీ/పీజీ కోర్సుల సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణకు ఐటీ ఆఫీసర్ పోస్టును పరిగణనలోకి తీసుకుంటే.. నెట్ వర్కింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్, నెట్వర్క్ సెక్యూరిటీ, వెబ్ టెక్నాలజీస్, ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, బేసిక్ హార్డ్‌వేర్ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. లా ఆఫీసర్ పోస్టును తీసుకుంటే.. బ్యాంకింగ్/ఆర్థిక రంగంతో ముడిపడి ఉన్న చట్టాలపై అధికంగా ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో మెరుగైన స్కోర్ కోసం స్టాండర్డ పబ్లికేషన్స్ ప్రచురణలు లేదా ఆయా పోస్టుల వారీగా అకడమిక్ పుస్తకాలను చదివితే సరిపోతుంది. ప్రిపరేషన్: పరీక్షలో అన్ని ప్రశ్నలను ప్రయత్నించడం కంటే కచ్చితంగా సరైనవి అనే నమ్మకం ఉన్న 80 శాతం ప్రశ్నలను సాధించడం ఉత్తమం. జీకే, బ్యాంకింగ్, ఇంగ్లిష్ విభాగాలు సబ్జెక్ట్ ఆధారంగా ఉంటాయి. ఇందులోని ప్రశ్నలను సాధించడానికి ఎటువంటి తార్కికత అవసరం లేదు. 10 నిమిషాల్లో 80 శాతం మార్కులకు సరిపడ ప్రశ్నలను సాధించవచ్చు. కాబట్టి వీటిని స్కోరింగ్ బూస్టర్స్‌గా వినియోగించుకోవాలి. ప్రొఫెషనల్ నాలెడ్జ్‌ను మినహాయిస్తే.. ఈ పరీక్ష పీఓ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి పీఓకు ప్రిపేరైన వారు ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద దృష్టి సారించడం మంచిది. తొలిసారి ప్రిపేరవుతున్న అభ్యర్థులు ఉన్న వ్యవధిలో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లిష్ అంశాలను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. లా, అగ్రికల్చర్ అభ్యర్థులు రీజనింగ్, క్వాంటిటేటివ్ విభాగాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. కనీసం 140, అంతకంటే ఎక్కువ మార్కులు సాధిస్తేనే పోటీలో ఉంటారు. కాబట్టి ఆ దిశగా ప్రిపరేషన్ సాగించాలి. రిఫరెన్స బుక్స్: వెర్బల్-నాన్ వెర్బల్ రీజనింగ్- ఆర్.ఎస్.అగర్వాల్ క్వికర్ మ్యాథ్స్-ఎం.థైరా క్యాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-అరుణ్ శర్మ ఇంగ్లిష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్-హరిమోహన్ ప్రసాద్ ప్రతియోగితా దర్పణ్ మనోరమ ఇయర్ బుక్ కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ కాన్సెప్టుల అధ్యయనంతో Hard work with smart mind.. ఇది ఐబీపీఎస్ స్పెషలిస్టు ఆఫీసర్ రిక్రూట్మెంట్లో విజయానికి దగ్గర చేస్తుంది. రోజుకు ఎన్ని గంటలు చదివామనే దాని కంటే సమయాన్ని సద్వినియోగం చేసుకొని, సమర్థవంతంగా చదివామన్నదే ముఖ్యం. ఏ స్పెషలిస్టు ఆఫీసర్‌కు సంబంధించిన పరీక్ష రాస్తున్న వారైనా ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగంలో ఎక్కువ స్కోర్ సాధించాలంటే సంబంధిత సబ్జెక్టులోని ప్రాథమిక అంశాలకు సంబంధించిన కాన్సెప్టులను తప్పకుండా అధ్యయనం చేయాలి. ఆయా సబ్జెక్టు పరిజ్ఞానాన్ని, బ్యాంకింగ్ రంగానికి అన్వయించుకుంటూ చదవాలి. ఇంటర్వ్యూలో కూడా ఈ అంశాలపైనే ఫోకస్ చేస్తారు. ఈ విభాగంలో ప్రిపరేషన్‌కు ఇంటర్నెట్ను బాగా ఉపయోగించుకోవాలి. చాలా మంది ప్రిపరేషన్‌ను బిట్స్‌కు మాత్రమే పరిమితం చేస్తారు. ఇది మంచిది కాదు. రీజనింగ్ విభాగంలో గ్రూప్ రీజనింగ్ (సీటింగ్ అరేంజ్మెంట్, ర్యాంకింగ్..) పై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి వాటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్ వొకాబ్యులరీపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. అరిహంత్ కంప్యూటర్ అవేర్నెస్, బ్యాంకింగ్- అరిహంత్, బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్, ఆర్.ఎస్.అగర్వాల్ (ఆర్థమెటిక్, రీజనింగ్) వంటి పుస్తకాలు ప్రిపరేషన్‌కు ఉపయోగపడతాయి. -బి.రాజేష్,స్పెషలిస్టు ఆఫీసర్,యూబీఐ. -
పునశ్చరణతోనే విజయానికి బాటలు..
డా॥తమ్మా కోటిరెడ్డి,ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్. యూపీఎస్సీ.. ఇండియన్ ఎకనమిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామ్ (ఐఈఎస్/ఐఎస్ఎస్)కు నోటిఫికేష్ విడుదల చేసింది. ఐఈఎస్/ఐఎస్ఎస్ ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ అనే దశల్లో 1200 మార్కులకు జరుగుతుంది. రాత పరీక్ష మొత్తం 1000 మార్కులకు ఉంటుంది. దీన్ని ఆరు పేపర్లుగా నిర్వహిస్తారు. ఇందులో జనరల్ స్టడీస్, జనరల్ ఇంగ్లిష్ పేపర్లు మాత్రమే ఐఈఎస్, ఐఎస్ఎస్ రెండు సర్వీసులకు ఉమ్మడిగా ఉంటాయి. మిగిలినవి సబ్జెక్ట్ పేపర్లు. వీటిని ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌లలో వేర్వేరుగా నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్ట్‌కు నాలుగు పేపర్లు ఉంటాయి. రాత పరీక్ష పూర్తిగా కన్వెషనల్ (ఎస్సే) రూపంలో ఉంటుంది. సమాధానాలను పూర్తిగా ఇంగ్లిష్‌లోనే రాయాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. దీనికి 200 మార్కులు కేటాయించారు. జనరల్ ఇంగ్లిష్ ఈ విభాగంలో ప్రశ్నల క్లిష్టత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఇందులో ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. మిగిలిన ప్రశ్నలు మాత్రం అభ్యర్థుల ఇంగ్లిష్ భాష పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. ప్రెసిస్ పేరాగ్రాఫ్ ప్రశ్నలు కూడా ఇస్తారు. ఈ విభాగంలో ఇంగ్లిష్‌లో కేవలం భావ వ్యక్తీకరణే కాకుండా వాక్య నిర్మాణ శైలిని పరిశీలిస్తారు. కాబట్టి వొకాబ్యులరీని, రీడింగ్ కాంప్రహెన్షన్ టెక్నిక్స్‌ను పెంచుకోవాలి. జనరల్ స్టడీస్ ఈ విభాగంలో ప్రశ్నల క్లిష్టత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఇందులో మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు (కరెంట్ ఈవెంట్స్), జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ క్రమంలో శాస్త్రసాంకేతిక రంగం, భారత రాజ్యాంగం, భారతదేశ చరిత్ర, జాగ్రఫి నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో రాణించాలంటే ఇటీవలి పరిణామాల (ద్వైపాక్షిక ఒప్పందాలు, అంతర్జాతీయ సదస్సులు, తాజా రాజకీయ పరిణామాలు తదితర) పై పట్టు పెంచుకోవాలి. హిస్టరీలో స్వాతంత్య్రోద్యమం, ఆధునిక భారతదేశ చరిత్ర, జాగ్రఫీలో భారత భౌతిక భౌగోళిక అంశాలపై దృష్టి పెట్టాలి. జాగ్రఫీలో ఎకానమీతో ముడిపడి ఉండే అంశాలు (ఖనిజాలు, మైనింగ్, పరిశ్రమలు)కూడా ప్రధానమే. ఎకానమీలో..వివిధ ఆర్థిక వ్యవస్థలు, , తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. పరీక్షా విధానం ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ పేపర్ సబ్జెక్ట్ మార్కులు పేపర్-1 జనరల్ ఇంగ్లిష్ 100 పేపర్-2 జనరల్ స్టడీస్ 100 పేపర్-3 జనరల్‌ఎకనామిక్స్-1 200 పేపర్-4 జనరల్ ఎకనామిక్స్-2 200 పేపర్-5 జనరల్ ఎకనామిక్స్-3 200 పేపర్-6 ఇండియన్ ఎకనామిక్స్ 200 మొత్తం మార్కులు 1,000 (ప్రతి పేపర్‌కు: సమయం 3 గంటలు) జనరల్ ఎకనామిక్స్ -1 ఈ విభాగంలోని సిలబస్‌ను పరిశీలిస్తే.. సూక్ష్మ ఆర్థ శాస్త్రంతోపాటు మ్యాథమెటికల్, ఎననోమెట్రిక్స్ పద్ధతులకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. ఇందులో పార్ట్-ఎ, పార్ట్-బి అనే రెండు ఉప విభాగాలు ఉంటాయి. పార్ట్-ఎలో రాణించాలంటే.. సూక్ష్మ ఆర్థ శాస్త్రంలోని ఉత్పత్తి, పంపిణీ అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఇందుల్లోంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. పార్ట్-బికి సంబంధించి లీనియర్ ప్రోగ్రామింగ్, సహ సంబంధం, టైమ్ సిరీస్, శాంప్లింగ్ వంటి పద్ధతులపై అవగాహన అవసరం. రిఫరెన్స్ బుక్స్ ఎకనామిక్స్-పాల్ ఎ. శామ్యూల్సన్ (19వ ఎడిషన్) మ్యాథమెటికల్ అనాలిసిస్ ఫర్ ఎకనామిక్స్-ఆర్.జి.డి. అలెన్, మ్యాక్మిలాన్ స్టాటిస్టిక్స్ ఫర్ బిజినెస్ అండ్ ఎకనామిక్స్-అండర్సన్ అండ్ షెన్నీ స్టాటిస్టిక్స్ ఫర్ మ్యాథమెటిక్స్-డి.ఆర్. అగర్వాల్ జనరల్ ఎకనామిక్స్-2 ఈ పేపర్‌కు సంబంధించిన సిలబస్‌ను పరిశీలిస్తే.. స్థూల ఆర్థశాస్త్రానికి సంబంధించిన అంశాలు, వృద్ధి సిద్ధాంతాలు, అంతర్జాతీయ అర్ధ శాస్త్రం, స్కూల్ ఆఫ్ థాట్స్ (ఛిజిౌౌట ౌజ ఖీజిౌఠజజ్టి) అంశాలకు చోటు కల్పించారు. ఇందులో రాణించాలంటే సమగ్రంగా సిలబస్‌ను అధ్యయనం చేయాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి తదితర అంశాలను పూర్తిగా చదవాలి. ఉద్యోగితా సిద్ధాంతాలపై డిగ్రీ స్థాయి పుస్తకాలను చదవడం ద్వారా కొంత మేరకు అవగాహన ఏర్పడుతుంది. రిఫరెన్స్ బుక్స్ ఎకనమిక్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ బిజినెస్-ఎం.ఎల్. జింగాన్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ - చేరునిలమ్ మాక్రో ఎకనామిక్స్-ఎన్. గ్రెగరీ, మాన్కివ్ (6వ ఎడిషన్) గ్రోత్, సస్టెయినబులిటీ అండ్ ఇండియాస్ ఎకనమిక్ రిఫామ్స్-టి.ఎన్. శ్రీనివాసన్ జనరల్ ఎకనామిక్స్-3 ఈ పేపర్లో రాణించాలంటే పబ్లిక్ ఫైనాన్స్, పర్యావరణ అర్ధ శాస్త్రం, ఇండస్ట్రియల్ ఎకనమిక్స్, మార్కెట్ ప్రణాళికకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ప్రభుత్వ విత్తంలో పన్నుల సంస్కరణలు-వ్యయ సిద్ధాంతాలు, ప్రభుత్వ రుణ యాజమాన్యం వంటి అంశాలపై ప్రశ్నలు అడగవచ్చు. పర్యావరణ అర్థ శాస్త్రంలో సుస్థిర వృద్ధి, గ్రీన్ జీడీపీ, సాంప్రదాయ, సాంప్రదాయేతర ఇంధన వనరులు, అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు వంటి అంశాలను ప్రిపేర్ కావాలి. ఇండస్ట్రియల్ ఎకనామిక్స్‌లో వివిధ మార్కెట్లలో ధరల సిద్ధాంతాలు, సూక్ష్మ స్థాయి పెట్టుబడి విధానాలు,Preventing Pricing, మార్కెట్ కేంద్రీకరణ వంటి అంశాలపై ప్రశ్నలు రావచ్చు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక రచన, విచక్షణాత్మ-కేంద్రీకృత ప్రణాళికా సంబంధిత లాభనష్టాలను పరిశీలించాలి. రిఫరెన్స్ బుక్స్ హ్యాండ్ బుక్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్- గుర్గెన్, రిచర్డ్, స్ప్రింగర్ ఎకనమిక్స్ ఆఫ్ డవలప్మెంట్ అండ్ ప్లానింగ్-ఎం.ఎల్.జింగాన్ హ్యాండ్ బుక్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ ఇన్ ఇండియా-విక్రమ్ దయాళ్, కంచన్ చోప్రా ఇండస్ట్రియల్ ఎకనామిక్స్-ఆర్.ఆర్.భరత్వాల్ పబ్లిక్ ఫైనాన్స్-హెచ్.ఎల్.భాటియా ఇండియన్ ఎకనమిక్స్ ఈ పేపర్‌కు సంబంధించి వివిధ పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి అభ్యర్థులకు ఈ విభాగం పట్ల ఒక అవగాహన ఉంటుంది. ఈ నేపథ్యంలో ్రప్రిపరేషన్ స్థాయిని కొంత పెంచుకుంటే ఇందులో రాణించవచ్చు. ఈ క్రమంలో వివిధ రంగాల్లో ప్రవేశ పెట్టిన సంస్కరణలు, ప్రత్యామ్నాయ అభివృద్ధి వ్యూహాలు, పేదరికం, నిరుద్యోగం, మానవాభివృద్ధి, ద్రవ్యోల్బణం, విదేశీ వాణిజ్యం, ద్రవ్యం-బ్యాంకింగ్, బడ్జెటింగ్-కోశ విధానం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వ్యూహాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. రిఫరెన్స్ బుక్స్:ఇంటర్నేషనల్ బిజినెస్-రాకేష్ మోహన్, జోషి ఇండియన్ ఎకనామీ-మిశ్రా అండ్ పూరీ హ్యూమన్ డవలప్మెంట్ రిపోర్ట్-యూఎన్డీపీ వరల్డ్ డవలప్మెంట్ రిపోర్ట్-ఐబీఆర్డీ ఇండియన్ ఎకనామీ-ఉమా కపిల సిలబస్‌పై అవగాహన కీలకం ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్ ఔత్సాహికలు ముందుగా సిలబస్‌పై సంపూర్ణ అవగాహన పొందాలి. కారణం.. పరీక్ష ఒకే రోజు రెండు పేపర్లు చొప్పున జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు ఏ పేపర్లో ఏ సిలబస్ ఉందో అవగాహన లేక చివరి నిమిషంలో ఆందోళనకు, ఒత్తిడికి గురవుతారు. దీనికి పరిష్కారం సిలబస్‌పై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవడమే. ప్రిపరేషన్ పరంగా.. గత ప్రశ్న పత్రాలను విశ్లేషించడం మేలు చేస్తుంది. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం.. సిలబస్‌లోని అన్ని అంశాలను చదవాలనే తపనకంటే.. తమకు పట్టున్న అంశాలనే వీలైనంత ఎక్కువసార్లు పునశ్చరణ చేసుకోవడం ఉపయుక్తం. ఇప్పటివరకు ఐఎస్ఎస్ ఫలితాలను విశ్లేషిస్తే.. మొత్తం మార్కుల్లో 50 శాతం మార్కులు పొందితే సర్వీస్‌కు ఎంపికయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి 200 పేపర్లకు జరిగే పరీక్షలో కనీసం 100 నుంచి 120 మధ్యలో మార్కులు సాధించేలా ప్రిపరేషన్ సాగించాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ సాగిస్తూనే స్టాటిస్టిక్స్‌లోని ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవల్ వరకు అంశాలను చదవాలి. ఇందుకోసం Fundamentals of Applied Statistics, Fundamentals of Mathematics and Mathematical Statistics S.C.Gupta, V.K.Kapoor, Statistical Methods S.P. Gupta బుక్స్ చదవడం ఉపకరిస్తుంది. ఇంగ్లిష్‌లో ఎక్కువగా ప్యాసేజ్ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. వీటిలో పట్టు సాధిస్తే ఈ పేపర్లో 60 శాతం మార్కులు పొందినట్లే. అదే విధంగా జనరల్ స్టడీస్‌కు సంబంధించి.. సివిల్స్ స్థాయిలో కాకున్నా.. అంతకు కొద్దిగా తక్కువ స్థాయిలో అదే సిలబస్‌ను అనుసరించి చదవాలి. ప్రశ్నలు 2 మార్కులకు, 3 మార్కులకు, పది మార్కులకు అడుగుతారు. ఈ నేపథ్యంలో ఏ ప్రశ్నను ఎన్ని మార్కులకు అడిగారో ఆ స్థా యిలోనే సమాధానం ఇచ్చే నైపుణ్యం అలవర్చుకోవాలి. -బి. కుమార్ (ఐఎస్ఎస్) అసిస్టెంట్ డెరైక్టర్ (రీజనల్ ఆఫీస్), ఫీల్డ్ ఆపరేషన్స్ డివిజన్- హైదరాబాద్ కెరీర్ స్కోప్ ఐఈఎస్/ఐఎస్ఎస్లో ఎంపికైన వారి కెరీర్ ఆర్థిక వ్యవహారాల సంబంధ శాఖల్లో అసిస్టెంట్ డెరైక్టర్, రీసెర్చ్ ఆఫీసర్ హోదాతో (జూనియర్ టైం స్కేల్) ప్రారంభమవుతుంది. వీరిని ప్లానింగ్ కమిషన్, నేషనల్ శాంపుల్ సర్వే, లేబర్ బ్యూరో, ఆర్థిక సంఘం, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమ, విద్య, వ్యవసాయం, వాణిజ్యం తదితర విభాగాల్లో నియమిస్తారు. అనుభవం, పనితీరు ఆధారంగా డిప్యూటీ డెరైక్టర్/అసిస్టెంట్ అడ్వైజర్ (సీనియర్ టైం స్కేల్), జాయింట్ డెరైక్టర్ /డిప్యూటీ అడ్వైజర్, సీనియర్ ఎకనమిక్ అడ్వైజర్ తదితర హోదాల నుంచి అత్యున్నత స్థాయి ప్రిన్సిపుల్ అడ్వైజర్ లేదా చీఫ్ అడ్వైజర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పేపర్ సబ్జెక్ట్ మార్కులు పేపర్-1 జనరల్ ఇంగ్లిష్ 100 పేపర్-2 జనరల్ స్టడీస్ 100 పేపర్-3 స్టాటిస్టిక్స్-1 200 పేపర్-4 స్టాటిస్టిక్స్-2 200 పేపర్-5 స్టాటిస్టిక్స్-3 200 పేపర్-6 స్టాటిస్టిక్స్-4 200 మొత్తం మార్కులు 1,000 (ప్రతి పేపర్‌కు: సమయం 3 గంటలు) స్టాటిస్టిక్స్-1 పేపర్లో ప్రాబబిలిటీకి 40 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇందులో రాణించాలంటే పలు రకాల సిద్ధాంతాల (ఉదా: బేయీస్ థీరం)పై పట్టు సాధించాలి. స్టాటిస్టికల్ మెథడ్స్‌కు 45 శాతం; న్యూమరికల్ అనాలిసిస్‌కు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. స్టాటిస్టికల్ మెథడ్స్ కోసం డేటా కలెక్షన్, ఛార్ట్స్ రూపకల్పన వంటి వ్యూహాలతో ఆయా అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. స్టాటిస్టిక్స్-2 పేపర్లో లీనియర్ మోడల్స్ (ఉదా: అనాలిసిస్ ఆఫ్ వన్-వే, టు-వే క్లాసిఫైడ్ డేటా, మిక్స్డ్ అండ్ ర్యాండమ్ ఎఫెక్ట్స్ మోడల్స్ తదితర)కు 25 శాతం వెయిటేజీ; ఎస్టిమేషన్ (ఉదా: ఎస్టిమేషన్ మెథడ్స్; క్రామర్-రావ్ ఇనీక్వాలిటీ తదితర)కు 25 శాతం; హైపోథిసిస్ టెస్టింగ్ (ఉదా: క్రిటికల్ రీజియన్స్ రకాలు, నేమన్-పియర్సన్ ఫండమెంటల్ లెమ్మా, తదితర)కు 25 శాతం; మల్టీవెరైటీ అనాలిసిస్ (ఎస్టిమేషన్ ఆఫ్ మీన్ వెక్టార్ అండ్ కో వేరియన్స్ మ్యాట్రిక్స్, పార్షియల్ అండ్ మల్టిపుల్ రిలేషన్ కోఎఫిషియెంట్స్తదితర) 25 శాతం వెయిటేజీ ఉంటుంది. స్టాటిస్టిక్స్-3 పేపర్లో శాంప్లింగ్ టెక్నిక్స్ (ఉదా: పైలట్ అండ్ లార్జ్ స్కేల్ శాంపుల్ సర్వేస్, ఎన్ఎస్ఎస్ సంస్థ పాత్ర, సింపుల్ ర్యాండమ్ శ్యాంప్లింగ్ తదితర)కు 35 శాతం; ఎకనామిక్ సాటిస్టిక్స్ (ఇండెక్స్ నెంబర్స్ ఆఫ్ ప్రైసెస్ అండ్ క్వాంటిటీస్ అండ్ రిలేటివ్ మెరిట్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ ఆఫ్ హోల్‌సేల్ అండ్ కన్స్యూమర్ ప్రైసెస్ తదితర)కు 25శాతం వెయిటేజీ ఉంటుంది. మిగతా మొత్తానికి డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, ఎకనోమెట్రిక్స్ నుంచి ప్రశ్నలుంటాయి. స్టాటిస్టిక్స్-4 పేపర్లో స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్ (ఉదా: ప్రిన్సిపుల్ ఆఫ్ డ్యుయాలిటీ; ట్రాన్స్పోర్ట్ అండ్ అసైన్మెంట్ ప్రాబ్లమ్స్)కు 40 శాతం; డెమోగ్రఫీ అండ్ వైటల్ ఛార్ట్స్ (ఉదా:మెక్హామ్స్ అండ్ గోంపెర్ట్జ్ కర్వ్స్; నేషనల్ లైఫ్ టేబుల్స్ తదితర) కు 40 శాతం వెయిటేజీ కేటాయించారు. కంప్యూటర్ సిస్టమ్- సాఫ్ట్వేర్ కాన్సెప్ట్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ వంటి కంప్యూటర్ సంబంధ ప్రశ్నలు అడుగుతారు. స్ట్రాటజీ: డేటా ఆధారిత అంశాలు అధికంగా ఉండే ఈ పేపర్లలో చక్కని స్కోర్ చేయాలంటే వేగంతోపాటు కచ్చితత్వం, సునిశిత పరిశీలన అవసరం. ప్రిపరేషన్ సమయంలోనే ప్రతి అంశాన్ని నిర్దిష్ట కాలపరిమితి విధించుకుని చదవాలి. ప్రతి వారం కనీసం రెండు మాక్‌టెస్ట్‌లు రాసి బలాలు, బలహీనతలు విశ్లేషించుకోవాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే ప్రశ్నలడుగుతున్న తీరుపై స్పష్టమైన అవగాహన ఏర్పడి ప్రిపరేషన్‌ను ఏ తీరులో సాగించాలో తెలుస్తుంది. ముఖ్యంగా స్టాటిస్టిక్స్ విషయంలో ఆయా సిద్ధాంతాలు వాటిని వినియోగించి డేటా రూపకల్పన, ఛార్ట్స్, గ్రాఫ్స్ రూకల్పన వంటి అంశాలపై పట్టు సాధించాలి. ఐఈఎస్/ఐఎస్స్ నోటిఫికేషన్-2013 ఇండియన్ ఎకనమిక్ సర్వీస్-ఖాళీలు: 30 అర్హత: పీజీ ఇన్ ఎకనామిక్స్/అప్లయిడ్ ఎకనామిక్స్ / బిజినెస్ ఎకనామిక్స్/ఎకనోమెట్రిక్స్ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్-ఖాళీలు: 36 అర్హత: పీజీ ఇన్ స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/అప్లయిడ్ స్టాటిస్టిక్స్ వయోపరిమితి: 21-30 ఏళ్లు(ఆగస్ట్1, 2013నాటికి) దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 16, 2013. రాత పరీక్షలు ప్రారంభం: నవంబర్ 9, 2013. వివరాలకు: www.upsc.gov.in -
క్లరికల్ కొలువుకు సక్సెస్ మార్గాలు..
కె.వి. జ్ఞానకుమార్, డెరైక్టర్, డీబీఎస్,హైదరాబాద్. బ్యాంకులు.. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన బ్యాంకుల సేవలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తున్నాయి. డిపాజిట్ల సేకరణ, రుణాలు ఇవ్వడం వంటివే కాకుండా బీమా వంటి కార్యకలాపాలనూ సాగిస్తున్నాయి. ఈ క్రమంలో బ్రాంచ్‌ల సంఖ్యను పెంచుకుంటూ కుర్రకారుకు కలల కొలువులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇలా యువత భవితకు సుస్థిర బాటలు వేస్తున్న బ్యాంకింగ్ రంగంలో తొలి మెట్టు అయిన క్లరికల్ ఉద్యోగాలను చేజిక్కించుకోవాలంటే ఐబీపీఎస్ ఎగ్జామ్‌లో మెరుగైన మార్కులు సాధించాలి. ఈ నేపథ్యంలో మంచి స్కోర్ కోసం ప్రిపరేషన్ ప్లాన్.. 19 బ్యాంకుల్లో ఉన్న క్లరికల్ ఖాళీల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల సంఖ్య కచ్చితంగా తెలియకపోయినా భారీ సంఖ్యలోనే పోస్టులు ఉంటాయని అంచనా. వేలాది మంది బ్యాంకు ఉద్యోగుల పదవీ విరమణ, పెరుగుతున్న బ్రాంచ్‌ల సంఖ్య వల్ల ఖాళీల సంఖ్య అధికమవుతోంది. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. రాత పరీక్ష విధానం రాత పరీక్షను ఆబ్జెక్టివ్ పద్ధతిలో రెండు గంటల వ్యవధిలో ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో ఐదు విభాగాలుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది. విభాగం మార్కులు రీజనింగ్ 40 ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 న్యూమరికల్ ఎబిలిటీ 40 జనరల్ అవేర్నెస్ (బ్యాంకింగ్ రంగానికి ప్రాధాన్యం) 40 కంప్యూటర్ నాలెడ్జ్ 40 మొత్తం 200 ప్రిపరేషన్ వ్యూహం పట్టుదలతో చదివితే సాధ్యం కానిది ఏదీ లేదు. ప్రతి రోజూ ప్రణాళిక ప్రకారం చదవాలి. దీనికోసం 90 రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఐబీపీఎస్ క్లరికల్ పరీక్షకు ఇంకా మూడు నెలలకు పైగా సమయం ఉంది. అందువల్ల మొదటిసారి పరీక్ష రాస్తున్న అభ్యర్థులు కూడా శ్రమించి విజయాన్ని అందుకోవచ్చు. రీజనింగ్ అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని అంచనా వేసేందుకు రీజనింగ్‌పై ప్రశ్నలు ఇస్తున్నారు. మిగిలిన ప్రశ్నలతో పోలిస్తే రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అయితే చిట్కాల ద్వారా సాధన చేస్తే త్వరగా సమాధానాలు గుర్తించవచ్చు. రీజనింగ్‌లో సిరీస్; అనాలజీ; క్లాసిఫికేషన్ కోడిం గ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; రక్త సంబంధాలు; సీటింగ్ అరేంజ్మెంట్స్; ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, పజిల్స్ తదితర అంశాలుంటాయి. ఈ విభాగాల నుంచి వచ్చే ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలను గుర్తించేందుకు ఉన్న ఏకైక మార్గం ప్రాక్టీస్. దీంతో సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చు. Ex: In a certain code "TERMINAL' is written as "NSFUMBOJ' and "TOWERS' is written as "XPUTSF'. How is "MATE' written in that code? 1) FUBN 2) UFNB 3) BNFU 4) BNDS 5) Non of these ఇంగ్లిష్ లాంగ్వేజ్:రీడింగ్ కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్‌లో దాదాపు 20 మార్కులు సాధించి ముందుగా కటాఫ్ నుంచి పైకి వెళ్లొచ్చు. దీనికోసం ఇంగ్లిష్ గ్రామర్, రూట్‌వర్డ్స్‌ను బాగా సాధన చేయాలి. మిగిలిన అంశాల్లో జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటివి ఉంటాయి. వీటితో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అందువల్ల అభ్యర్థులు వీటిపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాల సహాయంతో వొకాబ్యులరీని డెవలప్ చేసుకోవాలి. రోజుకు 10-15 వరకు యాంటోనిమ్స్, సినానిమ్స్ నేర్చుకోవాలి. ప్రాథమిక గ్రామర్ అంశాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్; యాక్టివ్, పాసివ్ వాయిస్; డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్ తదితర అంశాలను సాధన చేయాలి. తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులు ఇంగ్లిష్‌పై పట్టుసాధించడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. Ex: Read below sentence to find out whether there is any grammatical mistake/ error if any, will be one part of sentence. Mark the number of the part with errors as your answer. If there is "No error', mark (5). If you have made a mistake(1)/while filling up the form(2)/you should be informed(3)/ the Income Tax department immediately(4). No error(5) న్యూమరికల్ ఎబిలిటీ:న్యూమరికల్ విభాగంలో ఎక్కువగా సింప్లిఫికేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. వీటికి తేలిగ్గా సమాధానాలు గుర్తించాలంటే మూలస్తంభాలైన కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలపై పట్టు సాధించాలి. వర్గమూలాలు, ఘన మూలాలు, శాతాలపై అవగాహన పెంపొందించుకోవాలి. సమస్య చూడగానే నోటితో చెప్పగలిగే స్థాయిలో ప్రిపరేషన్ ఉండాలి. కాలం-పని; కాలం-దూరం, లాభం-నష్టం, రేషియోస్‌కు సంబంధించిన సమస్యల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఆన్లైన్ పరీక్షలో సింప్లిఫికేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కడ ఇచ్చారో తెలుసుకోవడానికి పైకి-కిందకు స్క్రోల్ చేసి చూడాలి. ఎందుకంటే ఒక్కోసారి దీనికి సంబంధించిన ప్రశ్నలు చివర్లో ఇస్తారు. Ex: The average weight of 21 boys was recorded as 64 kgs. If the weight of the teacher was added, the average increased by one kg. What was the teachers' weight? 1) 86 kgs 2) 64 kgs 3) 72 kgs 4) 98 kgs జనరల్ అవేర్నెస్:జనరల్ అవేర్నెస్ విభాగాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. 1. స్టాండర్డ్ జీకే. 2. కరెంట్ అఫైర్స్. స్టాండర్డ్ జీకేకు సంబంధించి వివిధ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షుల పేర్లు; కరెన్సీలు; రాజధానులు వంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి. నోబెల్, ఆస్కార్లతో పాటు వివిధ అవార్డుల విజేతల గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు మారుతున్న అంతర్జాతీయ సంస్థల ఉన్నతాధికారుల వివరాలు, క్రీడల్లో విజేతలు, విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రముఖ అతిథులు, ముఖ్యమైన సంఘటనలను రోజూ పత్రికల ద్వారా తెలుసుకొని ఓ పుస్తకంలో నోట్ చేసుకోవాలి. ఈ పేపర్లోనే బ్యాంకింగ్ రంగ పరిజ్ఞానానికి సంబంధించి దాదాపు 20 వరకు ప్రశ్నలు రావొచ్చు. దీనికోసం ప్రామాణిక బ్యాంకింగ్ అవేర్నెస్ పుస్తకాలను ఎంచుకోవాలి. అదే విధంగా ఓ ఫైనాన్షియల్ డెయిలీని చదవాలి. అభ్యర్థులు బ్యాంకింగ్ రంగంలో నిరంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలు (ఉదా: వడ్డీ రేట్లు, బ్యాంకుల ఉన్నతాధికారుల పేర్లు, లోగోలు, బైలైన్స్..) తెలుసుకోవాలి. బ్యాంకింగ్‌లో వాడే పదాలు, వాటి అర్థాలపై అవగాహన పెంపొందించుకోవాలి. వివిధ బ్యాంకుల కొత్త విధానాలు, ఆర్బీఐ తాజా సమాచారం తెలుసుకోవాలి. Ex: 1. Which of the following is Not a function of a commercial bank? 1) Providing project finance 2) Settlement of payments of behalf of the customers 3) Decide policy rates like CRR, SLR, & Reporates 4) Issuing credit/debit/ATM cards 5) Providing services such as locker facilities, remittances 2. Shanti Swarup Bhatnagar Award is given for excellence in the field of ................ 1) Literature 2) Music 3) Sports 4) Science and Technology 5) Social service కంప్యూటర్ నాలెడ్జ్:ఈ పేపర్లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశముంటుంది. అభ్యర్థులు తొలుత కంప్యూటర్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆ తర్వాత నమూనా ప్రశ్నలపై దృష్టిసారించాలి. తొలి ఐబీపీఎస్ పరీక్ష నుంచి చూస్తే ఈ విభాగంలో ఇస్తున్న ప్రశ్నల కఠినత్వ స్థాయి పెరుగుతోంది. అందువల్ల అభ్యర్థులు కంప్యూటర్స్-జనరేషన్స్; ఎంఎస్ వర్డ్; ఎంఎస్ ఆఫీస్; డేటాబేస్ మేనేజ్మెంట్, షార్ట్‌కట్ కమాండ్స్ తదితరాల గురించి తెలుసుకోవాలి. Ex: The permanently etched program in ROM that automatically begins executing the computer's instructions is the 1) BIOS 2) ROM 3) CMOS 4) RAM 5) None of these రిఫరెన్స బుక్స్: వెర్బల్ రీజనింగ్- ఆర్.ఎస్.అగర్వాల్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్- ఎస్.ఎల్ గులాటీ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఫర్ బ్యాంకింగ్- దిల్హాన్ పబ్లికేషన్స్ ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్-హరిమోహన్ ప్రసాద్ 100 వరకు మోడల్ పేపర్లు చేశా నేను 100 వరకు మోడల్ పేపర్లు సాధన చేశాను. షార్ట్‌కట్స్ ఎన్ని తెలిసినా తగినన్ని మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయకుంటే ఫలితం ఉండదు. ప్రామాణిక ఇంగ్లిష్, తెలుగు పత్రికలతో పాటు ఇంటర్నెట్ సహాయంతో ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్పై పట్టు సాధించా. దినపత్రికల్లో బిజినెస్ పేజీలను చదవడం వల్ల బ్యాంకింగ్ రంగంపై అవగాహన ఏర్పడింది. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, కంప్యూటర్ జనరేషన్స్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలు తెలుసుకోవాలి. ఇంగ్లిష్‌ను తేలిగ్గా తీసుకుంటే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశముంది. అందువల్ల రోజులో కొంత సమయాన్ని ఇంగ్లిష్ ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ఇంటర్వ్యూ ఎనిమిది నిమిషాలు జరిగింది. కుటుంబ నేపథ్యం, బ్యాంకింగ్‌కు సంబంధించిన కరెంట్ టాపిక్స్‌పై ప్రశ్నలు అడిగారు. - కృష్ణ చైతన్య, విజయా బ్యాంక్, హైదరాబాద్. (2012 ఐబీపీఎస్ క్లరికల్ విజేత) సక్సెస్‌కు ప్రాక్టీస్ కీలకం ఎన్ని గంటలు చదివామనే దానికన్నా ఎంత ఫోకస్డ్గా చదివామన్న దానిపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఐబీపీఎస్ క్లరికల్, పీఓ పరీక్షల్లో విజయానికి వీలైనన్ని మోడల్ పేపర్లు సాధన చేయడం చాలా అవసరం. టైమ్ పెట్టుకొని మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల తెలియని ప్రశ్నలపై మరింత దృష్టిపెట్టేందుకు వీలుంటుంది. గ్రూప్‌గా చదవడం వల్ల సమస్యలకు తొందరగా సమాధానాలు గుర్తించేందుకు ఉపయోగపడే షార్ట్‌కట్స్ తెలుస్తాయి. కరెంట్ అఫైర్స్‌పై అప్డేట్గా ఉండాలి. దినపత్రికల్లోని ఆర్థిక సంబంధమైన ఎడిటోరియల్స్‌ను చదవడం వల్ల బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకోవచ్చు. బ్యాంకింగ్ టెర్మినాలజీ కూడా ఒంటపడుతుంది. ప్రిపరేషన్‌కు బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్, బ్యాంకింగ్ అవేర్నెస్ బుక్స్‌ను ఉపయోగించుకోవాలి. - బొడ్డు శ్రీకాంత్, ఐవోబీ, నల్లజెర్ల. (2012 ఐబీపీఎస్ పీఓ విజేత) ఐబీపీఎస్ క్లరికల్ నోటిఫికేషన్ వివరాలు అర్హత: ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. కంప్యూటర్ వాడుకకు సంబంధించిన పరిజ్ఞానం తప్పనిసరిగా అవసరం. వయో పరిమితి: 20- 28 ఏళ్ల మధ్య ఉండాలి. (ఆగస్టు 1, 2013 నాటికి). ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు మూడేళ్ల మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా. ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 19, 2013. ఆన్లైన్ దరఖాస్తు ముగింపు: సెప్టెంబర్ 7, 2013. ఆన్లైన్ పేమెంట్: 19.8.2013-7.9.2013. ఆఫ్‌లైన్ ఫీ పేమెంట్: 21.8.2013-12.9.2013. పరీక్షల తేదీలు: 30.11.2013, 1.12.2013, 7.12.2013, 8.12.2013, 14.12,2013, 15.12.2013. (వీటిలో మార్పులు, చేర్పులు జరగొచ్చు.) రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, గుడ్లవల్లేరు, గూడూరు, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కంచికచర్ల, కరీంనగర్, కర్నూలు, మైలవరం, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఐబీపీఎస్ ద్వారా క్లరికల్ నియామకాలు చేపడుతున్న బ్యాంకులు అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్. వెబ్సైట్:www.ibps.in