1857 తిరుగుబాటు ప్రారంభమైన రోజు? | 1857 it opened a rebellious | Sakshi
Sakshi News home page

1857 తిరుగుబాటు ప్రారంభమైన రోజు?

Published Wed, Oct 19 2016 3:18 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

1857 తిరుగుబాటు ప్రారంభమైన రోజు?

1857 తిరుగుబాటు ప్రారంభమైన రోజు?

డల్హౌసీ విద్యా సంస్కరణలకు సహకరించిన అధికారి? మాగ్నాకార్టాగా పేర్కొనే విద్యా ప్రణాళిక?

డల్హౌసీ విద్యా సంస్కరణలకు సహకరించిన అధికారి?     - చార్లెస్ ఉడ్
మాగ్నాకార్టాగా పేర్కొనే విద్యా ప్రణాళిక?     
- చార్లెస్ ఉడ్ ప్రణాళిక
భారత్‌లో తొలి ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించినవారు?     - డల్హౌసీ
భారతీయ మగ్గాలపై ఆంగ్లేయులు విధించిన పన్ను?     - మోతుర్పా
ఐసీఎస్‌కు ఎన్నికైన తొలిభారతీయుడు?ఙ- సత్యేంద్రనాథ్ ఠాగూర్
గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని తొలి న్యాయశాఖ సభ్యుడు ఎవరు?    - మెకాలే
భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన సంవత్సరం?     - 1835
హంటర్ కమిషన్‌ను 1882లో నియమించిన వైస్రాయ్?    - లార్‌‌డ రిప్పన్     కిత్తురు రుగుబాటుకు నాయకత్వం వహించిన స్త్రీ?    - రాణీ చెన్నమ్మ
1857 తిరుగుబాటును ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా పేర్కొన్నవారు?        
- వి.డి.సావర్కర్
వి.డి. సావర్కర్ 1857 తిరుగుబాటుపై రచించిన గ్రంథం?    
- ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్‌‌స
క్రైస్తవ మత ప్రచారానికి అవకాశం కల్పించిన చట్టం?     - 1813 చట్టం
మొట్టమొదటి సిపాయి తిరుగుబాటు జరిగిన సంవత్సరం?    - 1806 (వేలూరు)
1857 తిరుగుబాటు ప్రారంభమైన ప్రాంతం?     - మీరట్ (ఉత్తరప్రదేశ్)
1857 తిరుగుబాటు ప్రారంభమైన  రోజు?- 1857 మే 10
తాంతియాతోపే అసలు పేరు- రామచంద్ర పాండురంగ
లక్ష్మీబాయి అసలు పేరు?    
- మణికర్ణిక (మనూబాయి)
ఝాన్సీ లక్ష్మీబాయి భర్త, ఝాన్సీ పాలకుడు?    - గంగాధర్‌రావు
ఝాన్సీ లక్ష్మీబాయిని ఓడించిన ఆంగ్ల సేనాని?    - సర్ హ్యూగ్ రోజ్
ఈస్టిండియా కంపెనీ పాలన అంతరించిన సంవత్సరం?     - 1858
హత్యకు గురైన ఏకైక వైస్రాయ్?    - మేయో
ముస్లింలీగ్ పార్టీ కాంగ్రెస్‌తో చేసుకున్న ఒడంబడిక?    - లక్నో ఒడంబడిక
హోంరూల్ ఉద్యమాన్ని మొట్టమొదట ప్రారంభించినవారు?    
- బాల గంగాధర్ తిలక్
1916 ఏప్రిల్‌లో బాలగంగాధర్ తిలక్  హోంరూల్ ఉద్యమాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించారు?    - పూనా నుంచి
హోంరూల్ ఉద్యమ కాలంలో తిలక్ ఇచ్చిన నినాదం?    - స్వరాజ్యం నా జన్మహక్కు
హోంరూల్ ఉద్యమ కాలంలో తిలక్‌కు ఇచ్చిన బిరుదు?    - లోకమాన్య
హోంరూల్ ఉద్యమ కాలం నాటి  వైస్రాయ్?ఙ- ఛేమ్స్‌ఫర్‌‌డ
నాసిక్ కుట్ర కేసులో ఎవరికి ఉరి శిక్ష విధించారు?    - అనంత లక్ష్మణ్
అరవింద ఘోష్ సోదరుడు?    
- బదీంద్ర ఘోష్
అలీపూర్ బాంబ్ కేసులో ప్రధాన ముద్దాయి?     - అరవింద్ ఘోష్
లండన్‌లో ఇండియన్ సోషియాలజిస్ట్ అనే పత్రిక ద్వారా విప్లవాన్ని ప్రచారం చేసినవారు?     - శ్యాంజీ కృష్ణవర్మ
గదర్ పార్టీ ఏర్పడిన సంవత్సరం?    - 1913
గదర్ అంటే అర్థం?    - తిరుగుబాటు
మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ జన్మదినం? - 1869 అక్టోబర్ 2  (గుజరాత్‌లోని పోరుబందర్‌లో)    దక్షిణాఫ్రికాలో గాంధీజీ నడిపిన పత్రిక
    - ఇండియన్ ఒపీనియన్
భారత్‌లో బిపిన్ చంద్రపాల్ నడిపిన పత్రిక?     - న్యూ ఇండియా    తిలక్ జన్మించిన ప్రదేశం?     - పూనా    1906లో కలకత్తాలో శివాజీ ఉత్సవాలను ప్రారంభించినవారు? - బాల గంగాధర్ తిలక్
ఆనంద్‌మఠ్ గ్రంథం రచించినవారు?ఙ- బకిం చంద్ర ఛటర్జీ (1882)
బెంగాల్ కెమికల్ కర్మాగారాన్ని స్థాపించినవారు?     - ప్రఫుల్ల చంద్రరాయ్
స్లింలీగ్ పార్టీని స్థాపించిన సంవత్సరం?     - 1906    సాధుజన పరిపాలనా సంఘం స్థాపకులు?     - అయ్యంకాళి
సూరత్ కాంగ్రెస్ సమావేశంలో అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన మితవాద నాయకుడు?     - రాస్ బిహారీ ఘోష్
తిలక్ నాయకత్వంలో అతివాదులు ఏర్పరచుకున్న పార్టీ?     - నేషనల్ పార్టీ
ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పరచిన చట్టం?     - 1909 చట్టం
1909 లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు?     - మదన్ మోహన్ మాలవ్య
హోంరూల్ ఉద్యమ నాయకులు?
    - బాలగంగాధర తిలక్, అనీబిసెంట్
తిలక్.. మాండలే జైల్లో ఉన్న కాలం?
- 19081914
బెంగాల్ గెజిట్‌ను  స్థాపించినవారు?ఙ- జేమ్స్ అగస్టస్ హిక్కీ
కేశవ చంద్రసేన్ స్థాపించిన ఆంగ్ల పత్రిక?
- ఇండియన్ మిర్రర్ (ఆంగ్లంలో తొలి దినపత్రిక)    తెలుగులో తొలి పత్రిక? - సత్యదూత (బళ్లారి క్రైస్తవ సంఘం స్థాపించిన ఈ పత్రిక 1835లో వెలువడింది)
జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన తొలి ముస్లిం?    - బద్రుద్దీన్ త్యాబ్జీ
జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు, తొలి విదేశీయుడు, తొలి క్రైస్తవుడు?    - జార్జి యూల్
జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పనిచేసిన తొలి ఆంధ్రుడు?     - పి. ఆనందాచార్యులు
గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక కాంగ్రెస్ సమావేశం?     - బెల్గాం (1924)
జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ?    
- సరోజినీ నాయుడు
కాంగ్రెస్ చరిత్రను రచించినవారు?
- భోగరాజు పట్టాభి సీతారామయ్య
    కాంగ్రెస్ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. నా పదవీ కాలంలో అది సులభంగా చనిపోయేందుకు సాయపడటమే నాకున్న పెద్ద కోరిక అని ప్రకటించిన వైస్రాయ్?
- కర్జన్
    బెంగాల్‌ను విభజించిన  వైస్రాయ్కర్జన్ (1905, జూలై 20న)
    బెంగాల్ విభజన అమల్లోకి వచ్చిన r తేదీ?- 1905, అక్టోబర్ 16
లాలా లజపతిరాయ్  బిరుదు?- పంజాబ్ కేసరి
    1926లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశంలో par పాల్గొన్నవారు?ఙ- లాలా లజపతిరాయ్
లాలా లజపతిరాయ్ నడిపిన పత్రికలు?
- 1. వందేమాతరం (ఉర్దూ)
   2. పీపుల్ (ఇంగ్లిష్)
జ్యోతిరావు పూలే నాకు స్ఫూర్తిప్రదాత అని ప్రకటించిన మేధావి? - బి.ఆర్. అంబేద్కర్
ఆర్యసమాజ  స్థాపకుడు?ఙ- స్వామి దయానంద సరస్వతి (1875లో)
ఆర్యసమాజానికి ప్రామాణిక  గ్రంథం?ఙ- సత్యార్థ ప్రకాశిక
స్వామి దయానంద సరస్వతి తొలి సందేశాన్ని వినిపించిన par ప్రాంతం?ఙ- హరిద్వార్
స్వామి వివేకానంద అసలు పేరు?    
- నరేంద్రనాథ్ దత్తా
భారతదేశం నా స్వర్గం, భారతదేశ శ్రేయస్సే నా శ్రేయస్సు, భారతీయుడనని గర్వించు, ప్రతి భారతీయుడు నా సోదరుడే అని సగర్వంగా ప్రకటించు.. అని జాతీయతను par ప్రబోధించినవారు?ఙ- స్వామి వివేకానంద
భారత్‌లో దివ్యజ్ఞాన సమాజ తొలి శాఖ ఏర్పడిన ప్రాంతం?    - బొంబాయి (1879)్యూయార్‌‌క నుంచి దివ్యజ్ఞాన సమాజ ప్రధాన కార్యాలయాన్ని మార్చిన ప్రాంతం?    - అడయార్ (తమిళనాడు)
బెనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించిన సంవత్సరం?    - 1916
అలీగఢ్ ఉద్యమ  స్థాపకుడు?ఙ- సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ఏర్పడిన సంవత్సరం?    - 1920
గాంధీజీ వద్దకు రాయబారిగా వైస్రాయ్ హార్డింజ్ ఏ మితవాద నాయకుడిని పంపించారు?     - గోపాలకృష్ణ గోఖలే
గాంధీజీ గురువు?     - గోపాలకృష్ణ గోఖలే
గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన సంవత్సరం? - 1915 (జనవరి 9)
జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిన  రోజు? - 1919, ఏప్రిల్ 13  (వైశాఖ పౌర్ణమి రోజున)
జలియన్ వాలాబాగ్ సంఘటనపై విచారణ జరపడానికి నియమించిన కమిషన్?    
            - హంటర్
జలియన్ వాలాబాగ్ సంఘటనకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడు?     - సర్ శంకరన్ నాయర్
జలియన్ వాలాబాగ్ సంఘటన అనంతరం పంజాబ్‌లో సైనిక శాసనాన్ని అమలు చేసి, అనేక మందికి మరణ శిక్షలు విధించిన పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్?
- మైకేల్-ఓ-డయ్యర్
మైకేల్-ఓ-డయ్యర్‌ను లండన్‌లో కాల్చి చంపిన యువకుడు?      - ఉద్దంసింగ్
సహాయ నిరాకరణోద్యమ కాలంలో గాంధీ వదులుకున్న par బిరుదు?ఙ- కైజర్-ఎ- హింద్
చౌరీ చౌరా సంఘటన జరిగిన , ఫిబ్రవరి 5
విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ ఆమోదించిన జాతీయ జెండా రూపకర్త?     - పింగళి వెంకయ్య
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement