పునశ్చరణతోనే విజయానికి బాటలు.. | bhavita Job Point-IES / ISS-22-08-13 | Sakshi
Sakshi News home page

పునశ్చరణతోనే విజయానికి బాటలు..

Published Thu, Aug 22 2013 3:34 PM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM

bhavita Job Point-IES / ISS-22-08-13

డా॥తమ్మా కోటిరెడ్డి,ప్రొఫెసర్,
 ఐబీఎస్ హైదరాబాద్.
 
 యూపీఎస్సీ.. ఇండియన్ ఎకనమిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామ్ (ఐఈఎస్/ఐఎస్‌ఎస్)కు నోటిఫికేష్ విడుదల చేసింది. ఐఈఎస్/ఐఎస్‌ఎస్ ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ అనే దశల్లో 1200 మార్కులకు జరుగుతుంది. రాత పరీక్ష మొత్తం 1000 మార్కులకు ఉంటుంది. దీన్ని ఆరు పేపర్లుగా నిర్వహిస్తారు. ఇందులో జనరల్ స్టడీస్, జనరల్ ఇంగ్లిష్ పేపర్లు మాత్రమే ఐఈఎస్, ఐఎస్‌ఎస్ రెండు సర్వీసులకు ఉమ్మడిగా ఉంటాయి. మిగిలినవి సబ్జెక్ట్ పేపర్లు. వీటిని ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌లలో వేర్వేరుగా నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్ట్‌కు నాలుగు పేపర్లు ఉంటాయి. రాత పరీక్ష పూర్తిగా కన్వెషనల్ (ఎస్సే) రూపంలో ఉంటుంది. సమాధానాలను పూర్తిగా ఇంగ్లిష్‌లోనే రాయాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. దీనికి 200 మార్కులు కేటాయించారు.
 
 జనరల్ ఇంగ్లిష్


 ఈ విభాగంలో ప్రశ్నల క్లిష్టత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఇందులో ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. మిగిలిన ప్రశ్నలు మాత్రం అభ్యర్థుల ఇంగ్లిష్ భాష పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. ప్రెసిస్ పేరాగ్రాఫ్ ప్రశ్నలు కూడా ఇస్తారు. ఈ విభాగంలో ఇంగ్లిష్‌లో కేవలం భావ వ్యక్తీకరణే కాకుండా వాక్య నిర్మాణ శైలిని పరిశీలిస్తారు. కాబట్టి వొకాబ్యులరీని, రీడింగ్ కాంప్రహెన్షన్ టెక్నిక్స్‌ను పెంచుకోవాలి.
 
 జనరల్ స్టడీస్


 ఈ విభాగంలో ప్రశ్నల క్లిష్టత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఇందులో మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు (కరెంట్ ఈవెంట్స్), జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ క్రమంలో శాస్త్రసాంకేతిక రంగం, భారత రాజ్యాంగం, భారతదేశ చరిత్ర, జాగ్రఫి నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో రాణించాలంటే ఇటీవలి పరిణామాల (ద్వైపాక్షిక ఒప్పందాలు, అంతర్జాతీయ సదస్సులు, తాజా రాజకీయ పరిణామాలు తదితర) పై పట్టు పెంచుకోవాలి. హిస్టరీలో స్వాతంత్య్రోద్యమం, ఆధునిక భారతదేశ చరిత్ర, జాగ్రఫీలో భారత భౌతిక భౌగోళిక అంశాలపై దృష్టి పెట్టాలి. జాగ్రఫీలో ఎకానమీతో ముడిపడి ఉండే అంశాలు (ఖనిజాలు, మైనింగ్, పరిశ్రమలు)కూడా ప్రధానమే. ఎకానమీలో..వివిధ ఆర్థిక వ్యవస్థలు, , తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
 
 పరీక్షా విధానం


 ఇండియన్ ఎకనమిక్ సర్వీస్
 పేపర్    సబ్జెక్ట్    మార్కులు
 పేపర్-1    జనరల్ ఇంగ్లిష్    100
 పేపర్-2     జనరల్ స్టడీస్    100
 పేపర్-3    జనరల్‌ఎకనామిక్స్-1    200
 పేపర్-4    జనరల్ ఎకనామిక్స్-2    200
 పేపర్-5    జనరల్ ఎకనామిక్స్-3     200
 పేపర్-6    ఇండియన్ ఎకనామిక్స్    200
     మొత్తం మార్కులు    1,000
 (ప్రతి పేపర్‌కు: సమయం 3 గంటలు)


 
 జనరల్ ఎకనామిక్స్ -1


 ఈ విభాగంలోని సిలబస్‌ను పరిశీలిస్తే.. సూక్ష్మ ఆర్థ శాస్త్రంతోపాటు మ్యాథమెటికల్, ఎననోమెట్రిక్స్ పద్ధతులకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. ఇందులో పార్ట్-ఎ, పార్ట్-బి అనే రెండు ఉప విభాగాలు ఉంటాయి. పార్ట్-ఎలో రాణించాలంటే.. సూక్ష్మ ఆర్థ శాస్త్రంలోని ఉత్పత్తి, పంపిణీ అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఇందుల్లోంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. పార్ట్-బికి సంబంధించి లీనియర్ ప్రోగ్రామింగ్, సహ సంబంధం, టైమ్ సిరీస్, శాంప్లింగ్ వంటి పద్ధతులపై అవగాహన అవసరం.


 రిఫరెన్స్ బుక్స్

ఎకనామిక్స్-పాల్ ఎ. శామ్యూల్‌సన్ (19వ ఎడిషన్)
మ్యాథమెటికల్ అనాలిసిస్ ఫర్ ఎకనామిక్స్-ఆర్.జి.డి. అలెన్, మ్యాక్‌మిలాన్
స్టాటిస్టిక్స్ ఫర్ బిజినెస్ అండ్ ఎకనామిక్స్-అండర్సన్ అండ్ షెన్నీ
స్టాటిస్టిక్స్ ఫర్ మ్యాథమెటిక్స్-డి.ఆర్. అగర్వాల్
 
 జనరల్ ఎకనామిక్స్-2


 ఈ పేపర్‌కు సంబంధించిన సిలబస్‌ను పరిశీలిస్తే.. స్థూల ఆర్థశాస్త్రానికి సంబంధించిన అంశాలు, వృద్ధి సిద్ధాంతాలు, అంతర్జాతీయ అర్ధ శాస్త్రం, స్కూల్ ఆఫ్ థాట్స్ (ఛిజిౌౌట ౌజ ఖీజిౌఠజజ్టి) అంశాలకు చోటు కల్పించారు. ఇందులో రాణించాలంటే సమగ్రంగా సిలబస్‌ను అధ్యయనం చేయాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి తదితర అంశాలను పూర్తిగా చదవాలి. ఉద్యోగితా సిద్ధాంతాలపై డిగ్రీ స్థాయి పుస్తకాలను చదవడం ద్వారా కొంత మేరకు అవగాహన ఏర్పడుతుంది.
 
 రిఫరెన్స్ బుక్స్
 
 ఎకనమిక్  ఎన్విరాన్‌మెంట్ ఆఫ్ బిజినెస్-ఎం.ఎల్. జింగాన్,
 ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ - చేరునిలమ్
 మాక్రో ఎకనామిక్స్-ఎన్. గ్రెగరీ, మాన్కివ్
 (6వ ఎడిషన్)
 గ్రోత్, సస్టెయినబులిటీ అండ్ ఇండియాస్ ఎకనమిక్ రిఫామ్స్-టి.ఎన్. శ్రీనివాసన్
 
 జనరల్ ఎకనామిక్స్-3
 
 ఈ పేపర్‌లో రాణించాలంటే పబ్లిక్ ఫైనాన్స్, పర్యావరణ అర్ధ శాస్త్రం, ఇండస్ట్రియల్ ఎకనమిక్స్, మార్కెట్ ప్రణాళికకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ప్రభుత్వ విత్తంలో పన్నుల సంస్కరణలు-వ్యయ సిద్ధాంతాలు, ప్రభుత్వ రుణ యాజమాన్యం వంటి అంశాలపై ప్రశ్నలు అడగవచ్చు. పర్యావరణ అర్థ శాస్త్రంలో సుస్థిర వృద్ధి, గ్రీన్ జీడీపీ, సాంప్రదాయ, సాంప్రదాయేతర ఇంధన వనరులు, అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు వంటి అంశాలను ప్రిపేర్ కావాలి. ఇండస్ట్రియల్ ఎకనామిక్స్‌లో వివిధ మార్కెట్‌లలో ధరల సిద్ధాంతాలు, సూక్ష్మ స్థాయి పెట్టుబడి విధానాలు,Preventing Pricing,  మార్కెట్ కేంద్రీకరణ వంటి అంశాలపై ప్రశ్నలు రావచ్చు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక రచన, విచక్షణాత్మ-కేంద్రీకృత ప్రణాళికా సంబంధిత లాభనష్టాలను పరిశీలించాలి.
 
 రిఫరెన్స్ బుక్స్
 హ్యాండ్ బుక్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్-
 గుర్గెన్, రిచర్డ్, స్ప్రింగర్
 ఎకనమిక్స్ ఆఫ్ డవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్-ఎం.ఎల్.జింగాన్
 హ్యాండ్ బుక్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఎకనామిక్స్ ఇన్ ఇండియా-విక్రమ్ దయాళ్, కంచన్ చోప్రా
 ఇండస్ట్రియల్ ఎకనామిక్స్-ఆర్.ఆర్.భరత్వాల్
 పబ్లిక్ ఫైనాన్స్-హెచ్.ఎల్.భాటియా
 
 ఇండియన్ ఎకనమిక్స్


 ఈ పేపర్‌కు సంబంధించి వివిధ పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి అభ్యర్థులకు ఈ విభాగం పట్ల ఒక అవగాహన ఉంటుంది. ఈ నేపథ్యంలో ్రప్రిపరేషన్ స్థాయిని కొంత పెంచుకుంటే ఇందులో రాణించవచ్చు. ఈ క్రమంలో వివిధ రంగాల్లో ప్రవేశ పెట్టిన సంస్కరణలు, ప్రత్యామ్నాయ అభివృద్ధి వ్యూహాలు, పేదరికం, నిరుద్యోగం, మానవాభివృద్ధి, ద్రవ్యోల్బణం, విదేశీ వాణిజ్యం, ద్రవ్యం-బ్యాంకింగ్, బడ్జెటింగ్-కోశ విధానం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వ్యూహాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
 
 రిఫరెన్స్ బుక్స్:ఇంటర్నేషనల్ బిజినెస్-రాకేష్ మోహన్, జోషి
 ఇండియన్ ఎకనామీ-మిశ్రా అండ్ పూరీ
 హ్యూమన్ డవలప్‌మెంట్ రిపోర్ట్-యూఎన్‌డీపీ
 వరల్డ్ డవలప్‌మెంట్ రిపోర్ట్-ఐబీఆర్‌డీ
 ఇండియన్ ఎకనామీ-ఉమా కపిల
 
 సిలబస్‌పై అవగాహన కీలకం
 
 ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్ ఔత్సాహికలు ముందుగా సిలబస్‌పై సంపూర్ణ అవగాహన పొందాలి. కారణం.. పరీక్ష ఒకే రోజు రెండు పేపర్లు చొప్పున జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు ఏ పేపర్‌లో ఏ సిలబస్ ఉందో అవగాహన లేక చివరి నిమిషంలో ఆందోళనకు, ఒత్తిడికి గురవుతారు. దీనికి పరిష్కారం సిలబస్‌పై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవడమే. ప్రిపరేషన్ పరంగా.. గత ప్రశ్న పత్రాలను విశ్లేషించడం మేలు చేస్తుంది. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం.. సిలబస్‌లోని అన్ని అంశాలను చదవాలనే తపనకంటే.. తమకు పట్టున్న అంశాలనే వీలైనంత ఎక్కువసార్లు పునశ్చరణ చేసుకోవడం ఉపయుక్తం. ఇప్పటివరకు ఐఎస్‌ఎస్ ఫలితాలను విశ్లేషిస్తే.. మొత్తం మార్కుల్లో 50 శాతం మార్కులు పొందితే సర్వీస్‌కు ఎంపికయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి 200 పేపర్లకు జరిగే పరీక్షలో కనీసం 100 నుంచి 120 మధ్యలో మార్కులు సాధించేలా ప్రిపరేషన్ సాగించాలి.
 
 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ సాగిస్తూనే స్టాటిస్టిక్స్‌లోని ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్‌డ్ లెవల్ వరకు అంశాలను చదవాలి. ఇందుకోసం Fundamentals of Applied Statistics, Fundamentals of Mathematics and Mathematical Statistics S.C.Gupta, V.K.Kapoor, Statistical Methods S.P. Gupta బుక్స్ చదవడం ఉపకరిస్తుంది. ఇంగ్లిష్‌లో ఎక్కువగా ప్యాసేజ్ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. వీటిలో పట్టు సాధిస్తే ఈ పేపర్‌లో 60 శాతం మార్కులు పొందినట్లే. అదే విధంగా జనరల్ స్టడీస్‌కు సంబంధించి.. సివిల్స్ స్థాయిలో కాకున్నా.. అంతకు కొద్దిగా తక్కువ స్థాయిలో అదే సిలబస్‌ను అనుసరించి చదవాలి. ప్రశ్నలు 2 మార్కులకు, 3 మార్కులకు, పది మార్కులకు అడుగుతారు. ఈ నేపథ్యంలో ఏ ప్రశ్నను ఎన్ని మార్కులకు అడిగారో ఆ స్థా యిలోనే సమాధానం ఇచ్చే నైపుణ్యం అలవర్చుకోవాలి.
 
 -బి. కుమార్ (ఐఎస్‌ఎస్)
 అసిస్టెంట్ డెరైక్టర్ (రీజనల్ ఆఫీస్),
 ఫీల్డ్ ఆపరేషన్స్ డివిజన్- హైదరాబాద్
 
 కెరీర్ స్కోప్
 ఐఈఎస్/ఐఎస్‌ఎస్‌లో ఎంపికైన వారి కెరీర్ ఆర్థిక వ్యవహారాల సంబంధ శాఖల్లో అసిస్టెంట్ డెరైక్టర్, రీసెర్చ్ ఆఫీసర్ హోదాతో (జూనియర్ టైం స్కేల్) ప్రారంభమవుతుంది. వీరిని ప్లానింగ్ కమిషన్, నేషనల్ శాంపుల్ సర్వే, లేబర్ బ్యూరో, ఆర్థిక సంఘం, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమ, విద్య, వ్యవసాయం, వాణిజ్యం తదితర విభాగాల్లో నియమిస్తారు. అనుభవం, పనితీరు ఆధారంగా డిప్యూటీ డెరైక్టర్/అసిస్టెంట్ అడ్వైజర్ (సీనియర్ టైం స్కేల్), జాయింట్ డెరైక్టర్ /డిప్యూటీ అడ్వైజర్, సీనియర్ ఎకనమిక్ అడ్వైజర్ తదితర హోదాల నుంచి అత్యున్నత స్థాయి ప్రిన్సిపుల్ అడ్వైజర్ లేదా చీఫ్ అడ్వైజర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.
 
 ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్
 
 పేపర్    సబ్జెక్ట్    మార్కులు
 పేపర్-1    జనరల్ ఇంగ్లిష్    100
 పేపర్-2     జనరల్ స్టడీస్    100
 పేపర్-3    స్టాటిస్టిక్స్-1    200
 పేపర్-4    స్టాటిస్టిక్స్-2    200
 పేపర్-5    స్టాటిస్టిక్స్-3     200
 పేపర్-6    స్టాటిస్టిక్స్-4    200
 మొత్తం మార్కులు    1,000
 (ప్రతి పేపర్‌కు: సమయం 3 గంటలు)
 
 స్టాటిస్టిక్స్-1 పేపర్‌లో ప్రాబబిలిటీకి 40 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇందులో రాణించాలంటే పలు రకాల సిద్ధాంతాల (ఉదా: బేయీస్ థీరం)పై పట్టు సాధించాలి. స్టాటిస్టికల్ మెథడ్స్‌కు 45 శాతం; న్యూమరికల్ అనాలిసిస్‌కు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. స్టాటిస్టికల్ మెథడ్స్ కోసం డేటా కలెక్షన్, ఛార్ట్స్ రూపకల్పన వంటి వ్యూహాలతో ఆయా అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
 
 స్టాటిస్టిక్స్-2 పేపర్‌లో లీనియర్ మోడల్స్ (ఉదా: అనాలిసిస్ ఆఫ్ వన్-వే, టు-వే క్లాసిఫైడ్ డేటా, మిక్స్‌డ్ అండ్ ర్యాండమ్ ఎఫెక్ట్స్ మోడల్స్ తదితర)కు 25 శాతం వెయిటేజీ; ఎస్టిమేషన్ (ఉదా: ఎస్టిమేషన్ మెథడ్స్; క్రామర్-రావ్ ఇనీక్వాలిటీ తదితర)కు 25 శాతం; హైపోథిసిస్ టెస్టింగ్ (ఉదా: క్రిటికల్ రీజియన్స్ రకాలు, నేమన్-పియర్సన్ ఫండమెంటల్ లెమ్మా, తదితర)కు 25 శాతం; మల్టీవెరైటీ అనాలిసిస్ (ఎస్టిమేషన్ ఆఫ్ మీన్ వెక్టార్ అండ్ కో వేరియన్స్ మ్యాట్రిక్స్, పార్షియల్ అండ్ మల్టిపుల్ రిలేషన్ కోఎఫిషియెంట్స్‌తదితర) 25 శాతం వెయిటేజీ ఉంటుంది.
 
 స్టాటిస్టిక్స్-3 పేపర్‌లో శాంప్లింగ్ టెక్నిక్స్ (ఉదా: పైలట్ అండ్ లార్జ్ స్కేల్ శాంపుల్ సర్వేస్, ఎన్‌ఎస్‌ఎస్ సంస్థ పాత్ర, సింపుల్ ర్యాండమ్ శ్యాంప్లింగ్ తదితర)కు 35 శాతం; ఎకనామిక్ సాటిస్టిక్స్ (ఇండెక్స్ నెంబర్స్ ఆఫ్ ప్రైసెస్ అండ్ క్వాంటిటీస్ అండ్ రిలేటివ్ మెరిట్స్, కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ ఆఫ్ హోల్‌సేల్ అండ్ కన్స్యూమర్ ప్రైసెస్ తదితర)కు 25శాతం వెయిటేజీ ఉంటుంది. మిగతా మొత్తానికి డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్, ఎకనోమెట్రిక్స్ నుంచి ప్రశ్నలుంటాయి.
 
 స్టాటిస్టిక్స్-4 పేపర్‌లో స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్ (ఉదా: ప్రిన్సిపుల్ ఆఫ్ డ్యుయాలిటీ; ట్రాన్స్‌పోర్ట్ అండ్ అసైన్‌మెంట్ ప్రాబ్లమ్స్)కు 40 శాతం; డెమోగ్రఫీ అండ్ వైటల్ ఛార్ట్స్ (ఉదా:మెక్‌హామ్స్ అండ్ గోంపెర్ట్జ్ కర్వ్స్; నేషనల్ లైఫ్ టేబుల్స్ తదితర) కు 40 శాతం వెయిటేజీ కేటాయించారు. కంప్యూటర్ సిస్టమ్- సాఫ్ట్‌వేర్ కాన్సెప్ట్స్, డేటాబేస్ మేనేజ్‌మెంట్ వంటి కంప్యూటర్ సంబంధ ప్రశ్నలు అడుగుతారు.
 
 స్ట్రాటజీ: డేటా ఆధారిత అంశాలు అధికంగా ఉండే ఈ పేపర్లలో చక్కని స్కోర్ చేయాలంటే వేగంతోపాటు కచ్చితత్వం, సునిశిత పరిశీలన అవసరం. ప్రిపరేషన్ సమయంలోనే ప్రతి అంశాన్ని నిర్దిష్ట కాలపరిమితి విధించుకుని చదవాలి. ప్రతి వారం కనీసం రెండు మాక్‌టెస్ట్‌లు రాసి బలాలు, బలహీనతలు విశ్లేషించుకోవాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే ప్రశ్నలడుగుతున్న తీరుపై స్పష్టమైన అవగాహన ఏర్పడి ప్రిపరేషన్‌ను ఏ తీరులో సాగించాలో తెలుస్తుంది. ముఖ్యంగా స్టాటిస్టిక్స్ విషయంలో ఆయా సిద్ధాంతాలు వాటిని వినియోగించి డేటా రూపకల్పన, ఛార్ట్స్, గ్రాఫ్స్ రూకల్పన వంటి అంశాలపై పట్టు సాధించాలి.
 
 
 
 ఐఈఎస్/ఐఎస్‌స్ నోటిఫికేషన్-2013
 ఇండియన్ ఎకనమిక్ సర్వీస్-ఖాళీలు: 30
 అర్హత: పీజీ ఇన్ ఎకనామిక్స్/అప్లయిడ్ ఎకనామిక్స్ / బిజినెస్ ఎకనామిక్స్/ఎకనోమెట్రిక్స్
 ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్-ఖాళీలు: 36
 అర్హత: పీజీ ఇన్ స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్
 స్టాటిస్టిక్స్/అప్లయిడ్ స్టాటిస్టిక్స్
 వయోపరిమితి: 21-30 ఏళ్లు(ఆగస్ట్1, 2013నాటికి)
 దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 16, 2013.
 రాత పరీక్షలు ప్రారంభం: నవంబర్ 9, 2013.
 వివరాలకు: www.upsc.gov.in
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement