భారతదేశ చరిత్ర | History of India | Sakshi
Sakshi News home page

భారతదేశ చరిత్ర

Published Mon, Oct 17 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

భారతదేశ చరిత్ర

భారతదేశ చరిత్ర

ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రధానమంత్రిని ఏమని పిలిచేవారు?

 ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రధానమంత్రిని ఏమని పిలిచేవారు?    - వజీర్
 ఢిల్లీ సుల్తానుల పాలనలో సైనిక మంత్రిని ఏమని పిలిచేవారు?    - దివాన్ - ఇ - అరీజ్
 ఇస్లాం చట్టాలను ఏ పేరుతో పిలుస్తారు?
 - షరియత్
 ‘సుల్తానుల కిరీటంలోని ప్రతి ముత్యం పేద రైతుల కన్నీటి నుంచి ఘనీభవించిందే’ అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు?
 - అమీర్ ఖుస్రూ
 ఢిల్లీ సుల్తానుల కాలంలో హిందువులను ఏమని పిలిచేవారు?     - జిమ్మీలు
 భారతదేశంలో చిస్తీ శాఖను ఎవరు స్థాపించారు?     - షేక్ అబ్దుల్లా చిస్తీ
 అక్బర్ గౌరవాన్ని స్వీకరించిన సూఫీ సాధువు ఎవరు?    - షేక్ సలీం చిస్తీ
 భారతదేశంలో ఖాద్రీ శాఖను ఎవరు ప్రవేశపెట్టారు?     - షేక్ జిలానీ ఖాద్రీ
 ఖాద్రీ శాఖకు చెందిన మొగల్ వంశ రాకుమారుడు ఎవరు?     - దారాషుకో
 సూఫీల వల్ల అభివృద్ధి చెందిన భాష ఏది?
 - ఉర్దూ
 విజయనగర సామ్రాజ్యానికి తొలి రాజధాని ఏది?    - అనెగొంది
 తుంగభద్ర నదీ తీరంలో ఏడు కొండల మధ్య ఉన్న రాజధాని ఏది?
 - విజయనగర విద్యానగరం
 మధురా విజయం గ్రంథకర్త ఎవరు?
 - గంగాంబ (గంగాదేవి)
 మహాబలిపురంలో నిర్మించిన దేవాలయం ఏది?    - తీర దేవాలయం
 పల్లవుల కాలంలో రాజభాష ఏది?
 - సంస్కృతం
 పల్లవులు స్థాపించిన సంస్కృత విద్యా సంస్థలను ఏమని పిలిచేవారు?
 - ఘటికలు
 మొదటి నరసింహవర్మ ఆస్థాన కవి?
 - భారవి
 భారవి రచించిన సంస్కృత గ్రంథం ఏది?
 - కిరాతార్జునీయం
 నయనార్లు అంటే?    - శైవ మత గురువులు
 కంచిలో కైలాసనాథ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు?     - రెండో నరసింహ వర్మ
 గంగావతరణానికి మరో పేరు?
 - అర్జునుడి తపస్సు
 చోళుల రాజధాని నగరం ఏది?
 - తంజావూరు
 చోళుల రాజచిహ్నం ఏది?    - పులి
 తంజావూర్ బృహదీశ్వరాలయాన్ని ఎవరు నిర్మించారు?    - మొదటి రాజరాజు
 బృహదీశ్వరాలయానికి అసలు పేరు ఏది?
 - రాజరాజేశ్వర ఆలయం
 బృహదీశ్వరాలయ నిర్మాణం ఏ సంవత్సరంలో పూర్తయింది?    - క్రీ.శ. 1009
 రాజేంద్రుడి చేతిలో ఓటమి పాలైన శ్రీ విజయ రాజు ఎవరు?
 - విజయోత్తుంగ మారవర్మ
 అమ్మంగదేవిని వివాహం చేసుకున్న తూర్పు చాళుక్య రాజు ఎవరు?
 - రాజరాజ నరేంద్రుడు
 చోళుల కాలంలో గ్రామ సభలు ఏవి?
 - ఉర్, సభ, నగరం
 భూస్వాములు సభ్యులుగా ఉన్న సభ?
 - ఉర్
 బ్రాహ్మణులు సభ్యులుగా ఉన్న సభ?
 - సభ
 వర్తకులు సభ్యులుగా ఉన్న సభ ?
 - నగరం
 చోళ రాజ్యంలో నిర్మించిన ప్రధాన రహదారులను ఏ పేరుతో పిలిచేవారు?
 - పేరూవాలీలు
 చైనా చక్రవర్తికి రాయబారాలు పంపిన చోళ పాలకుడు ఎవరు? - మొదటి కులోత్తుంగుడు
 తమిళ సాహిత్యంలో ‘కవి చక్రవర్తి’గా  ప్రసిద్ధి చెందిన పండితుడు ఎవరు?
 - కంబన్
 ంబన్ రచించిన ప్రముఖ తమిళ గ్రంథం ఏది?    - తమిళ రామాయణం
 ‘పెరియ పురాణం’ గ్రంథకర్త ఎవరు?
 - శెక్కిలార్
 కేశవస్వామి రచించిన సంస్కృత నిఘంటువు ఏది?    - నానార్థ నవ సంక్షేమం
 చోళ యుగం కాలంలో పోతపోసిన విగ్రహాల్లో విశిష్టమైనవి ఏవి?
 - నటరాజ విగ్రహాలు
 నాలుగు చేతులు కలిగిన నటరాజస్వామి విగ్రహం ఉన్న ప్రధాన క్షేత్రం ఏది?
 - చిదంబర దేవాలయం
 రాజపుత్రుల చరిత్రపై విస్తృతమైన పరిశోధన చేసిన ఆంగ్లేయుడు?    - కల్నట్ టాడ్
 కల్నట్ టాడ్ రచించిన గ్రంథం ఏది?
 - రాజస్థాన్ కథావళి
 ‘పృథ్వీరాజ్ రాసో’ గ్రంథ రచయిత?
 - చాంద్ బర్దాయ్
 మిహిర భోజుడి ఆస్థానాన్ని సందర్శించిన అరబ్ యాత్రికుడు ఎవరు?    - సులేమాన్
 ముస్లిం దాడులను ఎదుర్కోవడానికి ‘తురకదండు’ అనే పేరుతో పన్ను వసూలు చేసిన రాజపుత్ర వంశం ఏది?
 - గహద్వాలులు
 జయచంద్రుడి కూతురు రాణి సంయుక్తను వివాహం చేసుకున్న చౌహాన్ వంశ పాలకుడెవరు?     - పృథ్వీరాజ్ చౌహాన్
 ‘హిందూ జాతీయ వీరుడు’ అని ప్రశంసలందుకున్న చక్రవర్తి?     -పృథ్వీరాజ్ చౌహాన్
 ఢిల్లీ ప్రాంతాన్ని పాలించిన తొలి రాజవంశం ఏది?    - తోమార
 చందేల రాజుల రాజధాని నగరం ఏది?- ఖజురహో (మధ్యప్రదేశ్)
 చందేల రాజుల్లో గొప్పవాడు ఎవరు?
 - విద్యాధరుడు
 ఖజురహోలో ప్రసిద్ధి చెందిన దేవాలయం?
     - కాందరీయ మహా దేవాలయం
 వజ్రయాన బౌద్ధాన్ని టిబెట్‌లో ప్రచారం చేసినవారు?    - అతిశ దీపాంకరుడు
 లక్ష్మణసేనుని ఆస్థానకవులకు మరో పేరు?
     - పంచరత్నాలు
 పంచరత్నాల్లో ప్రముఖ కవి?- జయదేవుడు
 నలంద విశ్వవిద్యాలయాన్ని ఏ ముస్లిం సేనాని ధ్వంసం చేశాడు?    - భక్తియార్ ఖిల్జీ
 కోణార్‌‌కలో ‘సూర్య దేవాలయం’ను ఎవరు నిర్మించారు?    - నరసింహ దేవుడు
 రామానుజచార్యులు ఎక్కడ జన్మించారు?
 - తమిళనాడులోని పెరంబదూర్
 రామానుజాచార్యులు స్థాపించిన మతం?
 - శ్రీ వైష్ణవం
 ద్వైత, అద్వైత సిద్ధాంతాలకు సమన్వయం సాధిస్తూ భేదాభేద సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?     - నింబార్కుడు
 క్షేమేంద్రుడు రచించిన గ్రంథం ఏది?
 - బృహత్ కథామంజరి
 రాజపుత్రుల కాలంలో కశ్మీర్ రాజుల చరిత్రను వివరించే గ్రంథం ఏది?
 - రాజతరంగిణి
 రాజతరంగిణి గ్రంథకర్త ఎవరు?    - కల్హణుడు
 అరబ్బులు సింధూ ప్రాంతాన్ని ఎప్పుడు ఆక్రమించారు?    - క్రీ.శ. 712
 ు్ట్బలకు నష్టపరిహారం చెల్లించడానికి నిరాకరించిన సింధు రాజు?    - దాహిర్
 సంధ్‌ను ఆక్రమించిన అరబ్ సైన్యానికి నాయకుడు ఎవరు?    - మహమ్మద్ బిన్ కాశీం
 అరబ్బుల దండయాత్రను ‘సత్ఫలితాలు ఇవ్వని ఘనవిజయం’గా వర్ణించిన చరిత్రకారుడు?     - లేన్‌పూల్
 అరబ్బులు ‘బంగారు నగరం’ అని దేన్ని పిలిచేవారు?    - ముల్తాన్
 బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి అనుమతి ఇచ్చిన ఇంగ్లండ్ రాణి?    -మొదటి ఎలిజబెత్
 బ్రిటిషర్లు మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు?
 - 1611
 మచిలీపట్నానికి చేరిన ఆంగ్లేయ నౌక?
 - గ్లోబ్
 మద్రాసు స్థావరాన్ని ఏర్పాటు చేసిన బ్రిటిష్ ఉద్యోగి ఎవరు?    - ఫ్రాన్సిస్ డే
 మద్రాసు స్థావరాన్ని ఆంగ్లేయులకు ఇచ్చిన చంద్రగిరి పాలకుడు ఎవరు?
 - మూడో వెంకటపతి రాయలు (విజయనగర రాజు)
 ఆంగ్లేయులు, మూడో వెంకటపతి రాయలకు మధ్యవర్తిగా వ్యవహరించిన శ్రీకాళహస్తి వాస్తవ్యుడు ఎవరు?
 - దామెర్ల వెంకటాద్రి నాయుడు
 మద్రాసులో ఆంగ్లేయులు నిర్మించిన కోట?    
 - సెయింట్ జార్జికోట
 కలకత్తా స్థావరాన్ని ఏర్పాటు చేసిన బ్రిటిష్ ఉద్యోగి?    - జాబ్ చార్నాక్
 జాబ్ చార్నాక్ కలకత్తా స్థావరాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం?    - 1690
 ఆంగ్లేయులకు బంగారు ఫర్మానా ఇచ్చిన గోల్కొండ సుల్తాన్?     - అబ్దుల్లా కుతుబ్‌షా
 అబ్దుల్లా కుతుబ్‌షా బంగారు ఫర్మానాను జారీ చేసిన సంవత్సరం?     - 1632
 భారతదేశంలో ఫ్రెంచి వారి ప్రధాన స్థావరం ఏది?     - పాండిచ్చేరి (పుదుచ్చేరి)
 రాబర్‌‌ట క్లైవ్ బిరుదు?     - ఆర్కాట్ వీరుడు
 ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది?
 - 1757 జూన్ 23
 కలకత్తా చీకటి గది ఉదంతం జరిగిన సంవత్సరం?     - 1756
 కలకత్తా చీకటి గది ఉదంతాన్ని ప్రస్తావించిన ఆంగ్లేయుడు?     - హాల్‌వెబ్
 సిరాజుద్దౌలా కలకత్తాను ఆక్రమించి ఆ నగరానికి ఏ పేరు పెట్టాడు? - అలీ నగర్
 భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం? - ప్లాసీ యుద్ధం
 భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసినవారు?     - రాబర్‌‌ట క్లైవ్
 బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
 - 1764 అక్టోబర్
 బక్సార్ యుద్ధం సమయంలో బెంగాల్ గవర్నర్ ఎవరు? - వాన్ సిట్టార్
 
 ఎం.వెంకటరమణ రావు
 అసిస్టెంట్ ప్రొఫెసర్,
 నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నల్లగొండ.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement