ఇండియన్ నేవీ
జాబ్ పాయింట్
లా కేడర్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్)
ఇండియన్ నేవీలో లా కేడర్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) కోర్సు 2017, జనవరిలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శిక్షణ, ఎంపిక విధానం, వేతనం తదితర వివరాలు...
అర్హతలు
55 శాతం మార్కులతో లా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 1990, జనవరి 2 - 1995, జనవరి 2 మధ్య జన్మించినఅవివాహితులు మాత్రమే అర్హులు. ప్రస్తుతం లా చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవడం కుదరదు.
శారీరక ప్రమాణాలు
పురుషులు కనీసం 157 సెం.మీ. ఎత్తు; మహిళలు కనీసం 152 సెం.మీ. ఎత్తు ఉండాలి.
శిక్షణ
ఎంపికైన అభ్యర్థులకు సబ్ లెఫ్టినెంట్ హోదా కల్పించి కేరళలోని నేవల్ అకాడమీలో శిక్షణ ఇస్తారు.
వేతనం
సబ్ లెఫ్టినెంట్‌కు పే బ్యాండ్ 3/ రూ.15,600 - 39,100 స్కేల్‌తో 5,400 గ్రేడ్ పేతో వేతనం చెల్లిస్తారు. అదనంగా ఇన్‌స్ట్రక్షనల్, యూనిఫాం, హార్డ్ ఏరియా, ఇంటి అద్దె, రవాణా అలవెన్సులు కూడా ఉంటాయి. అన్ని కలుపుకొని సుమారు నెలకు రూ.74,100 వరకు పొందవచ్చు. గ్రూప్ ఇన్సూరెన్స్ అండ్ గ్రాట్యుటీ, ఇతర సదుపాయాలు ఉంటాయి.
ఎంపిక
లా డిగ్రీలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) షార్ట్‌లిస్ట్ చేస్తుంది. ఇందుకోసం కటాఫ్ మార్కులను నిర్ణయించే పూర్తి అధికారం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ)కి ఉంటుంది. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు 2016 జూన్- సెప్టెంబర్ మధ్య బెంగళూరు/ భోపాల్/ కోయంబత్తూర్/ విశాఖపట్నంలో ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూలను అయిదు రోజుల పాటు రెండు దశల్లో నిర్వహిస్తారు.
మొదటి దశలో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్‌ఫెక్షన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. ఈ దశలో అర్హత సాధించని అభ్యర్థులను అదే రోజున వెనక్కి పంపుతారు. రెండో స్టేజ్‌కు ఎంపికైన అభ్యర్థులకు సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ దశలను విజయవంతంగా పూర్తిచేసిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఖాళీల ఆధారంగా శిక్షణకు ఎంపికైన వారితో తుది జాబితా రూపొందిస్తారు.
కోర్సుకు ఎంపికైన అభ్యర్థులు కేరళలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నేవల్ ఓరియెంటేషన్ కోర్సులో ట్రైనింగ్ పొందుతారు. తర్వాత శిక్షణలో భాగంగా వేర్వేరు నేవల్ ట్రైనింగ్ యూనిట్లలో ప్రొఫెషనల్ ట్రైనింగ్‌కు పంపిస్తారు. శిక్షణ ప్రారంభమైన నాటి నుంచి లేదా ప్రాథమిక శిక్షణ పూర్తయిన తర్వాతి నుంచి అభ్యర్థులు రెండేళ్లపాటు ప్రొబేషన్‌లో ఉంటారు.
షార్ట్ సర్వీస్ కమిషన్
లా కేడర్‌లో ప్రవేశం పొందిన అభ్యర్థులకు మొదట పదేళ్ల సర్వీస్ మంజూరు చేస్తారు. తర్వాత అభ్యర్థుల ఆసక్తి, అవసరం, పనితీరు ఆధారంగా మరో నాలుగేళ్లు పొడిగించే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు
దరఖాస్తుకు గడువు ముగిసింది. దరఖాస్తు ప్రింటవుట్‌కు ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ల నకలు పత్రాలను జతపరిచి పోస్ట్ బాక్స్ నంబర్ 4, చాణక్య పురి పోస్ట్, న్యూఢిల్లీ-110021 చిరునామాకు సాధారణ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి.
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in