నానాసాహెబ్ పేరు కలిగిన పీష్వా?
పీష్వాల ప్రాబల్యాన్ని అంతం చేసిన యుద్ధం?
– మూడో పానిపట్ యుద్ధం(క్రీ.శ.1761)
చివరి పీష్వాల్లో గొప్పవాడు
– పీష్వా మాధవరావ్
చివరి పీష్వా – రెండో బాజీరావ్
పీష్వాల యుగ కాలం – క్రీ.శ.17131818
పీష్వాల రాజధాని? –పూనా
మహారాష్ట్ర కూటమిని ఏర్పాటు చేసిన వ్యక్తి?– బాలాజీ విశ్వనాథ్
పీష్వాల్లో అగ్రగణ్యుడు?–మొదటి బాజీరావ్
మూడో పానిపట్ యుద్ధంలో మరాఠా కూటమి నాయకుడు?– సదాశివ రావ్
పీష్వా పదవి రద్దయిన సంవత్సరం?
క్రీ.శ.1818 మహారాష్ట్ర చరిత్రలో పీష్వాల యుగం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. వీరి కాలంలో మహారాష్ట్ర ప్రాబల్యం, ఆసేతు హిమాలయాల వరకు విస్తరించింది.
బాలాజీ విశ్వనాథ్ క్రీ.శ. 17131720 సాహు నుంచి పరిపాలనాధికారాన్ని వంశపారంపర్య హక్కులతో పొందాడు. బాలాజీ విశ్వనాథ్ చిత్పవన వంశానికి చెందిన బ్రాహ్మణుడు. ఇతని పూర్వీకులు జింజిరా రాజ్యంలోని శ్రీవర్ధన్ ప్రాంతానికి చెందినవారు.
బాలాజీ విశ్వనాథ్ మొగలులతో సత్సంబంధాలను ఏర్పరచుకున్నాడు. మొగల్ రాకుమార్తె జీనత్ ఉన్నిసా మెప్పు పొందాడు.
సాహు మొగల్ చెర నుంచి విముక్తుడై∙మహారాష్ట్ర చేరుకున్నప్పుడు అతనికి కుడి భుజంగా నిలిచాడు. సాహును రాజును చేయడానికి తోడ్పడ్డాడు. బాలాజీ శక్తి సామర్థ్యాలు, రాజభక్తిని గుర్తించిన సాహు క్రీ.శ. 1713 నవంబర్ 16న అతన్ని పీష్వాగా నియమించాడు. బాలాజీ విశ్వనాథ్‌ను మహారాష్ట్ర సామ్రాజ్య ద్వితీయ స్థాపకుడుగా చెప్పవచ్చు.
బాలాజీ విశ్వనాథ్ క్రీ.శ.1714లో మొగలులతో సంధి చేసుకొని దక్కన్‌లో చౌత్, సర్దేశ్‌ముఖ్(పన్నులు)లను వసూలు చేసుకొనే హక్కు పొందాడు. ఈ సంధిలో మొగలుల తరపున సయ్యద్ సోదరులు ముఖ్యపాత్ర పోషించారు. అదేవిధంగా మొగల్ చక్రవర్తి ఫరుక్సియార్‌ను పతనం చేయడంలో సయ్యద్ సోదరులకు బాలాజీ విశ్వనాథ్ సహాయం అందించాడు.
రాజారాం కాలంలో ప్రారంభమైన జాగీర్దారీ విధానం, బాలాజీ విశ్వనాథ్ కాలంలో విస్తృతమైంది. ఈ క్రమంలో మహారాష్ట్ర రాజ్యం వివిధ భాగాలుగా విభజితమై.. మహారాష్ట్ర కూటమి అనే వ్యవస్థ ఏర్పడింది. ఈ పరిణామాలు చివరికి ఎవరికి వారు స్వాతంత్రం ప్రకటించుకునే స్థాయికి వెళ్లాయి. ఈ కూటమే మహారాష్ట్రుల పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది.
మహారాష్ట్ర కూటమి సభ్యులు
ఖాందేష్, బాలాఝాట్–పీష్వాల ఆధీనంలో
కొంకణ్ – ఆంగ్లేయుల ఆధీనంలో
బీరార్, గోండ్వానా– భోంస్లేల ఆధీనంలో
గుజరాత్ – గైక్వాడ్‌ల ఆధీనంలో
మాళవ – నేమాజీ సింధియా ఆధీనంలో ఉంచారు.
బాలాజీ విశ్వనాథ్‌ను సాహు ‘అతుల పరాక్రమ సేవక’ అని అభినందించాడు. ఇతడు తారాబాయితో వార్నా సంధి చేసుకున్నాడు. విశ్వనాథ్ క్రీ.శ.1720, ఏప్రిల్ 2 అకస్మాత్తుగా మరణించాడు.
పీష్వా మొదటి బాజీరావ్ క్రీ.శ. 17201740
బాలాజీ విశ్వనాథ్ పెద్ద కుమారుడే బాజీరావ్. మహారాష్ట్ర చరిత్రలో శివాజీ తర్వాత చెప్పుకోదగ్గ యోధుడు. ఇతని తెలివితేటలు, శక్తి సామర్థ్యాలపై నమ్మకంతో సాహు ఇతన్ని పీష్వాగా నియమించాడు. బాజీరావ్‌కు పరిపాలనలో అతని సోదరుడు చిమ్నాజీ అప్పా సహకరించాడు.మొదటి బాజీరావు ఆశయం హిందూ పద్ పద్ షాహీ స్థాపించడం.
మొదటి బాజీరావ్ దక్కన్ సుబేదార్ అయిన నిజాం–ఉల్–ముల్క్‌తో మూడు యుద్ధాలు చేసి నిజాంను ఓడించి, అతన్ని మూడు సంధి షరతులకు ఒప్పించాడు.
పీష్వా బాజీరావ్ క్రీ.శ.1728లో పాల్కేడ్ వద్ద జరిగిన యుద్ధంలో నిజాం –ఉల్–ముల్క్‌ను ఘోర పరాజితుడిని చేశాడు. పాల్కేడ్ యుద్ధంలో ఓడిపోయిన నిజాం క్రీ.శ. 1728లో ముంగిషివగావాన్ సంధి చేసుకున్నాడు.
క్రీ.శ. 1731లో నిజాం రెండోసారి బాజీరావ్‌తో చేసిన సూరత్ యుద్ధంలో ఓడిపోయి క్రీ.శ. 1732లో రోహారామేశ్వర్ సంధి చేసుకున్నాడు.
మహారాష్ట్ర దాడులను ఎదుర్కొనే సమర్ధత ఒక్క నిజాంకే ఉందని భావించిన మొగల్ చక్రవర్తి, మçహ్మద్‌షా అతన్ని ఢిల్లీకి రప్పించి అసఫ్‌జా అనే బిరుదును ప్రదానం చేశాడు. దాంతోపాటు తగిన సహాయ సంపత్తిని అందించి మహారాష్ట్రులను ఎదుర్కోవాలని ఆదేశించాడు.
క్రీ.శ.1738లో చారిత్రాత్మకమైన భోపాల్ యుద్ధంలో బాజీరావ్ చేతిలో నిజాం ఓడిపోయి క్రీ.శ.1738, జనవరి 17న దోరాహ్ సంధి చేసుకున్నాడు.
సాహు గురువు బ్రహ్మేంద్రస్వామి స్థాపించిన పరశురామ్ ఆలయాన్ని ధ్వంసం చేసిన జింజిరా సిద్ధీలను కూడా ఓడించాడు. అదే విధంగా మాళ్వా సుబేదార్ గిరిథర్ బహుదూర్‌ని ఓడించి చంపేశాడు.
మస్తానీ ఒక మహ్మదీయ స్త్రీ. ఆమెను ఛత్రసాల్ బుందేలా.. బాజీరావ్‌కు బహూకరించాడు. గొప్ప సౌందర్యరాశి అయిన ఆమె∙బాజీరావ్‌కు అత్యంత ప్రీతిపాత్రమైంది. మస్తానీ వల్లే బాజీరావ్ తప్పుదోవ పడుతున్నాడనే కారణంతో ఆమెను బాజీరావ్æ కుమారులు బాలాజీ బాజీరావ్, చిమ్నాజీ అప్పాలు నిర్బంధంలో ఉంచారు. దాంతో మనోక్షోభకు గురైన బాజీరావ్ క్రీ.శ. 1740లో మరణించాడు. ఈ వార్త తెలిసిన మస్తానీ కూడా కన్నుమూసింది.
పీష్వా బాలాజీరావ్ లేదా బాలాజీ బాజీరావ్ క్రీ.శ. 17401761
మొదటి బాజీరావ్ మరణానంతరం అతని పెద్ద కుమారుడు బాలాజీ బాజీరావ్ పీష్వా పదవిని అలంకరించాడు. ఇతనికి నానా సాహెబ్ అనే పేరు కూడా ఉంది. ఇతడు కర్నాటక నవాబు దోస్త్ ఆలీని చంపడంతోపాటు ఇతని అల్లుడు చాందా సాహెబ్‌ను బందీ చేశాడు.
సాహు నిర్వాసితుడిగా మరణిస్తూ తన తర్వాత ఛత్రపతిగా తారాబాయి మనవడు రామరాజును ప్రకటించాడు.
మూడో పానిపట్ యుద్ధం – 1761
అబ్దాలీ తెగకు చెందినవాడు అహ్మద్ షా. ఇతడు పర్షియాలో నాదిర్షా కొలువులో ఉండేవాడు. అహ్మద్‌షా అబ్దాలీకి, మహారాష్ట్రులకు జరిగిన చారిత్రక యుద్ధమే మూడో పానిపట్టు యుద్ధం (క్రీ.శ.1761, జనవరి 14).
మూడో పానిపట్టు యుద్ధంలో అబ్దాలీని ఎదుర్కొనేందుకు సదాశివరావ్, విశ్వాసరావ్‌లు మహారాష్ట్ర సేనలకు నాయకత్వం వహించారు. కానీ, విజయం అబ్దాలీ వశమైంది. ఈ యుద్ధంతో మహారాష్ట్ర పతనం ప్రారంభమైంది.
ఓటమిని భరించలేని బాలాజీ బాజీరావ్ క్రీ.శ. 1761లో మరణించాడు. తర్వాత పీష్వాగా మాధవరావ్ వచ్చాడు.
ఛత్రపతుల పరంపర
సాహు క్రీ.శ.17081748
రామరాజు క్రీ.శ.17491777
రెండో సాహు క్రీ.శ.17771808
ప్రతాప్ సిన్హా క్రీ.శ.18081839
చివరి పీష్వా
రెండో షాజీ క్రీ.శ. 18391848.
పీష్వాల పరంపర
మాధవరావ్ క్రీ.శ. 17611772
నారాయణ రావ్ క్రీ.శ. 17721773
రెండో మాధవరావ్ క్రీ.శ. 17731795
రెండో బాజీరావ్ క్రీ.శ. 17951818