బీఎస్‌ఎన్‌ఎల్‌లో జేఏవో ఉద్యోగాలు | JAO jobs in BSNL | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌లో జేఏవో ఉద్యోగాలు

Published Thu, Dec 4 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

బీఎస్‌ఎన్‌ఎల్‌లో జేఏవో ఉద్యోగాలు

బీఎస్‌ఎన్‌ఎల్‌లో జేఏవో ఉద్యోగాలు

 జాబ్ పాయింట్: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్  (బీఎస్‌ఎన్‌ఎల్)లో 962 జూనియర్ అకౌంట్స్  ఆఫీసర్స్ (జేఏవో) ఉద్యోగాల భర్తీకి ప్రకటన  విడుదలైంది. రూ.16,400-రూ.40,500  వేతన స్కేలు, ఏటా 3 శాతం ఇంక్రిమెంట్,  హెచ్‌ఆర్‌ఏ, మెడికల్ అలవెన్సు ఇలా
 ఆకర్షణీయ జీతభత్యాలకు నెలవైన జేఏవో  ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలు..   రెండేళ్ల విరామం తర్వాత ప్రకటన వెలువడింది. గతంలో పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉండేది. ఇప్పుడు దీన్ని ఆబ్జెక్టివ్ విధానంలోకి మార్చారు.
 
 ఖాళీల వివరాలు: కేటగిరీ    ఉద్యోగాలు
 ఓసీ    389
 ఓబీసీ    260
 ఎస్సీ    195
 ఎస్టీ    118
 మొత్తం    962
 
 ఆంధ్రప్రదేశ్ సర్కిల్: ఓసీ-46; ఓబీసీ-11; ఎస్సీ-22; ఎస్టీ-12. మొత్తం 91.
 అర్హతలు: చార్టర్డ్ అకౌంటెంట్/కంపెనీ సెక్రటరీ/కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్/మాస్టర్ ఆఫ్ కామర్స్. గుర్తింపు పొందిన సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుంచి 2014, డిసెంబర్ 31 నాటికి అర్హత సాధించి ఉండాలి.
 వయసు: 2015, జనవరి 1 నాటికి కనిష్ట వయసు 20 ఏళ్లు, గరిష్ట వయసు 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు సడలింపు ఉంటుంది.
 ఎంపిక: అఖిల భారత స్థాయిలో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే రాత పరీక్ష ద్వారా నియామకాలు జరుగుతాయి. రాత పరీక్షలో రెండు పేపర్లుంటాయి. పేపర్-1కు 150 మార్కులు, పేపర్-2కు 300 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు మూడు గంటలు కేటాయించారు. మెరిట్ జాబితాలో చోటుసంపాదించాలంటే సెక్షన్ వారీగా, మొత్తంమీద అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
 
 ప్రశ్నపత్రం:
 పేపర్    సబ్జెక్టు    మార్కులు
 పేపర్-1    జనరల్ ఇంగ్లిష్    100
     జనరల్ ఆప్టిట్యూడ్/అవేర్‌నెస్    50
 పేపర్-2    ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్/
     కాస్ట్ అకౌంటింగ్/ట్యాక్స్
     అండ్ కమర్షియల్ లాస్    300
 
 సిలబస్:
     జనరల్ ఇంగ్లిష్: కాంప్రెహెన్షన్, గ్రామర్, వొకాబ్యులరీ.
     జనరల్ ఆప్టిట్యూడ్: జాతీయ, అంతర్జాతీయ వర్తమాన వ్యవహారాలు; భారత రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ; జనరల్ మెంటల్ ఎబిలిటీ; రీజనింగ్, క్వాంటిటేటివ్ టెక్నిక్.
     ఫైనాన్షియల్, కమర్షియల్ అకౌంట్స్: అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్, ఆడిటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్, ప్రభుత్వ రంగ సంస్థలు-ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఆర్థిక చట్టాలు.
 
 ముఖ్య అంశాలు:
     ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబర్ 1, 2014- డిసెంబర్ 31, 2014.
     ఫీజు: ఓసీ, ఓబీసీ అభ్యర్థులు మాత్రమే రూ.వెయ్యి ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
     సర్కిల్ వారీగా: అభ్యర్థులు ఏవైనా ఐదు సర్కిళ్లను ప్రాధాన్యత వారీగా ఎంపిక చేసుకోవచ్చు. మెరిట్, ఖాళీల వారీగా నియామకాలు ఉంటాయి.
     పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌లో సెంటర్ అందుబాటులో ఉంది.
     టీఏ: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ప్రయాణ భత్యానికి అర్హులు.
     రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 22, 2015.
     వెబ్‌సైట్: www.externalexam.bsnl.co.in
     ఉద్యోగానికి ఎంపికైన వారిని రెండేళ్ల పాటు ప్రొబేషన్‌లో ఉంచుతారు. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని శాశ్వత ఉద్యోగులుగా నియమించుకుంటారు.
 
 ప్రిపరేషన్:
     జనరల్ ఇంగ్లిష్‌లో మంచి మార్కులు సాధించేందుకు గ్రామర్‌లోని ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. ఇంగ్లిష్ పత్రికలు, ప్రామాణిక పుస్తకాల సహాయంతో వొకాబ్యులరీని మెరుగుపరుచుకోవాలి.
     రీజనింగ్ విభాగంలో సిరీస్, అనాలజీ; క్లాసిఫికేషన్; కోడింగ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, డెరైక్షన్స్ తదితర అంశాలను ప్రాక్టీస్ చేయాలి.
     క్వాంటిటేటివ్ టెక్నిక్‌కు సంబంధించి సూక్ష్మీకరణ, నిష్పత్తులు, శాతాలు, సరాసరి, అనుపాతం, క్లాక్స్, టైమ్ అండ్ వర్క్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
     పీజీ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. అందువల్ల ఆ కోణంలో సిద్ధమవ్వాలి.
 
 నమూనా ప్రశ్నలు:
     The SAARC Culture Minister Conference was held in september 2014?
     a) Kathmandu     b) New Delhi
     c) Male         d) Islamabad
     Ans: b
     The phase of accounting that deals with collecting and controlling the costs of producing a given product or service is called
     a) internal auditing
     b) bookkeeping    c) cost accounting
     d) general accounting
     Ans: c
 - కె.వి. జ్ఞానకుమార్, డెరైక్టర్, డీబీఎస్, హైదరాబాద్.
 
 ఇండియన్ నేవీ సెయిలర్స్
 ఇండియన్ నేవీ.. అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి సీనియర్ సెకండరీ రిక్రూటర్స్ సెయిలర్స్ నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
 అర్హత: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్‌లతో 10+2/తత్సమానం. నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.
 వయసు: ఆగస్ట్ 1, 1994-జూలై 31, 1998 మధ్య జన్మించి ఉండాలి.
 ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నె స్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.
     రాత పరీక్షను ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. సమాధానాలను గుర్తించడానికి గంట సమయం కేటాయించారు. 10+2 స్థాయిలో ప్రశ్నల క్లిష్టత ఉంటుంది. ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిష్/హిందీ భాషల్లో రూపొందిస్తారు. సిలబస్‌ను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
     ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో 1.6 కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తి చేయాలి. 20 సిట్ అప్స్, 10 పుష్ అప్స్ చేయాలి.
     ఎంపికైన అభ్యర్థులకు ఆగస్ట్, 2015 నుంచి ఐఎన్‌ఎస్-చిల్కాలో 22 వారాలపాలు శిక్షణనిస్తారు. తర్వాత దేశంలోని వివిధ నేవల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది.
 
     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఆ దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి.
     దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 7, 2014.
     {పింట్ అవుట్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్ 14, 2014.
     వివరాలకు: http://nausenabharti.nic.in
     ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు ప్రింట్ అవుట్ పంపాల్సిన చిరునామా:
 పోస్ట్‌బాక్స్ నంబర్-488,
 గోలే డాక్‌ఖానా, జీపీవో,
 న్యూఢిల్లీ-110001.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement